ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే మట్టిదందా…

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే మట్టిదందా

దందాల్లో ఎమ్మెల్యే,అధికారులు,కాంగ్రెస్ నాయకులు

పీసా చట్టం తూట్లుపొడిచి అక్రమ దందాలు..

అక్రమ మట్టి దందాపై హైకోర్టులో పిల్ దాఖలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయల మట్టి దందా చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఈ అక్రమ దందా పట్ల బిఆర్ఎస్ లీగల్ శాఖ ఆధ్వర్యంలో హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,పోలీస్ ,రెవిన్యూ,మున్సిపాలిటీ,ఇరిగేషన్,మైనింగ్,ఐటిడిఎ అధికారులు కలిసి చేసిన మట్టి దందా యొక్క అన్ని ఆధారాలను శాటిలైట్ ద్వారా బిఆర్ఎస్ పార్టీ సేకరించిందన్నారు.నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అక్రమ దందాలపై ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతోనే పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారుల సహకారంతో మైనింగ్ మోరం దందా విచ్చలవిడిగా పెట్రెగిపోతున్నదని దీంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నర్సంపేట మండలం రాజుపేట ఏజెన్సీ శివారు ముత్యాలమ్మ తండా గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసా చట్టాన్ని తుంగలో తొక్కి మట్టిదందాతో సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మున్సిపాలిటీ అధికారులు, మైనింగ్ అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఈ దందాలో వాటాలుండడంతో
రాత్రంతా ఇతర ప్రాంతాలకు వందలాడి టిప్పర్ల మోరం తరలిస్తూ దందా సాగిస్తున్నారని ఆరోపించారు.దామెర చెరువులో లోతుగా మట్టితవ్వడం వల్ల ఊటలు వచ్చి భవిష్యత్తులో మెడికల్ కళాశాలకు ప్రమాదం ఏర్పడనున్నదని దీంతో ఎన్ఐఏ అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకునే నాధుడే లేడన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ ఎంపీపీ తక్కల్లపెల్లి రవీందర్ రావు,జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి,లెక్కల విద్యాసాగర్ రెడ్డి,పార్టీ పట్టణ అధ్యక్షులు నాగెళ్లి వెంకటనారాయణ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, దేవోజు సదనందం,గోనె యువరాజు,క్లస్టర్ బాధ్యులు, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..*

*నర్సంపేటను అభివృద్ధి చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి

నియోజకవర్గలో విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ నాయకులు

విద్య ,వైద్య,సాగు,త్రాగు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నర్సంపేట నియోజకవర్గలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని టిఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ, మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆసాధనకై అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధినీ ఆకాంక్షించే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఖబర్దార్ అంటే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో తెలపాలన్నారు.పాకాల సరస్సు, రంగయచెరువు, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల నాటి కలను సహకారం చేసిన జలసాధకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధికై రూ. 42 కోట్ల టియుఎఫ్ఐయు డబ్ల్యూ నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికై పట్టం కట్టారని తెలిపారు.నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని విద్యా,వైద్య హబ్ గా తీర్చిదిద్దిన ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొరియాడారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ పనులు,9 కిలోమీటర్ల మేర అంతర్గత బిటి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.నర్సంపేట పట్టణానికి పాకాల ఆడిటోరియం,మోడల్ వెజిటేబుల్ మార్కెట్,మినీ స్టేడియం,పట్టణ పకృతి వనం,పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మించారని తెలిపారు.
ఖానాపురం మండలంలో గల అశోక్ నగర్ గ్రామానికి సైనిక్ స్కూల్ తెచ్చిన ఘనత పెద్దిదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి నయా పైసా కూడా తీసుకురాని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు.శాసనసభ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే తరిమి కొడతారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్,పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశెట్టి ప్రసాద్,దేవోజు సదానందం,రాయిడి దుష్యంత్ రెడ్డి, పెండం వెంకటేశ్వర్లు, పుల్లూరు స్వామి,వార్డు అధ్యక్షులు రావుల సతీష్,బీరం నాగిరెడ్డి,సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పల సుదర్శన్,రాంప్రసాద్,కడారి కుమారస్వామి, మద్దెల సాంబయ్య,మంద ప్రసాద్, ఆంబోతు రాజు,తోటకూరి సదానందం, గిరగాని సాంబయ్య, పైసా ప్రవీణ్,ముచిక రాజు,బుస రాజు ,చేరాల గోవర్ధన్, గోనెల కరుణాకర్, మాదాసి శ్రీనివాస్, మాదాసి ప్రవీణ్, దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 4, 5, 6,7 తేదీలలో నిర్వహించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి,శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహారాజ్ బోనాల పండుగ,కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాని గౌడ సంఘం కమిటీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,సంఘం పెద్దలు సారయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్ ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి శ్రీను గౌడ్, గాధగోని సాంబయ్య గౌడ్, బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్,గండు లింగయ్య గౌడ్ ,గౌడ పెద్దలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version