జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గణేషాపూర్లో
కర్ణాటక వ్యక్తితో కలిసి కొందరు అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు రవాణా చేస్తున్నారు. ఆర్డీవో ఆదేశించినా న్యాల్కల్ తహశీల్దార్ చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులతో పాటు తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
