ఓబులాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది

ఓబులాపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర….

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో.

సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం కనుల పండుగగా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఓగులాపూర్. గ్రామంలో జరుగుతున్న జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి చాలామంది భక్తులు వచ్చి కోరుకున్న కోరికలు సమ్మక్క సారక్క అమ్మవార్లు నెరవేర్చారని వేడుకుంటూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు తమ కోరుకున్న కోరికలు నెరవేర్చాలని జాతరలో పెద్ద ఎత్తున అమ్మవారికి కోరుకున్న ప్రకారం బంగారం మొక్కులు అప్పజేయడం. జరిగిందని. అలాగే మళ్లీ ఏడు వస్తామని తమ కోరుకున్న కోరికలు నెరవేర్చాలని వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటామనీ. ఈ జాతరలో పిల్లాపాపలతో జాతర మహోత్సవాన్ని తిలకించుకుంటూ.అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతరను కనులారా తిలకించి అమ్మవార్ల.దర్శనం చేసుకోవడం జరిగిందని. ఇoదుకుగాను. సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని అందుబాటులో ఉండేటట్లు చూసుకుంటూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు అందేలా చూశారు గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జాతరకు వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు ఈ జాతర మహోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ సిబ్బంది మండల ఎస్సై పోలీసుల సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే జాతరకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా వాహనాలు రాకపోకలను గమనిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇట్టి జాతరలో. ఓబులాపూర్ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయ కమిటీ అధ్యక్షులు సభ్యులు జిల్లా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సమ్మక్క సారలమ్మ జాతర: భక్తి, సౌకర్యాలపై ప్రధాన శ్రద్ద

సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి..

మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించారు.అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జాతర జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. మందమర్రి ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఉద్యోగులు జాతరకు విచ్చేసి అమ్మవార్ల ను దర్శించుకోవాలని కోరారు. సుమారు 40 సంవత్సరాలుగా జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందని అన్నారు .సాంస్కృతిక కార్యక్రమాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీ ఝా, పర్సనల్ డిజిఎం అశోక్, కిరణ్ కుమార్ ప్రసాద్ ,సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ,రవి యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ, భక్తులతో మాట్లాడారు. పలువురు భక్తులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు దిగారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో భూమిలోని జాతర చైర్మన్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version