భక్తుల సౌకర్యాలపై అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలన…

భక్తుల సౌకర్యాలపై అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలన
నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరం జాతర ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. దేవాలయ ఆవరణలో చేపట్టాల్సిన వివిధ పనులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్‌.ఐ. శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కిషోర్, దేవాలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, సిబ్బంది కిరణ్ కుమార్ పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు.

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం..

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

 వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీశైలం మల్లన్నను (Srisailam Temple) దర్శించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు 100 మంది చెంచు గిరిజనులు మల్లికార్జునస్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు.

ఈవో నియామకం.. మంత్రి కొండా సురేఖ కార్యాలయం వివరణ

ఈవో నియామకం.. మంత్రి కొండా సురేఖ కార్యాలయం వివరణ

 

వేములవాడలోని దేవాలయం ఈవో నియామకంపై వార్త పత్రికల్లో విభిన్న కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది.

హైదరాబాద్, ఆగస్టు 31: వేములవాడ ఈవోగా రమాదేవిని ఎటువంటి ఒత్తిడులు కానీ, ఎవరి అభిష్టం మేరకు కానీ నియమించ లేదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కార్యాలయం స్పష్టం చేసింది. వేములవాడ ఈవో నియామకంపై వస్తున్న వార్త కథనాలపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం ఆదివారం వివరణ ఇచ్చింది. స‌ద‌రు ఈవో రమాదేవిని తొలుత‌ హౌసింగ్ డిపార్టుమెంటుకు పంపాల‌ని ఆదేశాలు రాగా.. సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఆమోదం తీసుకొని మ‌ళ్లీ ఎండోమెంట్ డిపార్టుమెంటులో ఆమెను కొన‌సాగించాలని మంత్రి కొండా సురేఖ నిర్ణయించారని పేర్కొంది. ఆ క్రమంలో వేముల‌వాడ ఈవోగా రమాదేవిని నియమిస్తూ.. ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని మంత్రి కొండా సురేఖ ఆదేశించారని చెప్పింది.

వేములవాడ ఈవోగా రమాదేవి నియామ‌కం ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామాయ్య‌ర్ అభిష్టం మేర‌కు జ‌రిగిందంటూ ఆగస్టు 31వ తేదీన ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది. కాగా ఈ అంశంలో ఎండోమెంట్ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్యార్ సొంత నిర్ణ‌యం ఏ మాత్రం లేద‌ని గుర్తించాల‌ని మీడియా మిత్రుల‌కు తెలంగాణ దేవాదాయ మంత్రి కొండ సురేఖ కార్యాలయం వివరణ ఇచ్చింది.

అదీకాక.. ఈ రోజు ఆంగ్ల పత్రికలో వెలువడిన కథనం.. కొంత మేర తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే విధంగా ఉందని అభిప్రాయపడుతూ.. దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ ప్రమేయం లేదని.. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతోనే ఈవోగా రామాదేవి నియామకం జరిగిందని మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం

ఐలోని మల్లన్న ఆలయ ఈవో గా కే సుధాకర్ నియామకం
ఇన్నాళ్లు ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు నిర్వర్తించిన అద్దంకి నాగేశ్వరరావు

నేటి ధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా కే.సుధాకర్ ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఇన్నాళ్లు అదనపు విధులు నిర్వహిస్తున్న అద్దంకి నాగేశ్వర్ రావుని అదనపు బాధ్యతల నుండి తొలగించి, కె.సుధాకర్ కి గురువారం అదనపు బాధ్యతలు శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీచేయనైనది. గ్రేడ్ – I కార్యనిర్వహణాధికారిగా నూతనంగా నియమితులైన కే సుధాకర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version