కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి..

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

స్వామి వారి పున:ప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్ రెడ్డి.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం
కొడవటంచ ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వివిధ శాఖల అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.బుధవారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బాలాలయంలో ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యవార్లు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. మరో 50 రోజుల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఫిబ్రవరి నెలలో జరిగే స్వామి వారి పున:ప్రతిష్ఠ శ్రీ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్టి పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఆలయాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రములోని మొట్టమొదటి సారిగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ ఆలయ పున:అభివృద్ధికి పనులను కొరకు రూ.12.15 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయంలో విమాన గోపుర అర్ధ మండపం, మహా మండపం, అద్దాల మండపం, ఆళ్వార్ నిలయం, పాకశాల, క్యూలైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్ మరియు తాగు నీటి సౌకర్యం తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు, సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

మద్ది మేడారాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద.

మద్ది మేడారాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద.

#అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో జాతరను దిగ్విజయం చేయాలి.

#ప్లాస్టిక్ రహిత జాతరగా మద్ది మేడారాన్ని నిలపాలి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ప్లాస్టిక్ రహితంగా మద్ది మేడారం జాతరను అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో ముందుకు సాగి జాతరను దిగ్విజయం చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం మండలంలోని నాగరాజు పల్లి గ్రామ శివారులో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం, వైద్యం అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ భక్తులను అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ జాతరలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు ఇప్పిస్తే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాతరను సజావుగా సాగే విధంగా ఆలయ కమిటీ కృషి చేస్తుందని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి జాతరకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, నాగరాజు పల్లి సర్పంచ్ ఎరుకల లలిత, మామిండ్ల వీరేపల్లి సర్పంచ్ ఏడాకుల సరోజన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ , విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరము గ్రామాభివృద్ధికి కృషి…

రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరము గ్రామాభివృద్ధికి కృషి

సర్పంచుల చేతుల్లోకి పాలన పగ్గాలు

స్వాగతం పలుకుతున్న సమస్యలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మూడో విడత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీల పాలకవర్గానికి నేడు గ్రామపంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు మెజార్టీ గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుక నున్నాయి 22 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ప్రగతి పనులు కుంటుపడ్డాయి ఇక సమస్యల సమయం ప్రజలకు ఇచ్చిన హామీలు అభివృద్ధి పనులు ప్రధమ పౌరులకు సవాలుగా నిలువనున్నాయి.

ప్రమాణమే ప్రామాణికం

కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారమే ప్రామాణికంగా గుర్తిస్తారు పంచాయితీ ఎన్నికల చట్టం కింద మూడో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారికి ప్రిసైడింగ్ అధికారులు గుర్తింపు పత్రాన్ని మాత్రమే ఇస్తారు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా, రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం సర్పంచులు, ఉపసర్పంచులు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రిజిస్టర్ లో సంతకాలు చేసిన తర్వాతనే వారినీ పాలక వర్గాలుగా గుర్తిస్తారు ఈరోజు నుండి పదవీకాలం లెక్కలోకి వస్తుంది.

స్వాగతం పలుకుతున్న సమస్యలు
కొత్తగా కొలువు తీరుతున్న పంచాయతీ పలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి దాదాపు రెండేళ్లుగా పంచా యతీల ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నా యి. సోమవారంతో ప్రత్యేక అధికారులపాలన ముగిసి కొత్త పాలకవర్గాలు అధికారంలోకి వచ్చారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించనీ కారణంగా ప్రత్యే క అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి 22 నెలలుగా వారి పాలనలో పంచాయతీలు కొనసాగుతున్నాయి ఇంత కాలం పాలక వర్గాలు లేకపో వడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పెరిగిపోయాయి. ఎన్నికలు సకాలంలో నిర్వహిం చక పోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయా యి రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేకపోయింది పేరుకే ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారం అంతా కార్య దర్శులు మొయ్యకతప్పలేదు పంచాయతీ కార్య దర్శులు కూడా తమకు సాధ్యమైనంత వరకు నెట్టు కోచ్చారు కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకా రంతో కార్యదర్శులకు ఇబ్బం దులు తప్పనుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలయితే గాని పంచాయతీల సమస్యలు తీరుతాయి

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్ల పూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు.. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొంతంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్ఎస్ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
విద్యావంతురాలిగా గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తా..

గుడ్లు రూప శ్రీనివాస్.

నిజాంపేట: నేటి ధాత్రి

సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామానికి ఎంతో సేవ చేస్తానని గుడ్ల రూప శ్రీనివాస్ అన్నారు. నిజాంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలనే సంకల్పంతో విద్యావంతురాలైన ఆమెను గ్రామ సర్పంచ్ గా గెలిపించాలన్నారు. గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతినిధులను గ్రామస్తులకు తెలిసే విధంగా గ్రామ సభలో వాటిని ప్రతి గ్రామస్తులతో చర్చించడం జరుగుతుందన్నారు. ముందుగా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు మొదటి ఐదు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఐదువేల ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. మల్కచెరువు కట్టను బలిష్టం చేసే వాకింగ్ ట్రాక్ సెల్ పాయింట్ స్టేట్ లైట్ ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం టోర్నమెంట్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని కలిగిస్తానన్నారు. సర్పంచ్ గా తమను గెలిపిస్తే గ్రామానికి మరింత సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు.

అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ..

*అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ..

*నిర్వాసితులకు ఆందోళన వద్దు..

*అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్..

పెద్దపంజాణి(నేటి ధాత్రి)

 

పెద్దపంజాణి మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతొందిఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు.ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగానే రోడ్డును ఏర్పాటు చేయాలని ఈమధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు ఆ పనులను చేపడుతున్నారు.అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భాగం రోడ్డు విస్తరణకు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాయల్ పేట గ్రామంలో పర్యటించి మార్కింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో స్థానికులు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి ఆందోళన వద్దని అధికారులు మరియు గ్రామస్తుల తో సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయ సేకరణ అనంతరమే పనులు చేపడతామని వారికి ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.

— ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.
ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని మండల ఎంపీడీవో రాజీరెడ్డి అన్నారు. మండలంలోని నగరం తాండ గ్రామంలో బుధవారం పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని దశలవారీగా లబ్ధిదారుల అకౌంట్లు ప్రభుత్వమే డబ్బులు జమ చేస్తుందన్నారు. ఇంచార్జ్ ఎంపీఓ నరసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి ఆరిఫ్, చంద్రహాస్ తదితరులు ఉన్నారు.

బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి…

బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి

పంచాయితీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారు

ఇప్పటికైనా గత బకాయిలు విడుదల చేసి వారిని ఆదుకోవాలి

లేని పక్షంలో జిల్లాలోని మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి / సిఎస్ఆర్ నిధుల నుండి

బతుకమ్మ ఏర్పాట్లకు నిధులు ఇవ్వాలి

గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, పి ఎ సి ఎస్ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం తెలంగాణలో ఆడబిడ్డలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ, మరియు దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పరిశుద్ధ పనులు, ఇతర పనులు చేయించలేక కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గత బకాయిలు చెల్లించి కార్యదర్శులను ఆదుకోవాలని గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, గణపురం సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ పంచాయతీ కార్యదర్శుల పట్ల అనవసర భారం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, పని భారంతో అప్పుల బాధతో కొందరు కార్యదర్శులు చనిపోతున్నారని ఇప్పటికైనా వస్తున్న బతుకమ్మ దసరా పండుగ లను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేయాలని, ఇప్పటివరకు కార్యదర్శులు ఖర్చుపెట్టిన మొత్తం డబ్బులను అందించాలని కార్యదర్శుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం తో వ్యవహారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, జిల్లా కలెక్టర్ మంచి మనస్సుతో స్పందించి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు జిల్లా మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి/ సి ఎస్ ఆర్ నిధుల నుండి డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
పండుగ వేళ కార్యదర్శులు అప్పుల పాలు కాకుండా చూడాలని అన్నారుఅలాగే గ్రామాల్లో గ్రామ పంచాయితీ సిబ్బందికి కూడా పండగ పూట ప్రభుత్వం అండగా ఉండాలని పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన…

చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి

వనపర్తి నేటిదాత్రి .

రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక ,శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నాడు వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల పర్యటి oచారు చిన్నదగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వర్షం పడిన ప్రతిసారీ పాఠశాల భవనం కురుస్తుందని, భవనం శిథిలావస్థకు చేరిందని కొత్తగా మంజూరు అయి నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి పాఠశాల నిర్మాణానికి 96 లక్షలు మంజూరు చేస్తే గత నాలుగు సంవత్సరాల నుండి పూర్తి చేయకుండా మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి కొత్తగా టెండర్ పిలవాలని పంచాయతీ రాజ్ ఎస్ ఈ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. రేపే కొత్తగా టెండరు పిలిచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు ఇప్పటికే మంజూరు అయిన 96 లక్షల నిధులను అదనంగా మరో 50 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలకు అన్నిమౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు
గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్థులు మంత్రి వెంట ఉన్నారు

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

వర్షాకాలంలో.. రైతులకు ఊరట.

షీట్ షెడ్ నిర్మాణానికి రూ.175 కోట్లు నిధులు మంజూరు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, గాల్వాలూమ్ షీట్ రూఫింగ్‌తో కూడిన కవర్‌డ్ షెడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.75 కోట్ల నిధులను ఈరోజు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రత్యేక కృషి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నూతన కవర్ షెడ్ నిర్మాణం ద్వారా రైతులకు వర్షాలు, ఎండల సమయంలో కూడా మద్దతు ధరపై ధాన్యం అమ్మే అవకాశాలు మెరుగవుతాయని మార్కెట్ యార్డ్ సిబ్బంది తెలిపారు. మార్కెట్ యార్డ్ పరిధిలో వృద్ధి చెందుతున్న వ్యవసాయ లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా AMC చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్, కార్యవర్గం సభ్యులు,రైతులు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version