ప్రాథమిక పాఠశాల ఖాoజమల్ పూర్ మరియు గోడిగ్యార్ పల్లి పాఠశాలలో ఈ రోజు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, జిల్లా టీం మెంబర్స్ యం,డి వాహబోదీన్, నిమ్మల కిష్టయ్య, పాఠశాలలకు అకస్మాత్తుగా వెళ్లి రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఎఫ్, ఎల్, ఎన్. సి. సి. ఇ. పేరెంట్స్ మీటింగ్, మధ్యాహ్న భోజనo, టాయిలెట్స్, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి నమోదు రికార్డులను, తరగతి ఉపాధ్యాయుల పరిశీలన, తరగతి టీ,ఎల్,యం లకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. వివిధ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగులో కొంతమంది విద్యార్థులు ధారాళంగా చదవడం, గణితం లో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు సంతృప్తి వ్యక్తపరిచారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, తరగతి గదిలో టీ,ఎల్,ఎమ్ ప్రదర్శించి, హ్యాండ్ బుక్ ను ఉపయోగించి బోధించాలని, తాగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక తరగతుల పేరిట నిబంధనలను అతిక్రమిస్తుందని మాదిగ స్టూడెంట్ ఫోరమ్ (ఎం ఎస్ ఎఫ్) జిల్లా అధ్యక్షులు వడ్లకొండ సంజయ్ మాదిగ అన్నారు.గురువారం ఆయన సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు రాత్రి వరకు నిర్వహిస్తూ తీవ్రమైన చలిలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ, అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు.ప్రభుత్వము నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125 కాగా,ఇష్టానుసారంగా పెద్ద మొత్తంలో ఆర్థిక దోపిడి చేస్తున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలపై వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఎమ్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో క్రిష్ణాపూర్ ఉపాధ్యాయుడు సురేష్ కు అవార్డు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు నారాయణఖేడ్ లో జరిగింది. ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఝరాసంగం మండలం క్రిష్ణాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు యం. సురేష్ కు జిల్లా స్థాయిలో అవార్డు దక్కింది. ముగింపు సమావేశంలో విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు, నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పట్టభద్రుల ఎం ఎల్ సి అంజిరెడ్డి, డి.యస్. పి, సబ్ కలెక్టర్ ఉమాహారతి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకున్నారు.
మాదకద్రవ్యాల వినియోగంపై ప్రతిజ్ఞ – మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి
మొగులపల్లి నేటి ధాత్రి
ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు జడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లి పాఠశాల ఆవరణలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించనైనది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో మాదకద్రవ్యాల వినియోగం ఒకటాని దాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అందులో విద్యార్థులను పాల్గొని మారకద్రవ్యాల వినియోగం అమ్మకం కొనడం నేరమని ఈ విద్యార్థులకు సూచించారు. మారకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అలా వినియోగించే వారిని అధికారులకు సమాచారం ఇచ్చి అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి వెంకన్న వై సురేందర్ ఏ వి ఎల్ కళ్యాణి అనిల్ కుమార్ ప్రవీణ్ రాజు పద్మ లలిత విజయ భాస్కర్ రాజయ్య శ్రీకాళ అంగన్వాడీ టీచర్స్ చందర్ బజార్ వేణు ఎన్సిసి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలను బుధవారం నాడు సందర్శించారు. ఇందులో భాగంగా ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలలో మండల ,జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలలో ఆడిన క్రీడాకారులను డి .ఇ. ఓ. రాజేందర్ అభినందించారు.డి.ఇ. ఒ మాట్లాడుతూ బాలికల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు .రాష్ట్రస్థాయికి ఎంపిక అయినా క్రీడాకారులను అభినందించారు. పాఠశాల విద్యార్థుల క్రీడాభివృద్ధికి ఉదయం ,సాయంత్రం మెలుకువలు నేర్పుతూ విశేష కృషి చేస్తున్న ఆ పాఠశాల పీడి గురుసింగా పూర్ణిమను జిల్లా విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి .శ్రీనివాస్ రెడ్డి మరియు ఎం ఇ.ఓ ప్రకాష్ బాబు , పేట సంఘం అధ్యక్షులు సిరంగి రమేష్ పాఠశాల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి
పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ డైరెక్టర్తో వినయ్ పవర్ భేటీ, పాఠశాలల్లో సౌకర్యాలపై చర్చ
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలాస్, ఐ.ఏ.ఎస్. గారిని ఏఐటిఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్ హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల లేమి వంటి మౌలిక సదుపాయాల కొరతపై వారు చర్చించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని వినయ్ పవర్ కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, నవంబర్ మొదటి వారంలో జహీరాబాద్ను సందర్శించి, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సోతుకు.ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీ చైతన్య పాఠశాలను నడిపిస్తున్నారని అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజులు కట్టని విద్యార్థులను గంటల తరబడి క్లాస్ రూమ్ ముందు నిలబెట్టుతున్నారని, వారికి ఎటువంటి పరీక్షలకు అనుమతించకుండా విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ క్వాలిఫై టీచర్లు లేకుండా డిగ్రీలు పూర్తయిన వారితో చదువు చెప్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు చదువు చెప్పాలంటే తప్పకుండా ఉపాధ్యాయునికి బిఈడి పూర్తయి ఉండాలని నిబంధన శ్రీ చైతన్య పాఠశాల పాటించడం లేదని అన్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేసి ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. బుక్స్ యూనిఫామ్ ఇతర పేర్ల మీద అనేక వాసులకు పాల్పడుతున్నారని ఈ దోపిడిని అరికట్టాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు ఉందని గుర్తు చేశారు. శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, ఎండి అలీమ్ పాషా, అజయ్, హైమద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-అధికారుల ప్రమేయం తోటే తొలగించారని విద్యార్థి సంఘాల ఆరోపణ
సీజ్ వేయడం వరకే మా బాధ్యత–మండల విద్యాధికారి
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యొక్క బుక్స్ ని ఎలాంటి పర్మిషన్ లేకుండా అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని 25 జూలై 2025 రోజున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి సీజ్ చేయించారు. కానీ సీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే దానిమీద మరొక తాళం వచ్చింది. దీనిపై ఎంఈఓ ని సంప్రదించగా వారు కాపలా ఉండలేం కదా. మా బాధ్యత సీజ్ వేయడం వరకే అనే సమాధానం పొంతన లేకుండా ఉన్నదని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఇప్పుడు అసలు సీజ్ చేసినట్లు ఆనవాలు కూడా లేకుండా చేశారు. స్థానిక మండల విద్యాధికారి ప్రైవేటు పాఠశాలలకు ఎలాంటి పర్మిషన్ లేకున్నా పుస్తకాల నమ్ముతున్నారని అప్పట్లో ఫిర్యాదు చేసిన కొన్ని పాఠశాలలను పట్టించుకోలేదని, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలను సీజ్ చేపిస్తే నేడు ఆ సీజ్ కనపడ పోవడంతో దీనిలో మండల విద్యాధికారి పాత్ర ఉందని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల పైన మరియు మండల విద్యాధికారి పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కలుస్తామని విద్యార్థి సంఘాలు తెలిపాయి.
మండల విద్యాధికారి వివరణ కోరగా….
రెండవ తాళం ఎవరు వేశారు అనేది మాకు తెలియదు. సీజ్ వేయడం వరకే మా బాధ్యత. దానికి కాపాల మేము ఉండలేము కదా. వర్షాలు, గాలికి సీజ్ పోయి ఉండొచ్చు. ఒకవేళ ఫీజ్ ఎవరైనా తీస్తే పై అధికారికి కంప్లైంట్ చేస్తాం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ఎండి.యాకుబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో సంఘటనను ఉన్నతాధికారులకు నివేదించడం, వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యం కారణంగా జడ్పీహెచ్ఎస్ కురిక్యాల గ్రేడ్-2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ.కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని ఆదేశించారు. ఈఘటనలో ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషాను కూడా సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు.
మత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్న విద్యాసంస్థలు అధికారులు ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట. వర్ధన్నపేట పట్టణంలోని పుస్కోస్ పాఠశాల విద్యార్థులకు మత బోధనలు చేస్తూ దొరికిపోయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారులు ఎంక్వయిరీ చేసి అది నిజమని తేల్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జిల్లా అధికారులు మరియు పోలీసు శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చట్టం ఎటువైపు పోతుంది అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన తర్వాత కూడా విద్యాశాఖ సంబంధిత అధికారులు మరియు పోలీస్ శాఖ ఇప్పటివరకు స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు ప్రాంతీయ విద్యాశాఖ అధికారికి వివరాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటివరకు వారు ఆ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలపై చర్యలు తీసుకునే విధంగా ఏ ఒక్క పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం దేనికి నిదర్శనం అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది స్వలాభం కోసం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా పనిచేస్తున్నారా లేదా సమాజంలో ఉన్న అందరి కోసం పనిచేస్తున్నారా వారు చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోని సరియైన చర్యలు ఆ విద్యా సంస్థపై తీసుకోకుంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ మత బోధనలు చేస్తున్న పాఠశాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే హిందూ సంస్థలు మరియు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పంజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల పై సత్వరమే చర్య తీసుకోవాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని అధికారులను హెచ్చరించారు.
మత ప్రచారం చేస్తున్న విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారి చర్య తీసుకోవాలి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలోని పుస్కోస్ ప్రైవేట్ పాఠశాలపై మండల మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు పాఠశాలల్లో మత ప్రచారాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల పై ఇతర మత పుస్తకాలను బలవంతంగా రుద్దుతూ చర్చి లో పనిచేస్తున్న మత ప్రచారకులైన ఫాదర్స్ తో విద్యార్థులకు వాటిని నేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్న పాఠశాలపై చర్య తీసుకొని ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని మహేందర్ రెడ్డి పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు. లేదంటే ఆ పాఠశాల పై చర్య తీసుకునే విధంగా పై అధికారులకు తెలియజేసి పోరాటం చేస్తామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం ఎంపీ యుపీఏస్ పాఠశాల తరగతి గదిలో బి. సుజాత అనే ఉపాధ్యాయురాలు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు సుజాత టీచర్ కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు ఐదు తరగతులకు ఒకే టీచర్ ఉన్నారని తిరిమాల్ తెలిపారు 5 తరగతులకు ఓకే గది ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు పాఠశాలలో మరుగుదొడ్లు వసతులు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వన్ని కోరారు
తెలంగాణ రాష్ట్ర ఎం ఆర్ సి మెసెంజర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి… భాను బిక్షపతి
కేసముద్రం/ నేటి ధాత్రి
https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi
జీవో నెంబర్. 60 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ క్రింద వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెంచిన వేతనాలను విద్యాశాఖ మండల విద్యా వనరుల కేంద్రం ఎం ఆర్ సి / ఎంఈఓ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 467 మంది గత 22 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మెస్సెంజర్ కమ్ అటెండర్ లకు కూడా వర్తింప చేయాలని,
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి) ( ఎంఈఓ కార్యాలయాల్లో మెసెంజర్స్ పని చేస్తున్నామని. వారికి ప్రభుత్వం వేతనాలు ఈ (కింది విధంగా చెల్లిస్తూ వస్తుందని. కాలక్రమంలో వారి వేతనాల పెంపు ప్రభుత్వం నిర్ణయించినట్లు జరగకుండా విధ్యాశాఖాదికారులు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని. కావున ఒకసారి ఈ (కింది విషయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జి ఓ ఎం ఎస్ నెంబర్ 3 12/01/2011 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఆఫీస్ సబార్టినేట్ / మెసెంజర్ లకు వేతనం రూ.6700/- గా రావాలి కానీ ప్రభుత్వం కేవలం 2500/- మాత్రమే నామమాత్రంగానే ఇచ్చి. దీని తర్వాత సర్వ శిక్షా అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఆర్ సి నెంబర్1259/2011 (పకారం వేతనాలు రూ. 4500 గా మాత్రమే పెంచారని. మరుసటి సంవత్సరం ఆర్ సి నెంబర్. 6244/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 9/2012, 22/09/2012 లో రూ 4500 నుండి రూ 6000 గా మాత్రమే పెంచారని, ఇక్కడా మెసెంజర్ లకు వేతనాల పెంపు సరిగా జరగలేదని, అనేక విజ్ఞాపనల అనంతరం ఆర్ సి 660/ ఆర్ వి ఎం( ఎస్ ఎస్ ఏ)/ సి 2/2013,: 05/02/2014 లో రూ 6000 నుండి 7500 గా మాత్రమే పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ జీవో ఎంఎస్ నెంబర్.14, ది: 19/02/2016 ఆఫీస్ సబార్టినేట్లకు వేతనం రూ. 12000/- గా ప్రభుత్వం నిర్ణయించింది మునుపటి వరకు అన్ని దశల్లో వేతనాల పెంపు ఒకే విధంగా జరిగినా, జీవో ఎంఎస్ నెంబర్. 14 లో మాత్రం మెసెంజర్లకు వేతనాలు రూ. 12000/- ఉండాల్సింది పోయి కేవలం 7500/- నుండి 8000/- మాత్రమే పెంచి తీవ్ర అన్యాయానికి గురి అయ్యామని. ఇక్కడ వేతనాల పెంపు అందరికి ఒకేలా జరగలేదని. దీన్ని మెసెంజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎందరో అధికారులకు మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోలేదని. దాదాపు నెలకు రూ. 4000/- జీతాన్ని మెసెంజర్లు నష్ట పోయారు. తర్వాత జి ఓ. ఆర్ టి, నెంబర్ 144,.31/08/2017లో 8000/- నుండి రూ. 8500/- మాత్రమే పెంచారు. మరలా కొత్త వేతనాల సవరణ ఉత్తర్వుల ప్రకారం జీవో ఎంఎస్ 60 తేదీ: 11/02/2021 ప్రకారం కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ జీవో. విడుదల చేసింది ఇక్కడా ఆఫీస్ సబార్టినేట్ల వేతనాలు 30% పెంచుతూ రూ. 15600/- గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం మెసెంజర్ల వేతనాలు రూ.8500/- ల నుండి రూ. 11050/- గా మాత్రమే పెంచుతూ తీవ్ర అన్యాయానికి గురి చేశారని. ఈ జి ఓ. లో పేర్కొన్న విధంగా అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు సక్రమంగా పెంచారు. కానీ మెసెంజర్లకు మాత్రం వేతనాలు సరిగా పెంచలేదని. దాదాపు నెలకు 4000/-రూ. వేతనం నష్ట పోతున్నారని. ఇట్టి నష్టాన్ని నివారించాలని కోరుతూ ఎందరి చుట్టూ తిరిగిన ఫలితం కనబడటం లేదని. భవిష్యత్ లో కూడా వేతనాల పెంపులో అన్యాయం జరిగేలా ఉందని. కావున ఇట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి పెరిగిన వేతనం అమలు కాక నష్ట నష్టపోయాం, పెరిగిన నితావసరాల ధరలకు అనుగుణంగా మాకు జీవో ఎంఎస్.60, తేదీ. 11/06/2021 నుండి పెరిగిన వేతనం అమలు చేయాలని. మండల విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మలు అయిన మండల విద్యా వనరుల కేంద్రం ఎం.ఆర్.సి లో పనిచేస్తున్న మెసెంజర్లు స్వీపర్లుగా,అటెండర్లుగా అవసరమైతే నైట్ వాచ్మెన్లుగా కూడా బాధ్యతలు నిర్వహించవలసి వస్తున్నదని. చాలీచాలని వేతనంతో బతుకీడుస్తున్న మాకు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ. 15,600/- లుగా పెంచినట్లయితే మా జీవితాలు బాగుపడతాయని. 15 సంవత్సరాలుగా జీవోల ప్రకారం గౌరవ వేతనం పెరగకపోవడం వలన నష్టపోతున్నామని ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇట్టి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నామని అన్నారు
బిఎస్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్
పరకాల నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రయివేట్ పాఠశాల సమాచారం కోరగా పరకాల ఎంఈఓ రమాదేవినీ కోరగా ఇప్పటివరకు దాదాపు 55 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్ అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఈఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు రెండు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉండటం లేదన్నారు.సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
సమాజంలో గురువుల పాత్ర అమూల్యమైనది… ఎంఈఓ కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి ధాత్రి
మన దేశ రెండవ రాష్ట్రపతి మరియు గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, విద్యారంగంలో ఉపాధ్యాయులు చేసే నిస్వార్థ సేవలను, అంకితభావాన్ని గౌరవించుకోవడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువారం కేసముద్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావం, కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అని కొనియాడారు.ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ, విద్యార్థులకు జ్ఞానాన్ని పంచే గురువుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అద్భుతమైన కృషికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమైనది. వారు అందించే మార్గదర్శకత్వం, బోధన, ప్రోత్సాహం విద్యార్థుల భవిష్యత్తును రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉపాధ్యాయులు తమ జీవితాలను విద్యార్థుల అభివృద్ధికి అంకితం చేస్తారని అన్నారు. వారి అద్భుతమైన కృషిని స్మరించుకుంటూ, వారి పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఉత్తమ ఉపాధ్యాయులు:- 1 బందెల రాజు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, కేసముద్రం స్టేషన్ 2) బద్దెపురి అంజయ్య, స్కూల్ అసిస్టెంట్ పెనుగొండ హైస్కూల్ 3) చీకటి వెంకట్రాం నర్సయ్య, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం విలేజ్ హైస్కూల్ 4) గుంటి కుమార స్వామి, స్కూల్ అసిస్టెంట్ కేసముద్రం స్టేషన్ 5) గుడిబోయిన గోపికృష్ణ, స్కూల్ అసిస్టెంట్ తాళ్ల పూసపల్లి హైస్కూల్ 6) మాంకాలి యాకాంబరం, స్కూల్ అసిస్టెంట్ కల్వల హైస్కూల్ 7) షేక్ మునీర్ అహ్మద్, ఎల్.ఎఫ్.ఎల్.హెచ్.ఎం. భవాని గడ్డ తండా 8) పోతుగంటి సరిత, ఎస్జీటీ ఎంపీయూపీఎస్ రంగాపురం 9) జె సువర్ణ, ఎస్జీటీ ఎంపీపీఎస్ మానసింగ్ తండా 10) జయ్యారపు స్వప్న, ఎస్జిటి ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ 11) తాళ్లపెల్లి రమేష్, ఎస్జీటీ ఎంపీపీఎస్ చైతన్య నగర్ 12) కడుదుల శ్రీధర్, ఎస్జిటి ఎంపీపీఎస్ చంద్రు తండా, వెంకటగిరి 13) సింగారపు ఉపేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ మాతృతండా 14) శివంగారి సురేందర్, ఎస్జీటీ ఎంపీపీఎస్ ముత్యాలమ్మ తండా, మహమూద్ పట్నం 15) నలబోల రేవతి, ఎస్జిటి ఎంపీపీఎస్ దన్నసరి 16) బానోత్ హరికిషన్, ఎంపీపీఎస్ కాట్రపల్లి 17) అయిత ప్రణీత, ఎంపీపీఎస్ కేసముద్రం స్టేషన్ 18) సి.హెచ్ స్వరూప, ఎస్జీటీ ఎంపీపీఎస్ కల్వల 19) తమ్మె శ్రీనివాస్, ఎస్జిటి ఎంపీపీఎస్ క్యాంపు తండా 20) వెన్ను బిక్షపతి కంప్యూటర్ ఆపరేటర్, ఎం.ఆర్.సి కేసముద్రం 21) చీర మురళి, సిఆర్పి, ఉప్పరపల్లి కాంప్లెక్స్ ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, కోట కనకయ్య, బండారు నరేందర్, కె చంద్రశేఖర్, వి రాజశేఖర్, మరియు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోపాల శ్రీధర్, బీరం జనార్ధన్ రెడ్డి, కీర్తి నాగయ్య, భద్రు నాయక్, గుండు సురేందర్, నరసింహ రాజు. భూక్య శ్రీను, వోమ సంతోష్, మండల రాజు, కె.శ్రీశైలం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 33 దరఖాస్తులు భూ సమస్యలపైనే రావడం విశేషం. ఈ నేపద్యంలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. 92 దరఖాస్తులలో రాగా అత్యధికంగా భూ సమస్యల పట్ల 33 వినతులు రాగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జిడబ్ల్యూఎంసీ) 18 దరఖాస్తులు,గృహ నిర్మాణ శాఖకు 9, వైద్య ఆరోగ్య,విద్య శాఖకు 4 చొప్పున వినతులు,ఇతర శాఖలకు సంబంధించినవి 24 ఫిర్యాదులు కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ వాతావరణ శాఖ జిల్లాకు ఆరేంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రోడ్లు,రవాణా,వైద్య ఆరోగ్య శాఖల జిల్లా అధికారులు శాఖల వారిగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకొని పరిస్థితుల కనుగుణంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి,డిఎఓ అనురాధ,డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,డిడబ్ల్యూఓ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఉమారాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలో పప్పేట్రి కి విశేష స్పందన తిలకించిన మంత్రివర్యులు, కలెక్టర్, జిల్లా విద్యాధికారి
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల రెజింతల్ గ్రామ ప్రధాన ఉపాధ్యాయురాలు సఫియా సుల్తానా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రదర్శనలో. ఎన్ఈపి 2020 అమలు కార్యక్రమాల భాగంగా,సి సి ఆర్ టి న్యూ ఢిల్లీలో శిక్షణ పొందిన సఫియా సుల్తానా ఆ శిక్షణలోని అంశాలను జిల్లా విద్యాశాఖ తరుపున ప్రదర్శించారు.ఈ ప్రదర్శనను రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా నోడల్ ఆఫీసర్, సీఎంఓ, జిల్లా సైన్స్ ఆఫీసర్ ప్రదర్శన కు సందర్శించి తిలకించిన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,
కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం
ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.