బాలానగర్‌లో బీసీ ఐక్యవేదిక ఏర్పాటు

బానిసత్వం వద్దు.. బీసీల కులాల ఐక్యత ముద్దు.

“కుట్రలతో.. బీసీ కులాలు బలైపోతున్నాం.”

“బీసీ కులాల నాయకులారా.. ఇక మేల్కొనండి”

“బీసీలకు అన్యాయం జరిగితే.. ఊరుకునేది లేదు”

“బాలానగర్ లో.. బీసీ ఐక్యవేదిక ఏర్పాటు”

బాలానగర్ /నేటి ధాత్రి.

బీసీల హక్కుల సాధన, సామాజిక సాధికారత లక్ష్యంగా మండలంలో శుక్రవారం ‘బీసీ ఐక్యవేదిక’ కొలువుదీరింది. శుక్రవారం బాలానగర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సామాజిక ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సవాళ్లు, రాజకీయంగా దక్కాల్సిన ప్రాధాన్యతపై ఈ వేదిక పోరాడుతుందన్నారు. బీసీల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బీసీల సమస్యలపై నిరంతర చర్చలు జరపాలని, అవసరమైతే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు.. “రాజకీయాలు ఎన్నికల వరకేనని, బీసీల హక్కుల విషయంలో మనమంతా ఒక్కటే” అని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగేలా చూడటమే ఈ ఐక్యవేదిక ప్రధాన విధి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల పరిధిలోని జాలుగడ్డ తండాలో బుధవారం నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రాము నాయక్ లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పారదర్శకమైన పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ పత్రాలను అందించామన్నారు. మంజూరైన నిధులతో లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్, కిషన్, సుప్రియ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తండావాసులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రాల పరిశీలన…

నామినేషన్ కేంద్రాల పరిశీలన

బాలానగర్/నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ ధారావత్ జానకి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలపై సిబ్బందితో కలిసి ఆరా తీశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version