మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

నర్సంపేట నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు

నర్సంపేట నుండి మేడారం ప్రత్యేక బస్సులు

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈనెల 25 నుండి ఫిబ్రవరి 31 వరకు నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు నడపడనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.ఇందుకు గాను సుమారు ముప్పైరెండు వేల పైగా ప్రయాణికులు నర్సంపేట నుండి మేడారం జాతరకు ప్రయాణిస్తారని అంచనా వేసామన్నారు.కాగా 145 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పరిస్థితి బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నుండి మేడారంకు పెద్దలకు రూ.270/- పిల్లలకు రూ.170/- గా టికెట్ ధర, కొత్తగూడ నుండి పెద్దలకు 330/-, పిల్లలకు 200/-నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం సరియైన ధ్రువీకరణ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.బూత్ కౌంటర్లు ఏర్పాటు చేసి
మేడారం జాతరకు తరలివెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం, ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను బస్సులలో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు.టికెట్ కౌంటర్లు 24 గంటలు పనిచేస్తాయి.కాగా జాతరకు సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం తగిన ఏర్పాటు చేయడం తో పాటు త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్, తగు సూచనలను, సలహాలను అందించడానికి హెల్ప్ డెస్క్, మెడికల్ సదుపాయం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ వివరించారు.భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవార్ల గద్దెల అతి సమీపం వరకు చేరుకుంటారని కావున ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందగలరని ఆమె కోరారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

నడీకూడ,నేటిధాత్రి:

 

సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను అడవిలో వేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న చైతన్య కార్యక్రమం చేపట్టారు.
నా ప్లాస్టిక్ నా బ్యాగ్‌లోనే
మా చెత్త మా ఇంటికే
అమ్మల ఆశీర్వాదం అడవిని కాపాడితేనే
అనే నినాదాలతో విద్యార్థులు ఓ పాత క్యారీ బ్యాగ్‌తో ప్రజలలో అవగాహన కల్పించారు.మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ వెంట ఒక క్యారీ బ్యాగ్ వెంట తీసుకెళ్లి అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమం ద్వారా భక్తి అంటే దర్శనం మాత్రమే కాకుండా అడవిని, పర్యావరణాన్ని రక్షించడమూ మన కర్తవ్యం అనే సందేశాన్ని విద్యార్థులు బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లారు.
జాతర కొన్ని రోజులు మాత్రమే ఉన్నా,అడవి తరతరాల పాటు నిలవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయత్నం భక్తులలో మార్పు చైతన్యాన్ని కలిగించేలా ఉందని గ్రామస్థులు ప్రశంసించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడితేనే సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం నిలుస్తుందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్పష్టమైన సందేశం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పావని, సత్యపాల్ విద్యార్థులను అభినందించారు.

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి…

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదారాబాద్,నేటిధాత్రి:

 

 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర
మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో గల అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ,ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version