డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి…

డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి

ఫీజులు తగ్గించకపోతే ఆందోళన చేపడుతాం

పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

కేయూ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం,ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని మోపింది అని అన్నారు.ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 రూపాయలకు పెంచారు. రికగ్నేషన్ ఫీజు గతంలో 400 ఉండగా ఇప్పుడు 800 కు
ఐ యు డి ఎఫ్ ఫీజు గతంలో 60 ఉండగా ఇప్పుడు 300 కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో 50 ఉండగా ఇప్పుడు 200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర భారాన్ని మోపారు.ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారు.గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద 1340 చెల్లించేవారు.ఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి 3,250 కి పెంపుదల చేశారు.గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుంది.ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఏమాత్రం కట్టలేనటువంటి ఫీజుల భారాన్ని విద్యార్థులపై ప్రభుత్వం మోపడం సరికాదని తక్షణమే ప్రభుత్వం పున:ర ఆలోచించి ఫీజుల భారం తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వంశీ,మనోహర్ పాల్గొన్నారు.

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి….

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామానికి వెళ్లే రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని కోరుతూ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్, సోమవారం అదనపు కలెక్టర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజులు బకాయిలను విడుదల చేయాలని మంచిర్యాల కలెక్టర్ కి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి అరకొర నిధులు విడుదల చేయడంతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల నుండి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలల నిర్వాహకులు కూడా బడ్జెట్ రాక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసే పరిస్థితి నెలకొంటుంది.అంతేకాకుండా బడ్జెట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కే.కార్తీక్ పాల్గొన్నారు.

గిరిజన బాలికల హాస్టల్‌కు కొత్త భవనం డిమాండ్.

చర్ల ట్రైబల్ వెల్ఫర్ గర్ల్స్ ఎస్టీ హాస్టల్ కు నూతన భవనం మంజూరు చేయాలి

పివైఎల్ భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలవస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలి ప్రస్తుతం అద్దేభవనం ఏర్పాటుచేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పి వై ఎల్ ప్రగతిల యువజన సంఘం ఆద్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది
అనంతరం పిడిఎస్ యు మండల నాయకురాలు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ 130 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారని ఈ భవనం నుంచే స్కూలు కు వెళ్లి చదువుకుంటున్నారని అలాంటి భవనం శిథిలవస్తులో ఉన్నదని వర్షాలు తీవ్రతరం కావడంతోటి గోడలు మొత్తం నాని కురుస్తున్నాయని పెచ్చలు ఊడిపోయి మీద పడుతున్నాయని ఆయన అన్నారు బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందని విద్యార్థినిలు భయాందోళనలో ఉన్నారని ఈ బిల్డింగు శిథిలావస్థకు వచ్చిందని అధికారులకు తెలిపీనా పట్టించుకోని పరిస్థితుల్లో వాళ్ళు లేరని బాత్రూములు కూడా సరిపోను లేవని తక్షణమే నూతన బిల్డింగును ఏర్పాటు చేయాలని కోరారు ఈ బిల్డింగ్లో విద్యార్థినిలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే ఆ ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అప్పటివరకు తాత్కాలిక హాస్టల్ నీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం.

వనపర్తి,నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో శుక్రవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు సి ఎం ఆర్ కాలేజీ యజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో విద్యార్థినిలను వేధించినందుకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన పేర్కొన్నారు. వెంటనే సీఎంఆర్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అనుమతి ఉన్నదా? అని పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ ను ప్రశ్నించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version