జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్>…

జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్

 

జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) దృష్టిసారించారు. గులాబీ పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రేపు (గురువారం) ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప‌ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్‌ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా.. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళిలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడిక్కడ ర్యాలీలో, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. బైపోల్‌లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టంకట్టనున్నారో చూడాలి మరి.

మా “అబ్బాయి పెళ్లికి రండి”..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T190916.442.wav?_=1

 

 

మా “అబ్బాయి పెళ్లికి రండి”.

“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.

“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.

వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.

తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.

 

“నేటిధాత్రి”,హైదరాబాద్.
మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.

 

CM Revanth invited to Nihant’s wedding

తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T181124.663.wav?_=2

 

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం

‘నేటిధాత్రి”,హనుమకొండ.

 

తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం…

కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం.

వేసిన కోద్ది రోజుల్లోనే పాడైపోతున్న వైనం.

అధికారులు పట్టించు కోరా వాహనదారుల ఆవేదన.

కారేపల్లి. నేటి ధాత్రి

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము నుండి మాదారం వేళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం కారేపల్లి రైల్వే గేటు వద్ద నుండి పెరుపల్లి వరకు ప్రజల సౌకర్యార్థం పాతరోడ్డు డ్యామెజీ అయిన దాన్ని తోలగించి కోత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు వేసిన కోద్దిరోజుల్లోనే రోడ్డు పాడైపోయిన వైనం చూస్తే ఈరోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినట్లుగా తెటతెల్లం అవుతుంది రోడ్డుని వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయి వాహన దారులకు ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు పడుతు యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినందునే వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయినదని దాన్ని వేసిన కాంట్రాక్టర్లు రిపేరు చేసిన ఫలితం లేకుండా పోయిందని మరల రోడ్డు మరమత్తులు చేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయిందని నాసిరకంగా నిర్మించినందునే రోడ్డు దెబ్బ తింటున్నదని ప్రజలు వ్యక్తం చేశారు వాహనాలపైన వెళ్ళే వారు ప్రమాదంలో పడి యాక్సిడెంట్స్ జరిగే దుస్థితి స్తితి నేల కోన్నదని వేంటనే అధికారులు చర్యలు చేపట్టి నాసిరకంగా రోడ్డు నిర్మించిన దాన్ని పరిశీలించి రోడ్డు మరమత్తులు వేంటనే చేయాలని వాహనదారులు ప్రజలు వారి ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు.

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మునిసిపాలిటీ మాజీ ప్రతినిధి కౌన్సిలర్ ముహమ్మద్ అథర్ గౌరి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికా అర్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి విద్యావంతులైన పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు, సంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అని, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారని, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు…

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారికి జహీరాబాద్ సీనియర్ నాయకులు ముర్తజ తన యాక్టివా బండి పై ఎమ్మెల్యేను తీసుకొని ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ముర్తుజా, డివిజన్ నాయకులు ,మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిని ఒక ఆధునిక మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని ఈ నిధులతో రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పట్టణ సౌందర్య వృద్ధికి, జయశంకర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ వెడల్పు,పలు అభివృద్ధి పనులు అమృత్సర్ స్కీం కింద 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి ఐదు కోట్ల రూపాయలు, గిరిజన భవనానికి కోటి రూపాయలు వెచ్చించామని తెలిపారు.ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, పి.సి.సి సభ్యులు చల్లూరి మధు పిప్పాల రాజేందర్ ముంజల రవీందర్ అప్పం కిషన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి…

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
• ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
• పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన…జిల్లా ఎస్పీ  సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపియస్.
మహబూబాబాద్/ నేటి ధాత్రి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరం లో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నం అన్నారు.   
ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవి మన రాష్ట్రంలో గతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మరియు అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలోనూ అనేక మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులతో ఎంతో మంది పోలీసులు, ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్ర మూకలను హతమార్చి, తమ తనువులను చాలించారని,  ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అన్నారు.  ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో 191-మంది జవాన్లు వీరమరణం పొందారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 5- మంది ఉన్నారు. వీరమరణం పొందిన వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు.
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నాం అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయం అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారు అన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలను ఉధ్యేశించి మాట్లాడుతూ.. వారి కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను చేకూరేలా, వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. 
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ..  పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి  అక్టోబర్ 31వ తేదీ  వరకు ప్రజలకు  పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతి రావు, కృష్ణకిషోర్, గండ్రతి మోహన్, ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, సీఐలు, ఆర్.ఐలు ఎస్.ఐ అధికారులు సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం….

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం

మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్

దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్

మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం….

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

*నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆప్తమాలజీ కంటి వైద్య యూనిట్ ను ప్రారంభించినట్లు గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.నేటి నుండి స్టార్ హాస్పిటల్ లో కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కంటి ఆపరేషన్లు కంటిలో పోరా, లెన్స్ లాంటి ఆపరేషన్లు కూడా చేయబడును అని డయాబెటిక్ పేషెంట్లకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ విద్య, కంటి వైద్య నిపుణులు నామాల అనిల్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్లు బీరం నాగిరెడ్డి, నాయుడు శ్రీనివాస్,అనంతగిరి రవి,గోనె యువరాజు,పీఆర్ఓ రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం….

పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,కె. ఆర్ నాగరాజు,వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరిష్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి,ఎన్డిపిసిఎల్ సి యండి వరుణ్ రెడ్డి,ఎన్సిసి గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు,.

కర్నల్ రవి,వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ప్రభాకర్ రావు శ్రీనివాస్, బాలస్వామి,రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి శ్రీనివాస్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు

పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారన్నారు. వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని చెప్పారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో శాసన సభ్యులు,పోలీసులు,అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం

సభ్యులు పాల్గొన్నారు.

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత…

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావు గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ 13 వేల రూపాయల చెక్కును నార్లపూర్ గ్రామానికి చెందిన కాశమైన వెంకటలక్ష్మి దశరథం కుటుంబానికి బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి భరోసాగా మెదక్ ఎంపీ నిలుస్తారని కొనియాడా రు అలాగే ఇంటింటికి తిరుగుతూ జి ఎస్ టి తగ్గిన వస్తువుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చిమ్మనమైన శ్రీనివాస్, చంద్రశేఖర్, నరేష్ , సంజువు, ప్రణయ్ కుమార్, పరశురాములు, తిరుపతి, అరవింద్, నాగభూషణం, కరుణాకర్, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు…

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు

రెండేళ్లుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు

నర్సంపేట మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గల అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు. వార్డు పరిధిలో ఉన్న అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి కంపు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయంగా మారుతున్న అంతర్గత రోడ్ల పట్ల గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు.

పారిశుద్ధంపట్ల చెత్త సేకరణ కోసం రెండు రోజులకు ఒకసారి రావాల్సిన సంబంధిత వాహనము వారం రోజులైనా రాకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్త పేరుకుపోయిన 1వ వార్డు గల్లీలు ఆడవిని తలపిస్తున్నది వాపోయారు. డ్రైనేజీ కాలువలు తీయక.. మురికితో నిండిపోయి..ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి.దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజ్ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోని ఆగ్రహం వ్యక్తం చేశారు.అపరిశుభ్రతతో ఈగలు,దోమల దాడులతో వార్డు ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారని పేర్కొన్నారు.చిన్న వర్షం పడ్డ అంతర్గత మట్టి రోడ్లన్నీ బురుదమయమై నడవడానికి కూడా వీలు లేకుండా..కాలు వేస్తే కాలు తీయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.

డ్రైనేజ్ కాలువ పక్కనే వేసిన మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు ఏర్పడి మిషన్ భగీరథ వాటర్ వదిలినప్పుడల్లా డ్రైనేజీ నీటిలో కలిసి కలుషితమవుతున్నాయని గతంలో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన నేటికీ కూడా మరమ్మతులు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం కోరారు.

మెట్పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం, కాంగ్రెస్ నాయకుల సూచనలు….

మెట్ పల్లి అక్టోబర్ 21 నేటి దాత్రి

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువ్వాడి కృష్ణారావు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్పల్లి నియోజకవర్గం లో మక్కల కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగాయని వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని దళారులను నమ్మవద్దని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర 500 కోట్లు మంజూరు చేస్తుందని దానిని మంత్రివర్యులు ప్రకటించారని రైతులు సన్నధాన్యాలు పండించి బోనస్ 500 రూపాయలు లబ్ది పొందాలని అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పై అవాక్కు చివాకులు మాట్లాడుతున్నారని హైదరాబాదులో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండలాధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీజీ గౌడ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రణయ్ గౌడ్…

టీజీ గౌడ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రణయ్ గౌడ్
మల్లాపూర్ అక్టోబర్ 21 నేటి ధాత్రి

 

తెలంగాణ గౌడ యువజన సంఘం కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షునిగా బాలసాని ప్రణయ్ గౌడ్ ను నియమిస్తూ మంగళవారం ప్రకటించారు.
జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొంగాని పవన్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు అమరవేణి నరస గౌడ్ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధరామయ్య గౌడ్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రణయ గౌడ్ ను ఎన్నుకున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు అలాగే గౌడ కులస్తుల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు…

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు

జైపూర్,నేటి ధాత్రి:

 

సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.

రైతు వేదికలో కపాస్ కిసాన్ యాప్, శనగ విత్తన పంపిణీ ప్రారంభం…

రైతు వేదికలో కపాస్ కిసాన్ యాప్, శనగ విత్తన పంపిణీ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం…

ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):

 

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

చందుర్తిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం…

పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు,వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ పరామర్శ.

చందుర్తి, నేటిధాత్రి:

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించి,అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎస్పీ.

అనంతరం సాయుధ పోలీసులు”శోక్ శ్రస్త్” చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు,సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని,వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత,రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని,దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఇట్టి కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించడం జరిగింది.

పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీ,క్యాండిల్ ర్యాలీ,2k రన్,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు,ఫోటో,వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్,మొగిలి, శ్రీనివాస్,నటేష్,ఆర్.ఐ రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version