ప్రజలను అందుబాటులో ఉంటున్న వైద్యాధికారి అరిఫ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల బర్దిపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలను రోగులను అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తున్న డాక్టర్ ఆరిఫ్ మాట్లాడుతూ సాధారణంగా చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ముక్కు కారడము, అస్తమ, శ్వాస కోస వ్యాధులు, హార్ట్ ఎటాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు మొదలగునవి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలకు, వృద్ధులకు షెటర్స్, బ్లౌజెస్, దుప్పట్లు నిండుగా కప్పుకొని చలికి గురి కాకుండా ఉండాలని కోరారు.
