క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల,నేటిధాత్రి
స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి కబడ్డీ కోఖో క్రీడలకు ఎంపిక అయిన క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని కాబట్టి పరకాల మండలానికి ఎక్కువ సంఖ్యలో అవార్డులు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల కార్యదర్శి సంది కరిత ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య నోడల్ అధికారి నామానిసాంబయ్య,ప్రదానోపాద్యాయులు బాస్కర్,పీడీలు శ్యాం, రజిత,వినయ్,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పీఈటీలు పాల్గొన్నారు.
