నేటి నుండి నాగులమ్మ మహా జాతర…

నేటి నుండి నాగులమ్మ మహా జాతర

ఆదివాసీ పూజారులు ,వడ్డే లతో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు

నాగులమ్మ ను తర తరాలుగా ప్రకృతి దేవత గా ఆరాధిస్తున్న ఆదివాసీ పూజారులు

మార్చ్ 5 న నిండు జాతర,నాగులమ్మ-పగిడిద్ద రాజు ల కళ్యాణం,అగ్నిగుండాలు

అలరించనున్న ఆదివాసీ దింసా,గుస్సాడి నృత్యాలు

కార్య క్రమాలను వెల్లడించిన బాడిశ రామకృష్ణ స్వామి

మంగపేట:నేటిధాత్రి

 

మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సా పూర్ గ్రామం లో శ్రీ నాగులమ్మ మహా జాతర ఐదు రోజుల పాటు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధం గా ఘనం గా నిర్వహించ నున్నారు .ప్రతి రెండేళ్ల కోసారి పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఉన్న వారం లో జాతర నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ గా వస్తుంది.పూజ కార్య క్రమ వివరాలను బాడిశ.రామకృష్ణ స్వామీజీ తెలియ జేసారు.మార్చ్ 03 న మండె మెలుగుట కార్యక్రమం తో జాతర ప్రారంభ

మవుతుందని,మార్చ్ 4న బుధవారం శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండోర్రె గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు,అదేసమయంలో యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజలు చేసి నాగులమ్మ సడాలమ్మ అమ్మవార్లను రమణక్క పేట దగ్గర వున్న గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు చేసి నాగులమ్మ ఆలయం వద్ద కు తీసుకు వొచ్చి ప్రతిష్టిస్తారు.మార్చి 5 న నిండు జాతర.అందులో భాగంగా సాయంత్రం 3 గంటలకు రాజుపేట సెంటర్ నందు పాలమాకు వొర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం(వనదేవత) కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదురుకోలు కార్య క్రమాన్ని నిర్వహిస్తారు.

రాత్రి 12:05 నిమిషాలకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని యాశాస్త్రోక్తం గా గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు.జాతర లో ముఖ్య ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం.తెల్ల వారు జామున 3 గంటల సమయం లో నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి లోక కళ్యాణం

కోసం అగ్ని గుండాలలో నడవడం జరుగుతుంది.మార్చి 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుట జరుగుతుందని,మార్చి 7 న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జాతర ముగుస్తుందని తెలిపారు.

మేడారానికి “యునెస్కో” గుర్తింపు మంత్రి సీతక్క తోనే సాధ్యం…..

మేడారానికి “యునెస్కో” గుర్తింపు మంత్రి సీతక్క తోనే సాధ్యం…..

మేడారం జాతర విజయవంతంలో మంత్రి సీతక్క కృషి ఎనలేనిది…

* కలెక్టర్, ఎస్పీ మరియు అధికారులందరికి అభినందనలు….

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట నేటిధాత్రి

 

 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర మునిపెన్నడూ లేని విధంగా విజయవంతమైందని జాతర విజయవంతం కావడంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కృషి ఎనలేనిదని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం స్థానిక విలేఖరులతో సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి బావితరతరాలకు గుర్తుండే విధంగా వేయి సంవత్సరాల చరిత్రను నిర్మించిన మహనీయురాలు మంత్రి సీతక్క అన్నారు జాతర నిర్వహణలో మంత్రి సీతక్కకు వచ్చిన మంచి పేరును తట్టుకోలేని కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడడం విచారకరమన్నారు ప్రపంచ దేశాల నుండి భక్తులు వచ్చి మేడారం జాతర అద్భుతం అని కితాభిస్తుంటే స్థానిక ప్రతిపక్షాలు జీర్నించుకోలేకపోతున్నాయన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సీతక్క ప్రతిష్టను తగ్గించలేరన్నారు మేడారం జాతరపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాను మరియు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దుష్ప్రచారం చేసే వ్యక్తులు లేదా వ్యవస్థల పట్ల తాము క్షమా గుణం కలిగి ఉన్నా సమ్మక్క సారలమ్మలు వారికి తగిన శాస్తి చేస్తారని అన్నారు రాబోయే రోజుల్లో మేడారం జాతరకు యూనిస్కో గుర్తింపు తీసుకురావడం సీతక్కతోనే సాధ్యమని సాంబశివరెడ్డి అన్నారు పదిహేను రోజులపాటు కారోబార్ నుండి కలెక్టర్ వరకు వేలాదిమంది సిబ్బంది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ అహర్నిశలు కష్టపడి పనిచేసి మేడారం మహ జాతరను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరున అభినందనలు తెలిపారు

ప్రపంచ స్తాయిలొ మేడారం మహా జాతర ఘనత నిలిచింది…

ప్రపంచ స్తాయిలొ మేడారం మహా జాతర ఘనత నిలిచింది.

జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజలెన్స్ మానటరింగ్ కమిటీ మెంబర్ మురుకుట్ల నరేందర్

మంగపేట నేటిధాత్రి

మునుపెన్నడు లేని విధంగా తెలంగాణ కుంబమేలా సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరని విజయవంతం చేయటములో ముందుండి నడిపించిన ఆదివాసి ముద్దు బిడ్డ,ఈ ప్రాంత ప్రజల దైర్యం గా చెప్పుకోబడుతున్న మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని నరేందర్ అన్నారు
ఏంతో సాహసోపేతంగా అతి తక్కువ సమయములో కొన్ని కోట్ల రూపాయలు వ్యచ్చించి కొట్లాధి మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందించిన మంత్రి సీతక్క ఆలోచన విధానానికి వారి నిశ్చలమైన గొప్ప ఆశయ సాధనకి ధన్యవాదాలు
జాతర పనులు ప్రారంభమైన దగ్గర నుండి ఎన్నో రకాల సమస్యలు ఒడిధుడుగులు వచ్చిన కావాలని కొందరు రాజకీయ లబ్ది కొరకు సృష్టించినప్పటికి అవన్నీ తేట తెల్లం చేసి కేవలం భక్తుల సౌకర్యాలను భక్తుల అవసరాలను మేడారంలో ఈ ప్రాంత బిడ్డల ముందు తరాల భవిశ్యత్తు అవసరాల కోసం కొన్ని వందల సంవత్సరాలు నిలిచేలా
చరిత్ర లో సీతక్క కి ముందు సీతక్క వచ్చిన తర్వాత అని తనదైన శైలిలో ప్రజల గుండెల్లొ ముద్ర వేసుకున్న ఘనత సీతక్క కి సొంతం అని ఆయన అన్నారు

నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి…

నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి

* ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులను నమ్మకండి

* ప్రజలకు సేవ చేసే నాయకులను నమ్మి తమ అమూల్యమైన ఓటు వేయాలి

* చేవెళ్ళ మున్సిపాలిటీ 17 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుని తమ విలువైన ఓటుతో మేధావులను చదువుకున్న విజ్ఞాన వంతులను సామాజిక బాధ్యత ఉన్న పౌరులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. డబ్బు, మద్యానికి కాకుండా 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసే వారిని ప్రశ్నించే గొంతులను గెల్పించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని చెప్పారు. చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 18 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాలనీలలో ప్రచారం కొనసాగిస్తుంటే ప్రజలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం పదవుల కోసమే పనిచేశారని ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకే ఇలాంటి దుస్థితి ఏర్పడ్డదని వాపోయారు. పదవులు వచ్చాక ప్రజలను , అభివృద్ధిని మరిచిపోయే నాయకులను గెల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపించే నాయకులను నిత్యం ప్రశ్నించాలంటే ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకూడని సూచించారు. ఇన్నాళ్లు ప్రశ్నించలేకే కాలనీల్లో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని అన్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికే రమేష్, మహమ్మద్ ఖలీల్, బాబు, కాలనీ పెద్ద మనుషులు సత్యనారాయణ, విష్ణు తదితరులు అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి…

అమ్మవార్లకు పుస్తె, మట్టెలను మొక్కు తీర్చుకున్నముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు మొక్కుకున్న పుస్తె, మట్టెలను జాతర ఉత్సవ కమిటీ కార్యదర్శి చదువు అన్నారెడ్డి సమక్షంలో అమ్మవార్లకు బహుకరించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ముల్కలపల్లి గ్రామ సర్పంచ్ గా తాను గెలిస్తే సమ్మక్క-సారలమ్మలకు పుస్తె, మట్టెలను బహుకరిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. అమ్మవార్ల అనుగ్రహంతో తాను గెలిచానని, తాను మొక్కుకున్నట్లుగానే అమ్మవార్లకు పుస్తె, మట్టెలను బహుకరించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి, చదువు మహిపాల్ రెడ్డి తదితరులున్నారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

గద్దెపై ఆసీనురాలైన వన దేవతలు పరిపూర్ణతను సంత రించుకున్న మొగుళ్ళపల్లి మినీ జాతరత

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భక్తుల గుండెల్లో భక్తి జ్వాలగా వెలిగే వన దేవతలు ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం మినీ మేడారం జాతరలో శరణు శరణు సమ్మక్క, శరణు శరణు సారక్క అంటూ. శివసత్తుల పూనకాలతో పోటెత్తిన భక్తజనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగళ్ళపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిలో మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లాలోని పరకాల, నడికూడా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. చిట్యాల టేకుమట్ల, కరీంనగర్ జిల్లా.

ఇల్లంతకుంట, జమ్మికుంట, మండలాలకు చెందిన అశేష భక్త జనవాహినితో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం లో జై సమ్మక్క జై జై సమ్మక్క అంటూ జయజయ ధ్వనులతో మారు మోగింది కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లులు నమ్ముకున్న భక్తులను చల్లంగా చూసేందుకు కష్టాల చీకట్లను తరిమికొట్టి వరాలను వెన్నెలను చల్లెందుకు చల్లని పున్నమి కాంతుల నడుమ సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు ధీరడంతో అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుల అంచనాకు మించి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, కానుకలు, యాటపోతులను నైవేద్యంగా సమర్పించి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్న భక్తులు. జాతర ప్రదేశంలోనీ పెద్దవాగు, చిన్నవాగులలోనీ ప్రశాంత వాతావరణంలో తమ కుటుంబ సభ్యులతో అనందంగా జాతరను జరుపుకున్నారు.

మేడారం జాతరలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ 71 కేజీల బంగారం సమర్పణ

మేడారం సమ్మక్క – సారలమ్మకు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు- పద్మ(గణపురం మాజీ జడ్పీటీసీ) దంపతులు వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన బరువుకు సమానంగా 71 కేజీల బంగారం(బెల్లం)ను వనదేవతలకు నైవేద్యంగా సమర్పించారు.గిరిజన సంప్రదాయం ప్రకారం బెల్లాన్ని బంగారంలా భావించి సమర్పించడం మేడారం జాతరలో ముఖ్యమైన ఆచారమని,శ్రీ సమ్మక్క – సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కన్నా ముందు ఎమ్మెల్యే దంపతులు ములుగు పట్టణానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారం గా ప్రసిద్ధి చెందింది.
కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న శ్రీ సమ్మక్క – సారలమ్మ మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే దంపతులిద్దరూ పాల్గొని, వన దేవతలను దర్శించుకుని మొక్కులను చెల్లించారు. కాగా, జాతర కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

నల్లబెల్లి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న సుదర్శన్ రెడ్డి శుక్రవారం మేడారం మహా జాతరలో వన దేవతలు సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర,అడవి తల్లి ఒడిలో జంపన్న వాగు ఒడ్డున వెలసిన సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నట్లు తెలిపారు.అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకోవడం మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

 

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకోనున్నారు.

ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..

నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..

సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి ..

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం…

మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి నాలుగు రోజుల పాటు జాతర జరిగే నేపథ్యంలో సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం కంక వనం తో జాతర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగామందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్టించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.జాతరకు కార్మికులు , కార్మికేతరులు, భక్తులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరుతున్నారు.మహిళలకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, క్షౌరషాలలు ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి ,మందమర్రి, రామకృష్ణాపూర్, గద్దెరాగడి ప్రాంతాల నుంచి నుంచి భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.సుమారు 10 నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణం మొత్తం కనిపించేలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారు.టవర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో చోరీలు జరిగే అవకాశం ఉంటే వారిని పసికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ పి రమేష్ ల ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఎస్సై జె శ్రీధర్ నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.సుమారు 300 కు పైగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కంక వనం కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం…

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం.

మొగుళ్లపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు..

మొగుళ్లపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి ములకలపల్లి గ్రామాల మధ్య శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి మొదలు కానుంది బుధవారం సారలమ్మ పైడి దరాజు గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి ప్రతిష్టిస్తారు వనదేవతల గద్దెలకు చేరగానే భక్తులు మొక్కులు మొదలవుతాయి రెండేళ్లకోసారి నిర్వచించే ఈ మినీ జాతర సందర్భంగా మొగుళ్ళపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతర నిర్వాహకులు విశిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మవార్లు గద్దెలను పుట్ట మన్ను పసుపు కుంకుమ పాలతో శుభ్రపరిచి ముగ్గులు వేసి అలంకరించారు సాంప్రదాయ రీతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు 1976లో సమ్మక్క సారలమ్మను ప్రతిష్టించారు సమ్మక్క సారలమ్మ జాతరకు భూమి దాత సమ్మక్క సారలమ్మ కమిటీఅధ్యక్షులుఆలూరి గంగాధర్ చేశారు రెండు వాగుల మధ్యలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతమైన రీతిలో జరుగుతుంది భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version