కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

 

 

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు (Tirupati SP Subbarayudu) స్పందించారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్తలు అసత్యమని కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసిలాట జరుగలేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిజమైన సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిత్యం కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రజల భద్రత – మా ప్రధాన లక్ష్యం’ అని ఉద్ఘాటించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడమహాలయ అమావాస్య – కపిలతీర్థం వద్ద పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు . ఈరోజు(ఆదివారం) మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని వివరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించానని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version