నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి
బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
బీసీల రిజర్వేషన్ కోసం 24నా జరగనున్న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం మహేందర్ ప్రైవేట్ వేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 24 వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, విశారదన్ మహరాజ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘాలు, కుల సంఘాలు బీసీ కులస్తులు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బీసీ ప్రజానీకం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎందుకు నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇకనుంచి అయిన వారి పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణ, రమేష్, బిక్షపతి, సలీం ,లక్ష్మణ్ కుమార్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
