మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్..

మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని తహసిల్దార్ దశరథ్ కోరారు.రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో, వార్డుల సంఖ్య పెరగడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. పట్టణంలో 1000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా కౌన్సిలర్లకు చెప్పుకోవచ్చని, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాంలో కఠిన భద్రత

ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి: 

 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ కేంద్రాల పరిశీలన…

నామినేషన్ కేంద్రాల పరిశీలన

బాలానగర్/నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ ధారావత్ జానకి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలపై సిబ్బందితో కలిసి ఆరా తీశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

నామినేషన్ ఏర్పాట్లపై అధికారుల పర్యవేక్షణ

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు అధికారులు గురువారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, సీఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

“పంచాయతీ ఎన్నికలకు రెడీ ఏర్పాట్లు”

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.

ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలి…

స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అధికార పార్టీ నాయకులు. ఫైళ్లలో. తమ పేరు లేకుండా చేస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. అసలు స్థానిక ఎంపిటిసి మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. మా దగ్గర సాక్షాలు ఉన్నాయని. దీనిపై మండల పోలీస్ అధికారులు తగు విచారణ చేపట్టి దోషులపై కఠినంగా శిక్షించాలని. గ్రామంలో ప్రజలందరికీ తెలుసునని ఆయా పరిస్థితి ఏంటిదో. వాళ్ల కొడుకు కూడా మా ప్రెస్ మీట్ లో ఉన్నారని. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై. కఠిన చర్యలు తీసుకోవాలని. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఓడిపోతామని భయంతో మాపై లేనిపోని. కుట్రలు పన్నుతున్నారని అలాంటివి కుట్రలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగిల రాజు. గుగ్గిళ్ళభరత్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం…

ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో సమావేశం
* ఎంపీడీవో రవీంద్రనాథ్

మహాదేవపూర్ సెప్టెంబర్ 8 (నేటి ధాత్రి)

 

 

రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ సోమవారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ జాబితా, ముసాయిదా ఓటర్ల జాబితా పై ఎంపీడీవో రవీంద్రనాథ్ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామారావు, వివిధ పార్టీల ప్రతినిధులు, సూపర్ ఇండెంట్ శ్రీధర్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version