కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే
భూపాలపల్లి నేటిధాత్రి
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని టీయూడబ్ల్యూజే హెచ్ 143 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 239 జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయబద్ధంగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 252 జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు, నియోజకవర్గ జర్నలిస్టులకు అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా వెంటనే 252 జీవో ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబాల సంపత్, శేఖర్ నాని, బండ మోహన్, తిక్క ప్రవీణ్, విజయ్ ,రడపాక రమేష్, జగన్,రాజశేఖర్,దేవేందర్,మహేందర్,నరేందర్, మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.a
