దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి…

దేవాదుల పథకం ప్యాకేజ్-5 కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలి

రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయ్

తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్-5 ఎల్ఎంసి డిసి-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈర్లపైడి మాట్లాడుతూ, నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కి.మీ మేర కెనాల్ నిర్మాణం చేపట్టి దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో కెనాల్ పూర్తికాక సాగునీరు అందక ఈ సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందలేదని పేర్కొన్నారు.రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వేసవిలోనే పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.

మండుతున్న ఎండలు…. మండుతున్న మంటలు…

మండుతున్న ఎండలు…. మండుతున్న మంటలు..

◆”-: మార్చిలోనే పెరిగిన తీవ్రత

◆”-: 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

◆”-: కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు

◆”-: పరీక్షల కాలంలో సతమతమవుతున్న విద్యార్థులు

◆”-: 12 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

◆”-: జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఫిబ్రవరి వరకు చలి తీవ్రతకు గజగజలాడిన జనం ఇప్పుడు భగ భగ మండే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఇప్పుడు మరింతగా ఎండల ప్రభావం పెరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉద యం నుండే భగ..భగమంటూ వస్తున్న ఎండలను చూసి ప్రజలు జంకుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత రికార్డు స్థాయికి ఎండలు చేరుకునే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు.

ఎండల తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతుం ది. గతం కంటే మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం మార్చి నెలలోనే ఉన్నా ఎండల వేడి మండిపోతుంది. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుం డా రోజంతా భానుడి ప్రతాపం భగ భగమంటున్నది. పెరిగిపోతున్న ఎండలకు వృద్ధులు, చిన్నారు లు ఎక్కువగా విలవిలలాడుతున్నారు. ఒక్కసారిగా ఎండవేడిమి పెరిగిపోవడంతో ఉక్కపోతలు ప్రజలకు గుక్క తిప్పనీయడం లేదు. జిల్లాలో మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే నెలలో వారం రోజుల ఎం డలను పరిశీలిస్తే..ఉష్ణోగ్రతల తీవ్రత తెలిసిపోతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు కరెంట్‌ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక గ్రామాల్లోనూ కరెంట్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి…

ఉదయం నుంచే ఎండ వేడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయలను అనుసరిస్తున్నారు. టోపీలు, హెల్మెట్‌లు, మాస్క్‌లు, రుమా ళ్లు ధరించి జనం ఉపశమనం పొందుతున్నారు. రోడ్ల పక్కల నీడనిచ్చే చెట్లు కనిపిస్తే చాలు సేదతీరుతున్నారు. కొత్త కుండలను తీసుకొని చల్లని నీటితో ఉపశమనం పొందుతున్నారు. ఎండలు పెరుగుతున్నందునా కొత్త కుండల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, పశు పక్షాదుల పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో ఉండే కోతులు ఎక్కడ నీరు కనిపించినా వాటిలో దూకడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే పశువులు కూడా ఆయా గ్రామాల చెరువుల్లో ఎండలకు తాళలేక సేద తీరుతున్నాయన్న అభిప్రాయం ఉంది.

పరీక్షల కాలంలో..

 

ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య పరీక్ష నిర్వహణ ఉంటుంది. విద్యార్థులంతా ఇతర ప్రాంతాల నుంచి సెంటర్లకు వచ్చి వెళ్త్తూ ఉంటారు. బస్సులు, ఆటోలు, మోటర్‌ సైకిళ్లపై ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఇలా ఎండలు పెరగడం వల్ల విద్యార్థులు సహితం ఇబ్బందులకు గురవుతున్నారు.

జాగ్రత్తలు అవసరం..

ఎండల తీవ్రతను బట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎండలకు ఇబ్బందులు పడకుండా ఉండాలం టే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. పిల్లలు ఎక్కవ సమయం ఎండలో ఆడకూడదు. ఎండలోఎక్కువ తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడం శ్రేయస్కరం. ఎక్కువ నీరు తాగడం.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడంలాంటివి చేయాలి. జీన్స్‌లాం టి దుస్తులకు దూరంగా ఉండి…తేలికైన వస్ర్తాలను ధరించడంవల్ల ఉపశమనం లభిస్తుంది. రోజు రెండు, మూడుసార్లు చల్లనీళ్లతో స్నానం చేయించడం పిల్లలకు మరింత శ్రేయస్కరంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మండే ఎండలతో పాటు కలుషిత నీరు, పరిశుభ్రత లోపం కారణంగా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య ఏరియా ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ సూచిస్తున్నారు. “విశాల తెలంగాణ” తో మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

“ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య”

అందని నీరు… ఆందోళనలో రైతులు చివరికి నీళ్లందేనా!

అందని నీరు… ఆందోళనలో రైతులు

చివరికి నీళ్లందేనా!

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లు వస్తున్నాయి చాలా చోట్ల పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది మండలంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో భూగర్భ జల మట్టం వేగంగా అడుగంటగా చివరి ఆయకట్టుకు కాలువ నీరు అందకపోవడంతో చివరి దశకు వస్తున్న పైరు నిలు వుగా ఎండిపోతున్నాయి మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండగా పంటలు పూర్తిగా ఏప్రిల్ , మే మాసం వరకు పరిస్థితి విషమించి పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు

తక్షణ చర్యలు అవసరం

శాయంపేట మండల కేంద్రంలోని రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోకపోతే రైతుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉన్నది. కావున ఎస్సారెస్పీ నీరు అందక రైతులు నిరాశ చెందుతున్నారు ఎస్సారెస్పీ నుండి చిన్న ఉప కాలువ వరకు నీరు అందించాలని అధికారులు నిర్ణయిం చిన ఏప్రిల్ వరకు నీటి తడులకు పోడిగింపు చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చూడా లని కాలువలకు అధిక మొ త్తంలో నీటిఅవసరం ఉన్న పంట భూములకు,గొలుసు పట్టు చెరువులు కుంటల్లోకి నీటిని జలాల స్థిరంగా కొనసాగిస్తేనే పంటలను కాపాడుకోవచ్చు.

జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగించాలి

జాతీయ రహదారి ఓగు లాపూర్ నూతన బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయి. శాయంపేట, మైలారం, ఆరేపల్లి ,పత్తిపాక రైతుల పంటలు చివరి దశలో ఉన్నాయి కాబట్టి నీళ్లు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహానికి చెత్తాచెదారం తట్టుకుని నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న రైతన్నలు సొంతంగా చెత్త తీసివేయడం జరిగింది అయినా కూడా నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు స్పందించి వెంటనే ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్…

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, 30వ వార్డు, 6వ వార్డుల కౌన్సిలర్లు బాణాల ప్రసన్న-శ్రీనివాస్, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 22వ వార్డు, 30వ వార్డు తోపాటు 6వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎండాకాలంలో నీటి కొరత రాకుండా అవసరమైన దగ్గర బోర్లు వేయించడం జరుగుతుందని, అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి పారిశుధ్య సమస్య లేకుండా నిరంతరం వార్డులలో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతోటి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరలో చేయబట్టబోతున్నామని, అదేవిధంగా వార్డులకు అవసరమైన పనులను ముందుండి చేయించి వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, వార్డు ఆఫీసర్స్ చకిలం నాగరాజు, గుగులోతు శ్రీకాంత్, వేమా సూర్యనారాయణ, మున్సిపల్ జవాన్ డేగల కుమార్, బోడ మొగిలి, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ గంట రామిరెడ్డి, వాటెన్ సెక్షన్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, వాటర్ లైన్మెన్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్, కోల వెంకటేశ్వర్లు, మైబు పాషా, కొప్పు అశోక్, పోతిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం శ్రీనివాస్, ధోని చేరాలు, కుచన రాజు, కొప్పు రాజు, పోగుల ప్రభుదాస్, బాణాల రమేష్, తాండ్ర అశోక్, మడికొండ రంజిత్, బోడ సునీల్, అనపర్తి సతీష్, గడ్డం ప్రవీణ్, అగరపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి..

మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి

నల్లా నీళ్లు రావడం లేదంటూ బిందెలతో కాలనీవాసుల ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో తీవ్ర మంచినీటి సంక్షోభం నెలకొంది.గత కొంతకాలంగా కాలనీలో నల్లా నీళ్లు కూడా సరిగా రావడం లేదని,తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా 1 వ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో వార్డులో గత కొన్ని నెలలుగా నీటి సమస్యలు వస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపట్టిన మహిళలు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మౌలిక వసతులైన తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల సురేష్, దంచనాదుల సతీష్,ఎండి అఫ్జల్ పాషా, భూక్య మంజుల, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య సునీత, నల్లబెల్లి మంజుల,
ఎండీ గుడియా బేగం,ఎండీ కౌసర్, ఎం.ఈ హసీనా, ఎం.ఈ జరినా, ఎం.ఈ సజియా, ఎండీ నూర్,
శ్రీపెల్లి రమ, మల్యాల నాగలక్ష్మి, జాటోత్ విజయ, లవూడియా విజయ తదితరులు పాల్గొన్నారు.

విజయం దిశగా మోర నిర్మల ప్రచారం…

విజయం దిశగా మోర నిర్మల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ సర్పంచిగా మోర నిర్మల ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మోర నిర్మల మాట్లాడుతూ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతోగెలిపించగలరని పేరుపేరునా.అభ్యర్థిస్తున్నాను గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి. గ్రామ అభివృద్ధిలో ముందు ఉండి నడిపిస్తానని.నాకున్న.25. సంవత్సరాల రాజకీయ జీవితంలో రెండు పర్యాయాలు వార్డ్.మెంబర్గా గ్రామాన్ని అభివృద్ధిపరుస్తూ వచ్చానని గ్రామంలో నీటి కొరత ఉన్నప్పటికీ మంచినీటి అవసరాల కోసం నేను వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో. మాట్లాడి గ్రామ అభివృద్ధి కొరకు త్రాగునీటి అవసరాల గురించి.తన ప్రత్యేక నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని ఆ నిధులతో వాటర్ ట్యాంక్ ను నిర్మించి ప్రజల దాహార్తి తీర్చానని అదేవిధంగా మురికి కాలువలు సిసి రోడ్లు నిర్మాణం చేయించడం జరగడంతో పాటు మంచినీటి సౌకర్యాల కోసం ప్రజలకుపద్మనగర్ గ్రామంలో దాదాపు నాలుగు బోర్లను అప్పటి కాలంలో నేను వార్డ్ మెంబర్ గా ఉన్న సమయంలో వేయించడం జరిగిందని అప్పుడు గ్రామ అభివృద్ధిలో నా వంతుగా ప్రజలకు.అవసరదృష్టవారీ కష్టసుఖాలలోఒకరిగా పాలుపంచుకున్నానని. ప్రజలందరిలోమమేకమైగ్రామ ప్రజలకు.ఏఅవసరంవచ్చిన ముందుండి.పనులుచేశాననీ ఎక్కడో జరిగిన అభివృద్ధి చూడడం కాదు మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాట ఇస్తున్నానని మన గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నానని అలాగే గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని. మన గ్రామ అభివృద్ధి కోసం మిగిలి ఉన్న సిసి రోడ్ల నిర్మాణం మురికి కాలువల నిర్మాణం అతి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తానని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ చేనేత పెన్షన్ వృద్యాప వింతతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయిస్తానని నా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాగ్రామనలు.వీదుల సిసి కెమెరాలు పెట్టి పద్మా నగర్ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుఉంచుతానని.కావున నేడు జరుగుతున్న సర్పంచి ఎన్నికలలో మన గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజలందరూ గుర్తుంచుకొని బ్యాట్ గుర్తు బ్యాలెట్ నెంబర్ మూడు లోని బ్యాట్ నెంబర్ పై గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరనీ.పద్మనగర్ గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీ అమూల్యమైన ఓటును బ్యాటుగుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతోగెలిపించగలరని పేరుపేరునా పాదాభివందనాలు చేస్తున్నాను అని నన్ను ఆశీర్వదించగలరని తంగళ్ళపల్లిపద్మనగర్.గ్రామ ప్రజలకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను ఈ సందర్భంగా గ్రామంలో ప్రచారం చేస్తూ వాడవాడలా గడపగడప ఓటును అభ్యర్థించారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు మద్దతు దారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మైసమ్మ చెరువు జీవదారులు బంద్..! చెరువు నిండేది ఎలా..?

మైసమ్మ చెరువు జీవదారులు బంద్..! చెరువు నిండేది ఎలా..?

◆:- ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు కాల్వలను కబ్జా చేయడం.

◆:- అక్రమ మళ్లింపుపై విచారణ జరపాలని డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని పైడిగుమ్మాల్ పరిధిలో గల మైసమ్మ చెరువు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువుల నీరు పూర్తిగా నిండకపోవడం వల్ల స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాలు చక్కగా పడుతున్నా చెరువుల నీరు నిలవకపోవడం పలు అనుమా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీల వల్ల చెరువులోనికి నీరు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం వల్ల చెరువు నిండ లేక పోతుంది. చెరువు యొక్క జీవదారులు అడ్డుకట్ట వేయడానికి బలమైన నేతల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.
గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, చెరువులో నిల్వ కావలసిన నీరు ఎక్కడికో మాయమవుతోంది. దీని వల్ల భవిష్యత్‌లో త్రాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ఈ ఘటనపై తెలంగాణ గ్రాడ్యుయేషన్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చెల్మెడ అనిల్ కుమార్ మాట్లాడుతూ..ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేయడాన్ని సహించేది లేదని వెంటనే విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి,అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు..

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు.. అధికారులు నిర్లక్ష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల గిన్నియర్ పల్లి గ్రామంలో వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి కొరత నెలకొంది. బోర్లు పనిచేయకపోయినా, భగీరథ నీటి సరఫరా నెలలో కనీసం రెండుసార్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులే కారణమని అధికారులు చెబుతున్నారని, సమస్యపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

తాగునీటి సమస్యను పరిష్కరించండి

తాగునీటి సమస్యను పరిష్కరించండి
మహాదేవపూర్ ఆగస్టు13(నేటి ధాత్రి

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామంకుదురుపల్లి గ్రామపంచాయతీ కి
గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలు మంగళవారం గ్రామంలోని గ్రామ కార్యదర్శికి నీటిసమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించిచారు మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ని పాత గూడెంలో గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గతంలో అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని త్రాగునీటికి సంబంధించి తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదని వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధులు వచ్చి అవకాశాలు ఉన్నాయని తాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రత్నం నాగరాజు గోగులబాపు రాజయ్య లక్ష్మి పద్మ లచ్చయ్య సడవలి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version