ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు…

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులు తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు మరింత సేవ చేయాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేసి మానవతా సేవను చాటారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ —
ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా ప్రజల సేవకే తాము అంకితమని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీన్మార్ మల్లన్న గారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడపగడపకు పార్టీ నినాదాన్ని తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్‌పీకే సాగర్, జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, బండి సునీల్, సుంకరి సందీప్, జింకల శ్రీను, రొడ్డ శ్రీనివాస్, అనంతుల సంపత్ (బొట్టు), అశోక్, సంతోష్, రంజిత్, నవీన్, సమ్మయ్య, సాయి రాజేందర్, శ్రీధర్, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version