ఈ నెల 27న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ…

ఈ నెల 27న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ తీసుకొని రాగలరు

ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్

 

జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు గాను 2025 – 27 సంవత్సరాలకు గాను ఏ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ తేదీ 23.10.2025 నాటికి ముగిసింది. భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లోని మొత్తం (59) మద్యం దుకాణాలకు గాను 1,863 దరఖాస్తులు రావడం జరిగింది. దరఖాస్తు ఫీజు రూపంలో 55 కోట్ల 89 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో అత్యధికంగా మల్లంపల్లి గ్రామం మండలం మద్యం షాపుకు 77 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. 27.10.2025 సోమవారం రోజున మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను భూపాలపల్లి పట్టణం, మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ రాహుల్ శర్మ సమక్షంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ తేదీ 27.10.2025 సోమవారం ఉదయం 9 గంటల వరకు ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ కు హాజరు కావాల్సిందిగా ఆయన సూచించారు. దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని రావాలని ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ సూచించారు

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్…

అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్

* ఇంచార్జి కలెక్టర్ గా సైతం..

– సెలవులో వెళ్లిన కలెక్టర్ ఎం హరిత

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్లగా, ఇంచార్జి కలెక్టర్ గా సైతం గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి….

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ.సజ్జత్ భాషా, ఈ.ఈ.లక్ష్మీనారాయణ, ఎ.ఈ.ఈ.అనూష,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దసరాకు.. ముక్కా, సుక్కా.. లేనట్లే..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T114708.207.wav?_=1

 

దసరాకు.. ముక్కా, సుక్కా.. లేనట్లే..!

గాంధీ జయంతి నాడే దసరా పండుగ

◆:-/అందుకే మద్యం, మాంసం అమ్మకాలు బంద్?

◆:- అక్టోబర్ 2న వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ

◆:- లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం

◆:- గతేడాది దసరా నాడే 3లక్షల కేసులకు పైగా బీర్లు సేల్

◆:- మద్యం అమ్మకాల ద్వారా 11రోజుల్లో రూ.1285.16 కోట్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణాలో పండుగ, పబ్బం, ఇంట్లో ఫంక్షన్.. బంతి ఏదైనా మాంసం, మందు లేనిదే కిక్కు ఉండదు. ఆద్ ఓ అనవాయితీగా వస్తుంది. ఇక దసరా అంటే సాధా రణంగా ఒక కిక్కు. ఏ పండగకి లేనంతగా దసరా పండుగకు అంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క ముక్క ఉండాల్సిందే. అంతేకాకుండా పల్లె పట్టణం లేకుండా మద్యం ఏరులై పారుతోంది. కుటుంబ సభ్యులంతా మద్యం మత్తును గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. మద్యంతోపాటు మటన్, చికెన్, ఫిష్. ఫ్రాన్స్ ఉండాల్సందే. అయితే ఈసారి దసరాకు ముక్క చుక్కపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే రోజు గాంధీ జయంతి.. దసరా…

అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నాడే దసరా పండగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం అనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలా మందికి చుక్క లేనిదే.. ముద్ద తిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై అధి కారులు తర్జన భర్జన పడుతున్నారు. అక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించాలా..? మినహాయింపు ఇవ్వాలా..? అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు..

గతేడాది దసరా కిక్కుకు 1285 కోట్లు…

 

 

దసరా పండక్కి గతే ఏడాది రాష్ట్ర ఖజానకు రూ.1285 కోట్లు వచ్చి చేరాయి. దసరా వేడుకలను పురస్కరించుకొని గత సంవత్సరం అక్టోబర్ | నుంచి 14 వరకూ.. 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు రూ. 1285.16 కోట్లు వచ్చాయి. వీటిల్లో ఈ 11,03,614 కేసుల లిక్కర్ సీసాలు… 20.63,350 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పండుగ రోజు అంటే 11వ తేదీన అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,06,761 కేసుల బీర్లను కొనుగోలు చేశారు. ఏ గల్లీలోని కిరాణా కొట్టులో చూసినా లిక్కర్ బాటిళ్లు, బీరు సీసాలే దర్శనమిచ్చాయి. వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు బారులుతీరి పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేశారు. అయితే అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్లు ఎక్సెజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడవచ్చు. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదు.

మాంసానికి మస్తు గిరాకీ….

 

 

దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే.. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేక పోతులను కోసి వాటాలు వేయాల్సిందే. నాటు కోళ్లు, ఫారం కోళ్లు, చేపలు, రొయ్యలకు సైతం మస్తు గిరాకీ ఉంటోంది. ఇలా ప్రచేస్తున్నార
పండుగ జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాల లోని వ్యాపారస్తులు, దుకాణాదారులు, పెద్ద పెద్ద వాహనాల యాజమానులు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు, పరిశ్రమలు వాహనాల ముందు మేక పోతులు, గొర్రె పోతులు బలి ఇవ్వడం అనవాయితీ, ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. అయితే దసరా ఒక వేల మాంసం దుకాణాలను మూసివేసినట్లయితే ముక్కపై తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు,

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T155542.794.wav?_=2

 

*ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

*టిడిఆర్ బాండ్లు అర్హులైన వారికి ఇస్తున్నాం..

*గ్రామాలనుంచి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలి..

*శెట్టిపల్లి భూముల సమస్య త్వరలో పరిస్కారం…

*ఆదాయం పెంపుదలకు కొత్త లే అవుట్స్ ఏర్పాటు..

*పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..

తిరుపతి(నేటిధాత్రి)ఆగస్టు 25 :

 

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
సోమవారం ఉదయం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారుతుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వి.సి., జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. టౌన్ షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్ లను వినియోగించాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్, ఈ.ఈ.లు రవీంద్ర,తులసి కుమార్, గోమతి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం.

ఉదృతమైన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం

ఆగస్టు 12 విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డా. ఆర్. పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ చేయాలని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు దీనిలో భాగంగా జేఏసీ బందుకు పిలుపునివ్వడం జరిగినది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందున మరింత ఉదృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని జేఏసీ భావించింది దానిలో భాగంగా ఈనెల ఆగస్టు 12వ తేదీ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు ఇచ్చే ప్రతీ పిలుపును ప్రజల పిలుపుగా భావించి రెవెన్యూ డివిజన్ సాధన కోసం జరిగే జేఏసీలో ప్రజలు భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్షను నెరవేర్చడం చేర్యాలకు పూర్వ వైభవాన్ని సాధించి రానున్న భవిష్యత్తు తరాలకు చేర్యాల ప్రాంతం యొక్క ఔన్నత్యం సామాజిక, రాజకీయ నేపథ్యం పరిపాలన యొక్క గొప్పతనాన్ని రేపటి తరాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ మనసారా ఆస్వాదించడానికి మాత్రమే ఆగస్టు12న విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. కావున నాలుగు మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కు ఉపాధ్యాయులు, యజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును ప్రజల పిలుపుగా భావించి అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందె అశోక్, అందె బీరయ్య, బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, కత్తుల భాస్కర్ రెడ్డి, జంగిలి యాదగిరి, పోలోజు వెంకటాద్రి, పొన్నబోయిన మమత, కుడిక్యాల బాలమోహన్, వలబోజు నర్సింహ చారి, పెండ్యాల రాజు, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, కవ్వం నారాయణ రెడ్డి, గడిపే రవి, కర్రె నర్సిరెడ్డి, పీ. శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం

రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ డివిజన్ కోసం ఉదృతమైన పోరాటాలు..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఉదృతమైన పోరాటాలు

జేఏసీ ఆధ్వర్యంలో అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం. ర్యాలీ.

జేఏసీ చైర్మన్ వకళాభరణం నరసయ్య పంతులు

చేర్యాల నేటిదాత్రి

JAC Chairman Vakalabharanam Narasaiah Pantulu

చేర్యాల మద్దూరు దుల్పిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అయినను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కొత్తగా వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అయినను కాలయాపన చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వకలాభరణం నరసయ్య పంతులు దుయ్యబట్టారు ఈ సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం ర్యాలీ నిర్వహించి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వానికి ప్రజలతో కలిసి నిర్వహించారు జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల ఆకాంక్షను గుర్తించాలని లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

JAC Chairman Vakalabharanam Narasaiah Pantulu

ఈ కార్యక్రమంలో బిజెపి బీఆర్ఎస్ సిపిఎం కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు

రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన.

— రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మెరకు నిజాంపేట లో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల సమస్యల పరిశీలన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సమస్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

కవేలి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

కవేలి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని కవేలి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతి సదస్సును గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల రెవెన్యూ అధికారులు గిర్దావరి అశ్విని కుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి భూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాలు సేకరించారని అన్నారు. మొత్తం 40 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు.

భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న.

భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

shine junior college

 

రైతుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నచిన్నకారు రైతులను ద్రృష్టిలో ఉంచుకొని,రైతులకు హక్కులు కల్పించాలనే ఉధ్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు నూతన భూ భారతి చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు.తరాలుగా సాగు చేసుకుంటూ పట్టాలు లేని రైతులందరికి ప్రజా ప్రభుత్వం సమగ్రంగా సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వబోతుందని,గత ప్రభుత్వ హయంలో రైతులందరికి సబ్సిడిలను ఇవ్వకుండా మోసం చేసిందని,ప్రజా ప్రభుత్వం రైతుల మేలుతో పాటు ప్రతి రైతు శ్రేయస్సు కు కృషి చేస్తుందని ప్రజల కోసం పరితపించే ప్రజా ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి,రెవెన్యూ సిబ్బంది,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీనాయకులు,కార్యకర్తలు,స్ధానిక రైతులు తదితరులు పాల్గోన్నారు.

మాదారంలో భూభారతి రేవన్యూ సదస్సు.

మాదారంలో భూభారతి రేవన్యూ సదస్సు

భూ సమస్యలపరిష్కారం కోసమే భూభారతి

ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి

 

shine junior college

పట్టణంలోని మాదారం కాలనిలో ఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూ భారతి రేవన్యూ సదస్సు ను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుమన్ కుమార్,ఎంఆర్ఐ దామోదర్, సర్వేయర్ విజయకుమార్ మరియు రేవన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ రజిత

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను పరిశీలించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం భూమి ఎక్కువ తక్కువ ఉన్న, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న

భూ సమస్యలు, సర్వే నంబర్ లేకపోవడం, పట్టా పాస్ బుక్ లు లేకపోవడం, ఒక్కరి భూమి మరొకరి మీద పట్టాకు ఎక్కినటువంటి సర్వే నంబర్లను సరిచేసి పాత రికార్డు ప్రకారం పరిశీలించి సరి చేయడం సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో టి టిపి సి సి నెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, ఇల్లంతకుంట టెంపుల్ ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, యూత్ నాయకులు హరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, బండి మహేష్, అనిల్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం

వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్.

వరంగల్ నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం భూమి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.

వరంగల్ మండల తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలు భూ సమస్యల మీద కార్యాలయాల చుట్టు తిరుగుతున్న క్రమంలో అధికారులు ఒక్కోసారి అందుబాటులో లేకపోవడం వాళ్ళు వెనుక తిరగడం జరిగేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న భూభారతి చట్టం ద్వారా సమస్యలు ఉన్నచోటకే అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించడం సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొనగా బాధితులు దరఖాస్తులు సమర్పించుకున్నారు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు

తహసీల్దార్ శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు.

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొచ్చారు. సత్వరమే భూ సమస్యలకు కృషి చేస్తామని తహశీల్దార్ జయరామ్ నాయక్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ సత్యనారాయణ స్వామి

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని  తాసిల్దార్ సత్యనారాయణ స్వామి పేర్కొన్నారు సోమవారం  మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గోన్నారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ  చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో   ఎం ఆర్ ఐ దేవేందర్ సర్వేయర్ నిరంజన్. సిబ్బంది గుడాల తిరుపతి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి రేవన్యూ సదస్సు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి

 

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.

సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

MRO Vijayalakshmi.

 

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి గ్రామంలో తాసిల్దార్ శ్రీనివాస్ భూభారతి రెవెన్యూ అవగాహన న సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3 నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహిస్తా ప్రజలు తమ భూమికి సంబంధించిన దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ప్రతి దరఖాస్తుదారుడు లెక్క పక్కగా ఉండేటందుకు రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తాం అని వారు అన్నారు నేరేడుపల్లి గ్రామంలో మొత్తం 363 దరఖాస్తులు వచ్చాయి వాటిని పరీక్షిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రామస్వామి ఏఎస్ ఓ విజయ్ కుమార్ టైపిస్ట్ రాజు రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

 

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతులు భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సదస్సు ఫారంలో వివరాలు పొందుపరిచి తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని భూముల సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంలో వివరాలు నిశితంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version