సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి..
మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించారు.అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జాతర జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. మందమర్రి ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఉద్యోగులు జాతరకు విచ్చేసి అమ్మవార్ల ను దర్శించుకోవాలని కోరారు. సుమారు 40 సంవత్సరాలుగా జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందని అన్నారు .సాంస్కృతిక కార్యక్రమాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీ ఝా, పర్సనల్ డిజిఎం అశోక్, కిరణ్ కుమార్ ప్రసాద్ ,సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ,రవి యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
