కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం..

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్‌ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు.

కేటీఆర్‌కు సీట్ నోటీసులపై భరత్ రెడ్డి విమర్శ

కేటీఆర్‌కు సీట్ నోటీసులు.. డైవర్ట్ రాజకీయం

ఆధారాలు లేకుండా కేటీఆర్‌కు నోటీసు.. ఎందుకు…?

కెటిఆర్ సేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

కేటీఆర్‌కు సీట్ నోటీసులు ఇవ్వడం పై బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన చేయకుండా రాజకీయ కక్ష సాధింపులే చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. మొన్న హరీష్‌రావుకు, నేడు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం డైవర్ట్ పాలిటిక్స్ అని భరత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో సీట్ విచారణలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్‌కు, మున్సిపాలిటీ ఎన్నికల్లో హరీష్‌రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు.ఆధారాలు లేని కేసులు, కాలేశ్వరం ప్రాజెక్టు, ఈ-రేస్‌లో నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ ఎన్నికలను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్రాగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత కూడా రైతుభరోసా ఊసులు రాలేదని ఆయన ఆక్షేపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానాలు ఆధారాలు లేవని చెప్పినా, కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని భరత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి విదేశాల్లో విహరిస్తుండగా, పోలీసులు చెక్కర్లు కొట్టుకుంటున్నారని అన్నారు. రెండేళ్ల దర్యాప్తులో ఎలుక కూడా పట్టలేదని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version