మేడారం సమ్మక్క సారలమ్మ పాదయాత్ర ప్రారంభం

మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తజనులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులపై అచంచలమైన భక్తితో వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత మానుకోట జిల్లా తొర్రూర్ నుంచి భక్తజనులు పాదయాత్రగా మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రజలకు, భక్తి భావంతో దర్శనమిచ్చారు.ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ పాదయాత్రను ఈ సంవత్సరం కూడా గురువారం 22వ తేదీ నుంచి ప్రారంభించగా, సోమవారం 26వ తేదీన మేడారం చేరుకోనున్నట్లు పాదయాత్రకు సమన్వయం వహిస్తున్న కూరపాటి కామారాజు తెలిపారు.
ఈ పాదయాత్రలో స్త్రీలు, పురుషులు కలిపి సుమారు 300 మంది భక్తులు గ్రూపులుగా బయలుదేరగా, ఒక్కో గ్రూపులో సుమారు 45 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. పూర్వీకుల కాలం నుంచే తమ కుటుంబాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రతి జాతర సమయంలో పాదయాత్రగా వెళ్లి తల్లుల దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో హస్తం వెంకన్న, తిరుపటి శ్రీనివాస్, కిన్నెర మోహన్, హస్తం వెంకటమ్మ, తిరుపటి శైలజ, లక్ష్మి, సారమ్మ, ధనమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు, యువత సమాన ఉత్సాహంతో మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తోంది.

సమ్మక్క సారలమ్మ జాతర: తెలంగాణ పుణ్యక్షేత్రం

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ప్రజల పుణ్యక్షేత్రం

మేడారం జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్ మైపతి రచన

మంగపేట నేటిధాత్రి

 

సమ్మక్క సారాలమ్మ జాతర ఎంతో విశిష్టమైనది తెలంగాణ ప్రజల కొంగుబంగారం విరాజీల్లుతున్న సందర్భం సందర్భం మనం చూస్తున్నాం.దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా చూడకూడదు. మానసిక శక్తిని పెంపొందించి ప్రాంతంగా చూడాలి భక్తులు తమ అనుకునే పనిని అమ్మవార్ల పేరుతో కొనసాగించి డబ్బు సంపద ధనం మొదలైనవి సంపాదించడంలో మానసిక శక్తిని కూడగట్టుకునే విధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా తాము అనుకున్న లక్ష్యాలను సాధించే శక్తి కేంద్రంగా మేడారం జాతర ఎంతో చరిత్ర, కీర్తి గదించిన ప్రాంతం.

ఈ ప్రాంతంలో గిరిజన పూజారులు ప్రకృతి రక్షణ కొరకు ప్రజల శాంతి కొరకు జాతర నిర్వహణ చేస్తున్న పూజారుల త్యాగం గొప్పది. ప్రకృతి శక్తులను ఒడిసిపట్టే మహోన్నతమైన కార్యక్రమం ఈ జాతర నిర్వహణ. మానసిక దౌర్భాల్యాన్ని పోగొట్టుకునే ప్రాంతంగా కూడా ఈ నీ జాతరను మనం చూడవచ్చు. ఈ జాతరకు వచ్చిన వారు మనో సంకల్పం చేసుకొని తమ అనుకున్న లక్ష్యాలను తల్లి పేరు మీద ఫలితాన్ని పొంది కొంత మొక్కుల రూపంలో చెల్లింపుకోవడం అనాదిగా చూస్తున్నాం. కాబట్టి ఇది జల్సాలకు అడ్డా కాదు మానసిక ధైర్యాన్ని సరిచేసుకునే ఒక విజ్ఞాన కేంద్రంగా కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించాలి, సంస్కృతిని కాపాడాలి, పర్యావరణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చి దిదడటం లో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుని పైన ఉన్నది. అందరు సంకల్ప బలం తో సాగాలి.మంత్రి సీతక్క కృషితో చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వందంల కోట్లు తీసుక వచ్చి పది తరాలు తలుసుకునే తిరునా అభివృద్ధి చెయ్యడం జరిగింది. భవిష్యత్ తరాలకు చరిత్రను నిలబట్టిన విధానం అద్భుతం. జాతరలో కీలక పాత్ర వహించే పూజారులదే అంతిమ నిర్ణయం వారి యొక్క విశ్వాసాలను గౌరవిద్దాం ఈ జాతరలో కోయల ప్రతినిధులుగా కోయ సమాజం చూస్తుంది,.జాతరకు వచ్చే భక్తులకు స్థానిక ప్రాంత ప్రజలు వారికి సహాయ సహకారాలు అందిద్దాం, మన ప్రాంతానికి వచ్చిన వారిని అతిధులుగా చూసుకుంద్దాం, మనకు తోసిన విధంగా వాళ్లను ఆదారియలి.

ఆదివాసన సమాజని చైతన్య పరిచేటువంటి ఆదివాసి సంఘాల పాత్ర జాతరలో అనేక సంవత్సరాల నుంచి ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆదివాసి సంఘాలు లేని జాతరను ఊహించలేము. సంస్కృతి సంప్రదాయాల రక్షణలో ఇవి ముందుండి కాపాడుతున్నాయి.. వీటి యొక్క పాత్రను విస్మరించరాదు, కాబట్టి సంఘాల ప్రాధాన్యతను జాతరకు అనుగుణంగా అధికారులు వాడుకోవాల్సిన అవసరం ఉన్నది.

సమ్మక్క సారలమ్మ జాతర: భక్తి, సౌకర్యాలపై ప్రధాన శ్రద్ద

సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి..

మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించారు.అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జాతర జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. మందమర్రి ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఉద్యోగులు జాతరకు విచ్చేసి అమ్మవార్ల ను దర్శించుకోవాలని కోరారు. సుమారు 40 సంవత్సరాలుగా జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందని అన్నారు .సాంస్కృతిక కార్యక్రమాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీ ఝా, పర్సనల్ డిజిఎం అశోక్, కిరణ్ కుమార్ ప్రసాద్ ,సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ,రవి యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version