కొండా మురళిని కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి…

కొండా మురళిని కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి

నేటిధాత్రి, కాశీబుగ్గ.

 

 

కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్లో వారి నివాసంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు ఐదు డివిజన్ల ప్రజలు కాశీబుగ్గ దసరాఉత్సవాలకు హాజరవుతారని, గ్రామీణప్రాంత ప్రజలు కూడా హాజరవుతారని ఉత్సవాలకు కావలసిన సదుపాయాలపై మున్సిపల్ సిబ్బందితో మైదానం క్లీనింగ్ చేయుట, లైటింగ్, సౌండ్ సిస్టం, స్టేజ్, ఆర్అండ్ బితో బారిగేట్స్, వాటర్ సప్లై, పోలీసు బందోబస్తు, కరెంటు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, డిపిఆర్ ఓతో పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దసరా ఉత్సవాలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కొండా మురళీధర్ రావుకు మెమోరండం ఇవ్వడం జరిగినది.

 

 

 

కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవాలు కావలసిన సదుపాయాలన్నీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లు చేస్తారని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ను అధికారులను కొండా మురళీధర్ రావు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్లపల్లి రాజ్ కుమార్, కన్వీనర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, గణిపాక సుధాకర్, సిలివేరు రాజు, గుజ్జుల రాకేష్ రెడ్డి, గణిపాక కిరణ్, గోరంట్ల మనోహర్, గుత్తికొండ నవీన్, గుర్రపు సత్యనారాయణ, మార్టిన్ లూథర్, సిద్ధోజు శ్రీనివాస్, రామ యాదగిరి, బిల్లాశివ, క్యాతం రంజిత్, బాలమోహన్, తొగరు వీరన్న, గణిపాక కిరణ్, దేవర ప్రసాద్, పెండ్యాలసోను, కోటసతీష్, చింతం రాజు, కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

 

వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ సభా వేదికసిద్ధం….

వరంగల్ సభా వేదికసిద్ధం….

ప్రతి పల్లె కదలి రావాలి కదం తొక్కుతూ…!

కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

వరంగల్ ను గమ్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తం గా బిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు ఉత్సాహం తో కదలికలోకి వస్తున్నారని. కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ తరుణ్ నాయక్ తెలిపారు.
“పల్లె పల్లె కదలి రావాలని నినాదంతో ప్రతి ఊర్లో నూ చైతన్యం వెల్లి విరుస్తోందని.
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మరోసారి ప్రజల మద్దతుతో ముందుకు సాగేందుకు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమవుతుందని. ఈ సభ కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని. ఇది ఒక విశాల సంకల్పానికి సంకేతమని. ఉద్యమాన్ని గుర్తు చే సుకుంటూ, భవిష్యత్తు దిశగా ప్రజలను నడిపించే ప్రయ త్నం. ఉద్యమ కాలం నుంచీ సాధన వరకూ మార్గనిర్దేశ కుడిగా నిలిచిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇప్పుడు భవిష్యత్తు తలుపులు తట్టేందుకు సిద్ధమవు ఉన్నారని తెలిపారు. గ్రామాలన్నీ ఒక్కటై, బండి మీద బండి, పాదా లపై పాదాలు వేసుకుంటూ, ఒకే నినాదంతో ముందుకు సాగుతున్నాయని “మన తెలంగాణ కోసం మళ్లీ కసితో ముందుకు సాగుతోందని ప్రతి వాడలోనూ, ప్రతి గూడెం లోనూ ఉద్యమాత్మక జోష్ చల్లరాని ఉత్సాహాన్ని నింపు తోందని. ఈనేపథ్యంలో, కేటీఆర్ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వాంకుడొత్ తరుణ్ నాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు.. వెనుకంజ లేదు వెనక్కి తిరిగే అవసరం లేదు. అన్నదమ్ములారా అక్కచెల్లెళ్ళారా బండి ఎక్కండి, కెసిఆర్ సభకు రండి వరంగల్ రజతోత్సవ సభను ఘనవిజయం చేద్దాం అని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version