మినీ జాతరలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

భక్తులుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై అశోక్ ప్రత్యేక ఏర్పాట్లు

మొగులపల్లి నేటి దాత్రి

మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లిలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఉత్సవాలలో భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై బొరగాల అశోక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ట్రాఫిక్ అంతరాయంతో దర్శణానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కునేవారు. గత జాతరలో జరిగిన ట్రాఫిక్ పరిస్థితులు పునరావృతం కాకుండా. జాతరలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా సవ్యంగా భక్తులకు దర్శనం జరిగేవిదంగా . మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ ముందస్తుగా పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ సమస్యలపై ఆంక్షలుతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా నిత్యం జాతరకు వచ్చే వాహనాలను నేరుగా పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలిపి ఉంచడంపై ప్రత్యేక దృష్టి సాధించడంతో రెండు లక్షలకు పైగా భారీ సంఖ్యలో జాతరకు వచ్చిన భక్తజనం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మొక్కులు చెల్లించుకున్నారు.
జాతర నిర్వహణలో మొగుళ్లపల్లి ఎస్ఐ బొరగల అశోక్ ఎంతో కీలకంగా వ్యవహరించాడంతో భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version