ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి..

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వామ్యం కావాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడం, ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం కోసం వార్డు సభలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
వార్డులో డ్రైనేజ్ సమస్యలు, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, చెట్లను పెంచుతూ పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.అనంతరం వార్డు ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, డీఎల్పీఓ రాజీవ్ కుమార్, వార్డు ఆఫీసర్ మహమ్మద్ రహీం పాషా, పల్లె దవాఖాన డాక్టర్ భావన, విద్యుత్ లైన్‌మన్ రాజు, ఆర్‌పి సువర్ణ, బీసీ హాస్టల్ వార్డెన్ భాస్కర్, వార్డు సభ్యులు కొలువుల వెంకట్, అరెపెల్లి బాబు, లక్క రాజు, ఆవుల శ్రీకాంత్, పున్నం రాజు, ఎడెల్లి అశోక్, మామిడాల సదాలక్ష్మి, ఉదయగిరి నాగమణి, సరిత తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి…

మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పన్నుల వసూలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

గ్రామపంచాయతీ ,నర్సరీ, పాఠశాలల సందర్శన

మధ్యాహ్న భోజనం పరిశీలన

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అప్పలరావుపేటలో మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ వై వి గణేష్ గారు ఆకస్మిక పర్యటన జరిపారు. ఎంపీడీవో శ్రీ దయాకర్ తో కలిసి ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ ,గ్రామపంచాయతీలను సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ప్రజా పాలనలో రోజు వారి కార్యక్రమాల ప్రగతి నివేదికల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. అలాగే అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పంపిణీ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, మెనూ వివరాలను ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నాణ్యత పై విద్యార్థులతో మాట్లాడారు.అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన ప్రగతిని పరిశీలించారు. రోజు వారి కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్ గారు, గ్రామ సర్పంచ్ ఊడుగుల అశోక్, గ్రామ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, ఏకాంబరం ,బోళ్ళ కుమార్, శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది కిరణ్, ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ నూరజ్, పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్, గీత ,యాకయ్య, భూలక్ష్మి ,వెంకట్రాజం, దయాకర్, శ్రీనివాసాచారి , తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చేరువై ప్రజలకు సేవలందించాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చాడ వెంకటరెడ్డి. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల భంగం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని, గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ ఏర్పాటులో సిపిఐ కార్యకర్తల కృషి ఉందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దాటిందని, ప్రజా పాలన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కృషి చేయాలని, సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు అందించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నప్పటికీ ఎంతో ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందని ఈనూతన సంవత్సరం నుండి మరో మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తారనే ఆశాభావాన్ని చాడ వెంకటరెడ్డి వ్యక్తం చేశారు.

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు…

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు

నమస్తే తెలంగాణ ఆఫీస్ పై దాడి చేయడం సిగ్గు చేటు

మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడడం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలి స్టులపై దాడి హేయమైన చర్య మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా వారిపై దుర్భాష లాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజాపాలన కొన సాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు యువ కులు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. ఇప్పటికైనా ఇటు వంటి చర్యలు మానుకోవాలని కొనియాడారు లేనిపక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపు తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ జిల్లా నాయకులు బెరుగుతరుణ్ గోపి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్, వినయ్, వంశీ, సాయి కృష్ణ తేజ ,గణేష్ ,మున్ని, నాని మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన….

కాంగ్రెస్ ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన.

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి

* ఈ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు

* రైతు రుణమాఫీ మధ్యలోనే ఆపారు

యూరియా సకాలంలో రాలేదు

ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు రాలేదు

రాజీవ్ యువశక్తి మొదలే పెట్టలేదు

మహిళలకు 2500 రానేలేదు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టి భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హడావిడిగా ఎన్నికలు నిర్వహించుటకు సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి న్యాయం చేస్తే మేం స్వాగతిస్తాం. కానీ న్యాయ నిపుణులతో చర్చించకుండా?సాధ్య , అసాధ్యాయులు అంచనా వేయకుండా? ఎన్నికల జీ.వో తీసుకురావడాన్ని హైకోర్టు స్టె ఇచ్చింది. దీనివల్ల ప్రజలు అధికారులు అసహనానికి గురవుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. అసమర్థ పాలనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన? అని విసిగిపోతున్నారు. ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు. రైతు రుణమాఫీ అందరికి జరగలేదు. యూరియా సకాలంలో రాలేదు. రాజీవ్ యువ శక్తి లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు అందలేదు. బతకమ్మ చీరలు లేవు. సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ప్రజలకు అవసరమైన ఆయకట్టు రోడ్లు లేవు. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుటకు కారణం మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోక పోవడమే ఇప్పటికైనా సంపూర్ణ పరిపక్వ నిర్ణయాలతో ప్రజలకు సేవ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రభుత్వానికి సూచించారు.

కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం.

కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం. ప్రజాపాలన దినోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం* మరియు ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలన నుంచి మొగలు సామ్రాజ్య వాదుల నుండి మన రాష్ట్రం విముక్తి చెంది ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మొగల్ సామ్రాజ్యవాదుల చేర నుండి విముక్తి అయిన రోజు సెప్టెంబర్ 17 ,గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి గత పది సంవత్సరాల నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో సురక్షితంగా సుభిష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 ఆరు గ్యారెంటీలను అమలుచేసి పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించి ముఖ్య మంత్రి సుపరిపాలన అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పార్టీ అభ్యర్థులందరినీ గెలిపెంచాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొబ్బెట రమేష్ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ , రాష్ట్ర నాయకులు జ్యోతి రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , మార్కెట్ డైరెక్టర్ మట్టికే రవీందర్, గుంటూరు పల్లి గ్రామ శాఖఅధ్యక్షులు నాగరాజు* , నాయకులు కొరిసాంబశివుడు, సరిగమల సదానందం, గుర్రపు నరసయ్య, క్యాత మార్కండేయ ,పిట్టల సాంబయ్య చిలుముల రాజమౌళి ,శనిగరపు మొగిలి ,దేవేందర్ రావు ,మేకల రాజయ్య, కట్కూరి సుమన్, మెరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు..

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version