రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…
పుర కమిషనర్ గద్దె రాజు, సిఐ శశిధర్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సదుపాయాలను పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డిలు అన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 700 నుండి 800 మంది ఓటర్లు ఉన్నారని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరిగిందని తెలిపారు.
ఎక్కడైతే సౌకర్యాలు సరిగా లేవో ఆ పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తామని సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ లు స్పష్టం చేశారు.
