శ్రీరామ దళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్….

శ్రీరామ దళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్

నియామక పత్రాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

శ్రీరామ దళ్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్‌ను నియమించారు. ఈ నియామకాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి ప్రకటించారు.సంస్థ పట్ల నిబద్ధత, హిందూ ధర్మ పరిరక్షణలో ఆయన చూపించిన సేవలు, యువతలో జాతీయ భావజాలాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో శ్రీరామ దళ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కన్నబోయిన రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ అభివృద్ధి మరియు ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరామ దళ్ రాష్ట్ర ఖజానాధికారి మచ్చిక రవితేజ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొరటాల శ్రీనివాసరావు, భూసాని రమేష్, నాగరాజ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 152వ బూత్‌లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు రమేష్ పాండ్య, మడ్లపెల్లి క్రాంతి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కంబంపాటి పుల్లారావు, జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమైన భారతీయ జనతా పార్టీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.పంక్తిలో చివరి వ్యక్తికి తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, అటల్ బీహారి వాజపేయి, ఎల్.కే.అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం అయిందన్నారు. ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపే దిశగా పార్టీ పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కూనమళ్ళ పృథ్విరాజ్, పంజాల శ్రీరామ్, ఠాగూర్ శివంజన్ సింగ్, దామెర ఆకాష్, కనుక గణేష్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

హనుమాన్ భక్తులపై దుర్భాషలాట

క్షమాపణ చెప్పాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో..

నర్సంపేట,

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలదారులపై అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దుర్భాషలాడటం కలకలం రేపింది. మాలదారులు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం గ్రామానికి చెందిన హనుమాన్ భక్తులు మాల వేసుకుని హనుమాన్ గుడి దగ్గర ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రాల్లో స్థానికులు వాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెప్పులు, షూలు వేసుకుని తాము ఉండే ప్రాంతంలో నడవవద్దని భక్తులు చెప్పడంతో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు హనుమాన్ భక్తులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు మాలాదారులు ఆరోపిస్తున్నారు. తమను తిట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భక్తులు నర్సంపేట–వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనాలు ఇరు వైపులా నిలిచిపోయాయి.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భక్తులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. క్షమాపణ చెప్పాలని కోరగా నిరాకరించడంతో సంబంధిత ఇద్దరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

మద్దతు పలికిన శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు..

వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న హనుమాన్ భక్తులకు శ్రీ రామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి మద్దతు పలికారు.పవిత్రమైన హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై అసభ్యపదజాలంతో మాట్లాడిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హిందూ సాంప్రదాయాలు,భక్తుల మనోభావాలు దెబ్బతీసేవింగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమాన్ భక్తులకు బహిరంగంగా చెప్పాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version