మత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్న విద్యాసంస్థలు
అధికారులు ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట. వర్ధన్నపేట పట్టణంలోని పుస్కోస్ పాఠశాల విద్యార్థులకు మత బోధనలు చేస్తూ దొరికిపోయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారులు ఎంక్వయిరీ చేసి అది నిజమని తేల్చిన తర్వాత కూడా ఇప్పటివరకు జిల్లా అధికారులు మరియు పోలీసు శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చట్టం ఎటువైపు పోతుంది అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన తర్వాత కూడా విద్యాశాఖ సంబంధిత అధికారులు మరియు పోలీస్ శాఖ ఇప్పటివరకు స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారులకు మరియు ప్రాంతీయ విద్యాశాఖ అధికారికి వివరాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటివరకు వారు ఆ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలపై చర్యలు తీసుకునే విధంగా ఏ ఒక్క పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం దేనికి నిదర్శనం అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది స్వలాభం కోసం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా పనిచేస్తున్నారా లేదా సమాజంలో ఉన్న అందరి కోసం పనిచేస్తున్నారా వారు చెప్పాల్సిన సమయం ఆసన్నమైనదని ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోని సరియైన చర్యలు ఆ విద్యా సంస్థపై తీసుకోకుంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ మత బోధనలు చేస్తున్న పాఠశాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే హిందూ సంస్థలు మరియు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పంజా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాల పై సత్వరమే చర్య తీసుకోవాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని అధికారులను హెచ్చరించారు.
