సీఎం కప్ చెస్ పోటీలలో లవన్ బాబు జిల్లా స్థాయికి ఎంపిక..

సీఎం కప్ చెస్ పోటీలలో లవన్ బాబు జిల్లా స్థాయికి ఎంపిక:

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మాటూరు లవన్ బాబు ఇటీవల జరిగిన సీఎం కప్ నిర్వహించిన చెస్ పోటీలలో తన ప్రతిభను చాటి జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సీఎం కప్ టోర్నమెంట్లో, చిట్యాల మండల స్థాయి చెస్ టోర్నీ లో పాల్గొని లవన్ బాబు హోరహోరి గా తలబడి.. మండల స్థాయి లో విజేతగా నిలిచి.. జిల్లా స్థాయికి ఎంపీక అవ్వడం జరిగింది. జిల్లా స్థాయికి ఎంపికైన లవన్ బాబును క్రీడాకారులు అధికారులు అభినందించి ఇంకా బాగా ఆడి రాష్ట్రస్థాయిలో మండలానికి జిల్లాకు పేరు తీసుకురావాలని అన్నారు.

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఎంపీడీవో మున్వర్

కొత్తగూడ నేటిధాత్రి

కొత్తగూడ మండల కేంద్రంలోని స్పోర్ట్స్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో మన్వర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు.మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపించేందుకు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మన్వర్ తెలిపారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఈటీలు, క్రీడా నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి….

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల,నేటిధాత్రి

 

స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి కబడ్డీ కోఖో క్రీడలకు ఎంపిక అయిన క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని కాబట్టి పరకాల మండలానికి ఎక్కువ సంఖ్యలో అవార్డులు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల కార్యదర్శి సంది కరిత ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య నోడల్ అధికారి నామానిసాంబయ్య,ప్రదానోపాద్యాయులు బాస్కర్,పీడీలు శ్యాం, రజిత,వినయ్,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పీఈటీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version