నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి…

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి

బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బీసీల రిజర్వేషన్ కోసం 24నా జరగనున్న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం మహేందర్ ప్రైవేట్ వేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 24 వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, విశారదన్ మహరాజ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘాలు, కుల సంఘాలు బీసీ కులస్తులు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బీసీ ప్రజానీకం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎందుకు నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇకనుంచి అయిన వారి పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణ, రమేష్, బిక్షపతి, సలీం ,లక్ష్మణ్ కుమార్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా…

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి..

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల

మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు

ఆదివారపు సంత తాత్కాలిక మార్పు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల,నేటిధాత్రి

 

 

పట్టణంలో మున్సిపాలిటీ రోడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ ఆద్వర్యంలో తొలగించారు.ఈ సందర్భంగా కమిషనర్ సుష్మ మాట్లాడుతూ మున్సిసల్ పరిదిలో రోడ్లను ఆక్రమించుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబందనలు అతిక్రమిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతాయని పాత సీఎంఎస్ గోదాం సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కాంపౌండ్ నిర్మాణాన్ని తొలగించుటకు నోటీసులు జారీ చేసినప్పటికి ఆవ్యక్తి స్పందించకపోగా ఆ నిర్మాణాన్ని కూల్చివేత జరిపినట్టు తెలిపారు.

ప్రతి ఆదివారము నిర్వహించే పశువుల సంత తాత్కాలిక మార్పు

ప్రతిఆదివారము నిర్వహించే పశువులు,గొర్లు,మేకల సంతల స్థలంలో నవంబర్ 3న మహారుద్రయాగం ఉన్నందున ఏర్పాటు అవుతున్న పనులను పరిశీలించి 2వ తేదీన జరిగే పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు సమీపంలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు..

ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పార్టీ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ ఎంపీటీసీ శంకర్ పాటిల్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్,సంగ్రామ్ పాటిల్,మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, బొప్పన్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ అమృత్ శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, సి విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, సోషల్ మీడియా మండల ఇంచార్జి నవీన్ ఆర్.టి.ఐ యాక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గోపాల్ నమస్తే ఇందు జహీరాబాద్ ఇంచార్జ్ అఖిల్ తదితరులు పాల్గోని ఉదయ్ శంకర్ పాటిల్ శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు,

ప్రజలను అందుబాటులో ఉంటున్న వైద్యాధికారి అరిఫ్…

ప్రజలను అందుబాటులో ఉంటున్న వైద్యాధికారి అరిఫ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల బర్దిపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలను రోగులను అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తున్న డాక్టర్ ఆరిఫ్ మాట్లాడుతూ సాధారణంగా చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ముక్కు కారడము, అస్తమ, శ్వాస కోస వ్యాధులు, హార్ట్ ఎటాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు మొదలగునవి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలకు, వృద్ధులకు షెటర్స్, బ్లౌజెస్, దుప్పట్లు నిండుగా కప్పుకొని చలికి గురి కాకుండా ఉండాలని కోరారు.

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన….

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన.

బాలానగర్ / నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.

మత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్న విద్యాసంస్థలు…

 

మత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్న విద్యాసంస్థలు
అధికారులు ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట. వర్ధన్నపేట పట్టణంలోని పుస్కోస్ పాఠశాల విద్యార్థులకు మత బోధనలు చేస్తూ దొరికిపోయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారులు ఎంక్వయిరీ చేసి అది నిజమని తేల్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జిల్లా అధికారులు మరియు పోలీసు శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చట్టం ఎటువైపు పోతుంది అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన తర్వాత కూడా విద్యాశాఖ సంబంధిత అధికారులు మరియు పోలీస్ శాఖ ఇప్పటివరకు స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు ప్రాంతీయ విద్యాశాఖ అధికారికి వివరాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటివరకు వారు ఆ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలపై చర్యలు తీసుకునే విధంగా ఏ ఒక్క పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం దేనికి నిదర్శనం అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది స్వలాభం కోసం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా పనిచేస్తున్నారా లేదా సమాజంలో ఉన్న అందరి కోసం పనిచేస్తున్నారా వారు చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోని సరియైన చర్యలు ఆ విద్యా సంస్థపై తీసుకోకుంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ మత బోధనలు చేస్తున్న పాఠశాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే హిందూ సంస్థలు మరియు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పంజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల పై సత్వరమే చర్య తీసుకోవాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని అధికారులను హెచ్చరించారు.

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్…

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం ఎస్ఐ రేఖ అశోక్ విద్యార్థులతో పోలీస్ స్టేషన్ నందు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించడం అయినది ఇందులో ప్రధానంగా పిటిషన్ మేనేజ్మెంట్ గురించి ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్ గురించి డైల్ 100 గురించి, డ్రగ్స్ నిర్మూలన గురించి సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అయినది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నందు ఉన్న సెట్ ఏ విధంగా పనిచేస్తుందో అనేది వారికి ప్రాక్టికల్ గా చూపించడమైనది

నిజాంపేట లో ఆటో ర్యాలీ..

నిజాంపేట లో ఆటో ర్యాలీ..
డ్రైవర్లకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వివిధ ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. పోలీస్ విధుల గురించి డ్రైవర్లకు వివరించారు.

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్…

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్

* ఇంచార్జి కలెక్టర్ గా సైతం..

– సెలవులో వెళ్లిన కలెక్టర్ ఎం హరిత

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్లగా, ఇంచార్జి కలెక్టర్ గా సైతం గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు…

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు

నమస్తే తెలంగాణ ఆఫీస్ పై దాడి చేయడం సిగ్గు చేటు

మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడడం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలి స్టులపై దాడి హేయమైన చర్య మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా వారిపై దుర్భాష లాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజాపాలన కొన సాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు యువ కులు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. ఇప్పటికైనా ఇటు వంటి చర్యలు మానుకోవాలని కొనియాడారు లేనిపక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపు తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ జిల్లా నాయకులు బెరుగుతరుణ్ గోపి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్, వినయ్, వంశీ, సాయి కృష్ణ తేజ ,గణేష్ ,మున్ని, నాని మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి….

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల,నేటిధాత్రి

 

స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి కబడ్డీ కోఖో క్రీడలకు ఎంపిక అయిన క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని కాబట్టి పరకాల మండలానికి ఎక్కువ సంఖ్యలో అవార్డులు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల కార్యదర్శి సంది కరిత ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య నోడల్ అధికారి నామానిసాంబయ్య,ప్రదానోపాద్యాయులు బాస్కర్,పీడీలు శ్యాం, రజిత,వినయ్,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పీఈటీలు పాల్గొన్నారు.

మహా రుద్రయాగ శాల పనులను పరిశీలించిన సోదా….

మహా రుద్రయాగ శాల పనులను పరిశీలించిన సోదా

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని నవంబర్ 3 సోమవారం రోజున జరిగే మహా రుద్రయాగశాలను సందర్శించి పనులను పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ.ఈ కార్యక్రమంలొ మహారుద్ర యాగం కమిటీ సభ్యులు కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మహా రుద్ర యాగం అధ్యక్షులు ఎర్రం లక్ష్మణ్,యాగం కో కన్వీనర్ గందె రవి,ఆముదాలపల్లి అశోక్ గౌడ్,కుంకుమేశ్వర ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు సంధ్య సత్యనారాయణ,తోట రవి, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,నల్లెల్ల అనిల్ కుమార్,ఏకు రాజు,డీలర్ రాజేందర్ రెడ్డి,పావుశెట్టి అనిల్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ..,.

జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గణేషాపూర్లో
కర్ణాటక వ్యక్తితో కలిసి కొందరు అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు రవాణా చేస్తున్నారు. ఆర్డీవో ఆదేశించినా న్యాల్కల్ తహశీల్దార్ చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులతో పాటు తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం..

గన్నేరువరంకు అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానేరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షులు పుల్లెల జగన్ మోహన్, గన్నేరువరం మండల బిజెపి నాయకులు పుల్లెల రాము రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి గన్నేరువరం మండల కేంద్రానికి అదనపు బస్సులు వేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి గన్నేరువరం మండల కేంద్రానికి ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నడుస్తున్నవని, అందులో ఒకటి పొత్తూరు మీదుగా గన్నేరువరంకు, మరొకటి గుండ్లపల్లి మీదుగా గన్నేరువరంకు నడస్తున్నవని, రెండు బస్సులు సరిపోక ప్రయాణీకులు అనేక అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. అరవై మంది ప్రయాణించే బస్సులో వంద మందికి పైగా ప్రయాణీకులు ప్రమాదకరంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించవలసిన వస్తోందని, గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని కరీంనగర్ నుండి పొత్తూరు మీదుగా ఒక బస్సు, కరీంనగర్ నుండి గుండ్లపల్లి మీదుగా ఒక బస్సు అదనంగా వేయించగలరని మంత్రికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యార్థుల, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చడానికి, గన్నేరువరం, మాధాపూర్, ఖాసీంపేట, మైలారం, చొక్కారావుపల్లి గ్రామాల సౌకర్యం కోసం అదనపు బస్సులు వేయడానికి పరిశీలిస్తామని మంత్రి తెలియజేశారని పుల్లెల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి…

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కలకు వింతరోగా


లు…పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రేగా కాంతారావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-23T141620.131.wav?_=1

 

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రేగా కాంతారావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన జయబాబు సతీమణి స్వప్న (ఎఫ్ బి ఓ) అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్ళి,స్వప్న పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం పోలెబోయిన జయబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిమైన ప్రకటించారు.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొమరం రాంబాబు,పోగు వెంకటేశ్వర్లు,గుడ్ల రంజిత్ కుమార్,పాయం నరసింహారావు,సుతారి నాగేష్,ప్రభాకర్,నరేష్ తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version