ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు..

ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పార్టీ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ ఎంపీటీసీ శంకర్ పాటిల్, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్,సంగ్రామ్ పాటిల్,మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, బొప్పన్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ అమృత్ శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, సి విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, సోషల్ మీడియా మండల ఇంచార్జి నవీన్ ఆర్.టి.ఐ యాక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గోపాల్ నమస్తే ఇందు జహీరాబాద్ ఇంచార్జ్ అఖిల్ తదితరులు పాల్గోని ఉదయ్ శంకర్ పాటిల్ శాలువా పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు,

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

టీటీడబ్ల్యఆర్ఎస్ పూర్వ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఉప్పిట్ హోటల్ ప్రారంభం…

ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం దత్తగిరి కాలనిలో జరిగిన ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,విష్ణువర్ధన్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,సంగారెడ్డి,బి.విఠల్,నరేష్,మనోజ్,దిలీప్,తదితరులు పాల్గొన్నారు

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌.

అల్లరి నరేశ్‌ ఆల్కహాల్‌…

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో…

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అల్లరి నరేశ్‌, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్‌ మెహర్‌ తేజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. కాగా, అల్లరి నరేశ్‌ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version