నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
ఆదివారపు సంత తాత్కాలిక మార్పు
మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో మున్సిపాలిటీ రోడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ ఆద్వర్యంలో తొలగించారు.ఈ సందర్భంగా కమిషనర్ సుష్మ మాట్లాడుతూ మున్సిసల్ పరిదిలో రోడ్లను ఆక్రమించుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబందనలు అతిక్రమిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతాయని పాత సీఎంఎస్ గోదాం సమీపంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్న కాంపౌండ్ నిర్మాణాన్ని తొలగించుటకు నోటీసులు జారీ చేసినప్పటికి ఆవ్యక్తి స్పందించకపోగా ఆ నిర్మాణాన్ని కూల్చివేత జరిపినట్టు తెలిపారు.
ప్రతి ఆదివారము నిర్వహించే పశువుల సంత తాత్కాలిక మార్పు
ప్రతిఆదివారము నిర్వహించే పశువులు,గొర్లు,మేకల సంతల స్థలంలో నవంబర్ 3న మహారుద్రయాగం ఉన్నందున ఏర్పాటు అవుతున్న పనులను పరిశీలించి 2వ తేదీన జరిగే పశువుల సంత తాత్కాలికంగా దామెర చెరువు సమీపంలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు.
