అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం…

అధికార కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు,అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేయాలని తెలిపారు.ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని,గత ప్రభుత్వ పాలకుల వలనే పరకాల పట్టణం వెనుకబడిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.పట్టణంలో సిసి రోడ్,డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు మరిన్ని వసతులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 వంట గ్యాస్,నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ,రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ చీరలు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎస్పీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

మున్సిపాలిటీ ధర్మసమాజ్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం ఝాన్సీ సుమన్ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని,మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గడ్డం సుమన్,గడ్డం శివకుమార్, గడ్డం విశ్వనాథం, మధుసూదన్,గజవెల్లి రాజు, గడ్డం సతీష్,గడ్డం వెంకటయ్య,గడ్డం ఆంజనేయస్వామి,గడ్డం రాజమ్మ,దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం…

ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మామయ్య గారి బాటలోనే నా ప్రయాణం

◆-: పేదల కష్టాలు తెలిసిన కుటుంబం మాది.. 5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా!

◆-: రంజోల్ మాజీ సర్పంచ్ ఆశయ సాధనలో ‘అమ్ముల మధులత’.. ‘ఎయిర్ కండిషనర్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరంలో 5వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన అమ్ముల మధులత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన అజెండాను, వార్డు అభివృద్ధిపై తనకున్న దూరదృష్టిని ప్రజలకు వివరించారు.
సేవాయే పునాది – మామయ్య ఆశయమే నా మార్గం గతంలో రంజోల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు, తన మామయ్య గారు కొన్ని దశాబ్దాల పాటు సర్పంచ్‌గా సేవలందించారని అమ్ముల మధులత గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన అనేక మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. “మా మామయ్య గారి హయాంలో జరిగిన అభివృద్ధి, ఆయన చూపిన సేవా మార్గమే నాకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, నేడు నేను మీ ముందుకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చాను,” అని మధులత తెలిపారు.ఇంటి వద్దకే పాలన – అర్హులకే పథకాలు ప్రజలు గెలిపిస్తే వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. “ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం నిజమైన అర్హులకే అందేలా చూడటమే నా ప్రథమ లక్ష్యం. వార్డులోని ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా, అవసరం ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి సాయం చేసేలా నా పాలన ఉంటుంది,” అని ఆమె స్పష్టం చేశారు.ఎయిర్ కండిషనర్ (AC) గుర్తుకే మీ ఓటు(ఫిబ్రవరి 11న) జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నెంబర్ 4 వద్ద ఉన్న తన ఎన్నికల గుర్తు ‘ఎయిర్ కండిషనర్’ (Air Conditioner) పై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం సేవ చేయాలనే దృక్పథంతో వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలను ఆమె కోరారు.

జహీరాబాద్ అభివృద్ధి ఎంఐఎం పార్టీతో సాధ్యం…

జహీరాబాద్ అభివృద్ధి ఎంఐఎం పార్టీతో సాధ్యం…

◆-: ప్రచారంలో దూసుకుపోతున్న ఎంఐఎం పార్టీ

◆-: బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం భాగంగా సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే పల్సర్ మోహియోద్దీన్
అధ్యక్షులు అత్తర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ . పూర్తిగా విఫలమైందని బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈద్గా మైదానంలో వద్ద, మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన సమావేశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో లో బీజేపీ కేవలం కుల మతాల డి మధ్య చిచ్చులు పెట్టి ఓట్లను దండుకొని దేశంలో శాంతి పద్ధతులకు భంగం వాటిల్లో విధంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా తప్పుడు ఆలోచనతో బీజేపీకి మరియు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఓటు వేస్తే ఆ ఓటు మురుగునీటి కాలువలు వేసినట్టేనని అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఏఐఎంఐఎం పార్టీ కృషి చేస్తుందన్నారు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి మోకాళ్ళ అడ్డు వేసిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం హజ్ హౌస్, స్మశాన వాటిక స్థలం,షాది ఖానాలకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వాటన్నిటిని రద్దు చేసిందని విమర్శించారు. హిందూ ముస్లింలు రెండు కండ్ల లాంటి వాళ్లు తమరి పూర్తిగా లౌకిక పార్టీ అన్నారు.తమ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించక పోతే అభివృద్ధి కోసం నిధులివ్వమని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, నిధుల కోసం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం తాము కొట్లాడి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బి ఆర్ ఎస్ అభ్యర్థుల ను గెలిపించి కాంగ్రెస్ పార్టీ కి, రేవంత్ రెడ్డి కి బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన బాష విని పిల్లలు పాడవుతారని, ఇళ్లలో పెద్దలు ఛానల్ మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీ ప్రచార భాగంలో గౌరీ సహబ్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ రఫీ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ కృష్ణాపుర్ అధ్యక్షులు యునుస్ దిగ్వాల్ అధ్యక్షులు వాజీత్ షాకపూర్ అధ్యక్షులు పటేల్ మరియు నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు,

జహీరాబాద్‌లో ఇంటింటికి ప్రచారం ఒవైసీ సందర్శిస్తూ…

జహీరాబాద్‌లో ఇంటింటికి ప్రచారం ఒవైసీ సందర్శిస్తూ,

◆-: మజ్లిస్ అభ్యర్థులను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. బారిస్టర్ ఒవైసీ ఇంటింటికీ వెళ్లి మజ్లిస్‌కు అనుకూలంగా తమ ఓట్లను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు కార్వాన్, అసెంబ్లీ సభ్యుడు శ్రీ కౌసర్ మొహియుద్దీన్, మజ్లిస్ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ ఒవైసీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువకులు బారిస్టర్ ఒవైసీని చూసేందుకు పరుగులు తీస్తున్నారు. “చూడు, చూడు, ఎవరు వచ్చారు, సింహం, సింహం, సింహం” అనే నినాదాలు కూడా ప్రజలు వినిపించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, మార్పు, అభివృద్ధి, న్యాయం మరియు శాంతిభద్రతల నిర్వహణ కోసం మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులందరినీ గాలిపటం గుర్తుకు ఓటు వేయడం ద్వారా విజయవంతం చేయాలని జహీరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్నత వర్గాలు నష్టపోయే వాతావరణం ఏర్పడిందని, జాతీయ మీడియా కూడా దీనిపై నిరంతరం విశ్లేషణ ద్వారా వ్యాఖ్యానిస్తోందని ఆయన అన్నారు.యూజీసీ రెగ్యులరైజేషన్ కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం కొనసాగించారు, దీని ఫలితంగా సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును నిలిపివేయాలని నిర్ణయించింది. తెలంగాణలో 7 మంది బీజేపీ ఎంపీలు ఎన్నికైనప్పుడు యూజీసీ రెగ్యులరైజేషన్ ఎలా ఆగిపోయిందని ఆయన బీసీ విభాగాలైన మునావర్ కా పోస్సేను అడిగారు. బీజేపీ వెనుకబడిన వర్గాలను కాదు, ఉన్నత వర్గాలను ప్రేమిస్తుందని దళితులు, వెనుకబడిన వర్గాలు పరిగణించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కూడా నిలిపివేయబడుతుందని ఆయన అన్నారు. బీజేపీ పాలిత 6 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్రలలో 80% ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. మియాన్ ఆటో రిక్షా డ్రైవర్ ఐదు రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు మాత్రమే చెల్లించాలని ముస్లింలకు వ్యతిరేకంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంతు బిశ్వ శర్మ చేసిన ప్రకటన అత్యంత ద్వేషపూరితమైనది, ఖండించదగినది మరియు ప్రజలను అవమానించడం అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ తెల్లవారుజామున మజ్లిస్ ఎన్నికల గుర్తు అయిన కైట్ పై తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ముగిసిన నామినేషన్ల పర్వం.

ముగిసిన నామినేషన్ల పర్వం

* 24 బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 30( ప్రజా జ్యోతి న్యూస్ )పట్టణ పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో 24 వార్డ్ బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ నామినేషన్ దాఖలు చేశారు. వారి వెనుక బిజెపి నాయకుడు పాలెంకర్ సంతోష్ కాలోని వాసులు పాల్గొన్నారు అని తెలియజేశారు. అనంతరం చివరి రోజు(శుక్రవారం) కావడంతో పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలు, బాజాభజంత్రీలతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థుల మద్దతుదారులతో పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పోలీసులు ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వ హించారు. అభ్యర్థి తోపాటు పాలిoకార్ మహేష్, చిరంజీవి, డప్పు విజయ్, సంతోష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం తో పట్టణంలో ప్రచార పర్వం ఊపందు కోనుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version