నిజాంపేట లో ఆటో ర్యాలీ..
డ్రైవర్లకు అవగాహన
నిజాంపేట: నేటి ధాత్రి
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వివిధ ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. పోలీస్ విధుల గురించి డ్రైవర్లకు వివరించారు.
