చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు మొగుళ్లపల్లి..

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు మొగుళ్లపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి

జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు హాజరై పాలక వర్గ సభ్యులు అలాగే స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పాలకవర్గం కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ అన్నారు రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు

యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దు…

యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుండి డా బిఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్‌లో ఆరో రోజు మాదకద్రవ్యాల నివారణపై ఈ ర్యాలీ నిర్వహించబడిందన్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంలో డ్రగ్స్ నివారణలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా “ఈగల్ టీం” ఏర్పాటు చేసిందని, ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు పోలీసు శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని. జిల్లాలో గంజాయి రవాణా దారులు గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. యువత డ్రగ్స్ పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని వారికి అవగాహన వచ్చేసరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ నివారణకు పోలీస్ శాఖ తరపున పటిష్ట నిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి సమాచారం ఉన్న ప్రజలు భాధ్యతగా పోలీసులకు అందజేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు.
అనంతరం 2 కే రన్ లో విజేతలకు ప్రశంషా పత్రాలు అందచేశారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత…

రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం జంగేడు గ్రామంలోని కస్తూరి బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం మౌలిక వసతుల కల్పన కోసం రూ.38 లక్షల వ్యయంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని జంగేడు, ఘనపూర్, రేగొండ, టేకుమట్ల మండలాలలో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకులాల అభివృద్ధికి రూ.2 కోట్ల 38 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నిధులతో గురుకులాల్లో ప్రహరీ గోడల నిర్మాణం, లైటింగ్ సదుపాయాల ఏర్పాటు, గ్రౌండ్ లెవలింగ్, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, మరమ్మతులు తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనులన్నీ వేసవి సెలవుల్లో పూర్తిచేసి పున ప్రారంభం నాటికి పాఠశాలలు మరింత సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 12 నాటికి విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ శ్వేత ప్రభాకర్ కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి ఈశ్వరి కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ వీక్ మదర్ హుడ్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మహిళలు గర్భధారణ సమయంలో ప్రసవానంతర కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యమన్నారు.మాటర్నల్ సేఫ్టీ అనేది తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది అని తెలిపారు.గర్భిణీ స్త్రీలు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం,పోషకాహారం తీసుకోవడం,వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవం సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని,ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సూచనలను గౌరవించాలని కోరారు.గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను ఉపయోగించుకుని సురక్షిత మాతృత్వాన్ని సాధించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు,సిటీ స్కాన్ ఏర్పాటు చేశామని, ఎమ్.ఆర్.ఐ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం కలెక్టర్ తో కలిసి ఆసుపత్రిలో ప్రతి వార్డు సందర్శించి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు కల్పించాలని,ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూపరెండెంట్ కి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ డి.ఎం.ఎచ్.ఓ డా. మధుసూదన్ ఆసుపత్రి సూపరెండెంట్ డా.రాజేంద్ర ప్రసాద్ వైద్య అధికారులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్ధుల నుండి వివిధ ఆర్ధిక సహాయ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం కింద ఈవీ టూ వీలర్ ఈవీ త్రీ వీలర్ వాహనాలకు, అలాగే వ్యవసాయ పథకాల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 ఏళ్ల వరకు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుండి 60 ఏళ్ల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 మించకూడదు. సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఈవీ ద్విచక్ర వాహనాల కోసం జొమాటో, స్విగ్గీ, రాపిడో వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, వారు సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీసేవ ద్వారా పొందిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్లతో ఈ నెల 17 నుండి 24 వరకు ఆన్లైన్ వెబ్సైట్ tsobmms.cgg.gov.in ద్వారా లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్….

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బట్టు కరుణాకర్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వార్డులో శుభ్రత పనులను చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాల అభివృద్ధికి పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య పనులను వేగవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణం అవసరమని, మురుగు కాలువలు, చెత్త నిల్వలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేపట్టాలని, ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ అందించే సదుపాయాలను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు శ్రమతో పనిచేస్తూ వార్డులో చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రపరచడం వంటి పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్మికులను అభినందించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగి, శుభ్రమైన భూపాలపల్లి నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు వార్డు కౌన్సిలర్స్ రాజు నాయక్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు కోటంచలో పటిష్ట ఏర్పాట్లు

ఈనెల 8న సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 8న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు.
భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష
అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. దేవాలయాన్ని సుందరంగా అలంకరించాలని, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాలన్నారు.
ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంపిఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

బుధవారం రేగొండ మహాత్మా జ్యోతి భా పూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
సామాజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం సాధ్యమవు తాయని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వివక్షకు తావు లేకుండా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, తహసీల్దార్ శ్వేతా, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డిసిఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి…

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ…

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version