మున్సిపల్ అధికారుల చర్యలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు..

మున్సిపల్ అధికారుల చర్యలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఎంసిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు తమ జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణ సముదాయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నర్సంపేట మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నారని ఎంసిపిఐ(యు)నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి అవేదన వ్యక్తం చేశారు.ఆయా నియానాలను తొలగించడం అన్యాయమని వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేటలో చాలా ఏళ్లుగా నిరుపేదలు తమ చిరు వ్యాపారాలను చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వారి దుకాణ సముదాయాలు తొలగించి స్వాధీనం చేసుకున్న సామాగ్రిని మున్సిపల్ అధికారులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ దుకాణాల తొలగింపులు అధికార పార్టీ నాయకులకు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు.మున్సిపల్ అధికారులు స్పందించి వారికి తక్షణ ప్రత్యామ్నయం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం.

జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
జమ్మికుంట (నేటిధాత్రి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి 19వ వార్డులో 5 లక్షల రూపాయల సీసీ రోడ్డును దేశ్ ని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప్రారంభించారు సుంకరి రమేష్, ఎర్రం సతీష్ రెడ్డి,ఎలగందుల శ్రీహరి, పిట్టల రమేష్ ఉడత వెంకటేష్,సంకీస సురేష్,రాజ్ కుమార్,రామచంద్రం,శ్రీను ,ఆడపు రాజా నర్సు,ఎండి ఖాదిర్, ఎండి ఖాదీర్ ,రాజ కొంరయ్య,చక్రపాణి,, ఎండి ఇస్మాయిల్ ,జావిద్,ఉన్నారు

ప్రజావాణిలో ఫిర్యాదుకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు.

ప్రజావాణిలో ఫిర్యాదుకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు

పాత మంచిర్యాల పార్కులో పారిశుధ్య చర్యలు ప్రారంభం

మంచిర్యాల,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-30.wav?_=1

మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీలక్ష్మీ నగర్ లో ఉన్న పట్టణ ప్రకృతి వనం ( పార్క్ ) లో నగరపాలక సంస్థ సిబ్బంది శుక్రవారం పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.అందరికీ ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో రూ. 90 లక్షల వ్యయంతో శ్రీలక్ష్మినగర్ లో నిర్మించిన పార్క్ నిర్వహణ సరిగా లేదని, వాకింగ్ ట్రాక్ లో గడ్డి మొలచి, చెత్త పొగయిందని,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గత సోమవారం జరిగిన ప్రజావాణి లో పాత మంచిర్యాల కు చెందిన గోగు సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై పత్రికలో వార్తలు రావడంతో స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.పారిశుధ్య సిబ్బంది వాకింగ్ ట్రాక్ లో పెరిగిన గడ్డి తొలగించి శుభ్రం చేశారు.3 రోజుల్లో పారిశుధ్య చర్యలు పూర్తిచేస్తామని, మంచిర్యాల నగర పాలక సంస్థ పర్యావరణ అధికారి ప్రవీణ్ తెలిపారు.ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా వారం రోజుల కొకసారి ఈ పార్క్ లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం చేసే వారు కోరుతున్నారు.3 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ లో చెట్ల మధ్య ఖాళీ మైదానం లో పెరిగిన పిచ్చి గడ్డి మొక్కలు తొలగించి ఇసుక నింపి పిల్లలు ఆదుకోవడానికి వీలుగా ఆట పరికరాలతో ప్లేయింగ్ జోన్ తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు,అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-6-1.wav?_=2

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో హై స్కూల్ రోడ్డు రామాటాకీస్ దగ్గర మురికి కాలువ నిండిపోయినదని ఈ విషయం 15 వవార్డు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తీసుకుపోవడంతో ఆయన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి స్పందించి కార్మికులను పంపి మురికి కాలువ ను పూడిక తీయించారని మాజి కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ఈ మేరకు వార్డు ప్రజల తరఫున మున్సిపల్ అధికారులకు ఒక కృతజ్ఞతలు తెలిపారు

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో అందే విద్యాసాగర్ రాజేందర్ తండ్రి మృతి చెందాడు విషయం తెలుసుకొని 9వ రోజున కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ జాడి సరేష్ గజ్జ రాజకుమార్ భౌతు రాజేష్ భౌతు రమేష్ దుర్గం రాజా సమ్మయ్య బోడిక సంపత్ కాంగ్రెస్ యూత్ నాయకులు దుర్గం అనిల్ కటకం చందు బొద్దుల వినయ్ నరేష్ యాదవ్ సుమంత్ పటేల్ రేణిగుంట్ల రాజు బోడికల రాజు నరేష్ తిరుమల చారి పాల్గొన్నారు

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి .

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్ డిప్యూటీ తహసిల్దార్ తో సిపిఎం నాయకులతో ఫోన్లో మాట్లాడి 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు అప్పచెబుతామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆలోపు కచ్చితంగా ఇస్తామన్నా స్పష్టమైన హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మాట్లాడుతూ పేదలకు వచ్చిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఇంటి తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఏడవ తేదీ లోపు ఇళ్ళ తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే వెళ్లి ఇళ్లల్లో ఉంటారని, నివసిస్తారని అన్నారు. ఆ పరిస్థితి వరకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శ్రీనివాస్, శివకుమార్, యాదుల్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ అభినందనలు

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ అభినందనలు

◆ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ నియమితులైనందుకు స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అలీ అలీమ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ముహమ్మద్ కాలనీ ముహమ్మద్ సలీమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనను అభినందించారు మరియు జహీరాబాద్ కమిషనర్‌గా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మునిసిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ముహమ్మద్ సలీం సద్దాం హుస్సేన్ షేక్ ఖలీద్ పాషా అబూ యూసఫ్ రిజ్వాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన CITU నాయకులు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన సిఐటియు నాయకులు

శంకరపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

చేవెళ్ల నూతన మున్సిపల్ కమిషనర్ ని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నూతన కమిషనర్ ని కోరడం జరిగింది. కార్మికులకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తామని నూతన కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, సిఐటియు చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ముంజ గళ్ళ ప్రభుదాస్, చేవెళ్ల మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ జనార్ధన్ దస్తగిరి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు

మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కృషి.

15వ వార్డ్ మారెమ్మ కుంట దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర చెట్లు తొలగింపు

మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కృషి

వనపర్తి నెటిదాత్రి :
వనపర్తి పట్టణం 15 వ వార్డు మరెమ్మకుంట దగ్గర మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ట్రాన్స్ఫార్మర్లకు మురికి తుమ్మ చెట్లు ప్రమాదకరంగా ఉండడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జెసిబి పంపించారని ఆయన తెలిపారు ఈ మేరకు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖ అధికారులకు వార్డు ప్రజల తరఫున బండారు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఈకార్యక్రమంలో పాపిశెట్టి శ్రీనివాసులు మున్నూర్ సురేందర్ ముంత మన్యం శుషీల్ కుమార్ వార్డు ప్రజలు పాల్గొన్నారు

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం.

పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం.

మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు.

మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు.

ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో కొంత ఇస్తే కానీ వదిలి పెట్టరు.

కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాలకు “మేయర్ ప్రత్యేక అనుమతి” ఉంటేనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనులు?

కమీషనర్ లు వస్తున్నారు, పోతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలో బాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కరీంనగర్ నుండి బదిలీపై వచ్చి, శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ చాహాత్ బాజ్ పేయి. నూతన కమిషనర్ కి బల్దియాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. కమీషనర్ లు మారుతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

పెరుగుతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు

నగర ప్రజలు వారి సమస్యల పట్ల గ్రీవెన్స్ లో దరఖాస్తులు ఇస్తున్నారు, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు అలసత్వం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు నగర ప్రజలు.

“మున్సిపాలిటీ ముద్దులాట” లకు నోటీసులు?

ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న ఇద్దరు ఉద్యోగులకు “సిడిఎంఏ” నుండి నోటీసులు అందినట్లు సమాచారం. వారిపై వారం రోజులు గడిచిన ఎలాంటి చర్యలు లేవని, ఇద్దరిని వేర్వేరు కార్యాలయాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. తాము చేసిన తప్పుకు కొంచెం కూడా పశ్చాతాప్తం లేని “సదరు ఉద్యోగులు”? పైగా తాము చేసింది తప్పు కాదు అంటూ, తప్పును కప్పి పెడుతూ, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని రాజకీయ నాయకుల లాగా ఆరోపణలు చేయడం. మున్సిపల్ కార్యాలయంలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడానికి అదేం పార్క్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు. పబ్లిక్ కార్యాలయం అనేది గుర్తు పెట్టుకోవాలి సదరు ఉద్యోగులు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంది వీళ్ళ ప్రవర్తన. కొన్ని రోజులుగా వీళ్లు కార్యాలయంలో చేసే పనులు చూసి, విసిగి వేసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మారని తీరు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా లాగా మున్సిపల్ ఆఫీసులో “అన్నాచెల్లెళ్ల” బంధానికి కొత్త అర్థం చెబుతున్న కొందరు ఉద్యోగులు. గత శని, ఆదివారాలు సెలవు రోజులు లేకుంటే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రేమ జంటలపై ప్రత్యేక డిబేట్లు కూడా ఉండేవేమో. మీకేమి కాదు మేమున్నాం అంటూ ఓ అధికారి, కొందరు రిపోర్టర్లు అభయ హస్తం ఇచ్చినట్లు వినికిడి? నూతన కమిషనర్ ఈ అంశంపై చర్యలు తీసుకుంటారా లేదా అని కొందరు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేది తోటి ఉద్యోగుల వాదన.

థంబ్ ఎప్పుడైనా వేస్తాం మా ఇష్టం

 

 

New Municipal Commissioner.

 

 

 

 

మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 8 గంటల తరువాత స్టైల్ గా నిక్కర్ టీ షర్ట్ వేసుకుని రావడం మున్సిపల్ కార్యాలయంలో థంబ్ వేసి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అసలు ఎవరు వీళ్లు ఎక్కడ పని చేస్తున్నారు రాత్రి వేళ వచ్చి థంబ్ వేయడం ఏంటి.
మరి కొందరు మహిళా ఉద్యోగులు ఏకంగా కారులో వచ్చి, దర్జాగా సాయంత్రం 7 తరువాత థంబ్ వేయడం.
వీళ్లు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసే నాథుడే లేడు. పట్టించుకునే అధికారి పర్వాలేదు అంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి వృతి రీత్యా ఉదయాన్నే ప్రధాన కార్యాలయంకు వచ్చి హాజరు వేసి, కొందరు బయటకు వెళ్లి నగరంలో పనిచేస్తూ, సాయంత్రం ఆరు గంటల లోపు ఆఫీసుకు వచ్చి హాజరు వేసి ఇంటికి వెళ్ళడం మనం సామాన్యంగా చూస్తాం.. కానీ ఇక్కడ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం సహజం. సాయంత్రం వేళ థంబ్ వేయడానికి రాత్రి పది గంటలకు మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వేయడం జరుగుతుంది అదేందో మరి అర్థం కావడం లేదు అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుకున్న కానీ వీరు మాత్రం పని చేస్తున్నారో లేదో తెలియదు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపాలిటీ ఉద్యోగులు థంబ్ వేయడంపై దృష్టి సారించాలని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి కబ్జా?

మున్సిపల్ ప్రధాన కార్యాలయం గేటు ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించుకొని పనులు చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాన్ని ఎవరు లీజుకు ఇచ్చారు ఎన్ని యేండ్ల పాటు ఇచ్చారు? అనేది అధికారులకే తెలియాలి. ప్రధాన కార్యాలయం గేట్ ముందు వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన వాటిని గేట్ ముందే పెట్టడం, రోడ్డు మీద పనులు చేస్తూ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆగం ఆగం చేస్తున్న పట్టించుకొని అధికారులు.

బల్దియాలో సమస్యలు అనేకం. వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ. నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

 

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. చాహాత్ బాజ్ పేయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన కమీషనర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కు కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు.

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

నేటి ధాత్రి

 

 

 

తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం. ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ వాహనాలు — ప్రత్యేకించి కచ్రా వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర ఉపయుక్త వాహనాలు — పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయి..

పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తోంది..

అలాగే, మున్సిపల్ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని నేను కోరుతున్నాను..

ఈ కార్యక్రమంలో కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు..

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు.

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు

ఐక్యవేదిక అధ్యర్య ములో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి మున్సిపాలిటీ కి విలీన గ్రామన్ని రాజనగరం అమ్మ చెరువు కట్టను అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కట్ట పైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దాని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెంటనే పూర్తి చేయాలని, కట్ట పై వెలిసిన టవర్ లైట్లు రావడం లేదని వనపర్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని మున్సిపల్ ఇంజనీర్ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ చెప్పారు చెరువు కట్టపై శానిటేషన్ పనులు చేయడం లేదని, తుమ్మ చెట్లు పెరిగి నాయని రాత్రిపూట వెళ్లే వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార ని సతీష్ తెలిపారు విష సర్పాలు తిరుగుతున్న సమయంలో రాత్రి పుట వాహనాల ప్రజలు కట్ట పై ప్రయాణిస్తుంటారని రోడ్డు ప్రమాదం ఏర్పడుతుందని సతీష్ తెలిపారు. 12వ వార్డు రాజనగరాన్ని వనపర్తి మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని, విలీన గ్రామాలైన మర్రికుంట శ్రీనివాసపురం, నాగవరం రాజనగరం, జంగమయ్య పల్లి వార్డులను అభివృద్ధి చేయాలని జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు
జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వెంట తో పట్టణ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,కురుమూర్తి,శివకుమార్, గుంట్ల వెంకటేష్, రాజు,కృష్ణయ్య, శ్రీనివాసులు రాజనగరం గ్రామ ప్రజలు ఉన్నారు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

నేటిధాత్రి భూపాలపల్లి:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని, 30 వార్డుల్లో కాంగ్రెస్ నేతలు గెలుపొందించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని మొత్తం 30 వార్డుల ముఖ్య నేతలతో ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజితో కలిసి కేకు కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న గొప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు సుంకర రామచంద్రయ్య ఇప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ గురుముల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం.

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మునిసిపాలిటీలో కమిషనర్ గా పదోన్నతి పొందిన నాగరాజు,పట్టణ సీఐ రఘుపతి రెడ్డిలకు బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానం చేశారు. నర్సంపేట మున్సిపాలిటిలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మున్సిపాలిటీ కమీషనర్ గా ఇటీవల పదోన్నతి పొందడంతో తన కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లో చేరిన టౌన్ సీఐ రఘపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఘనంగా సన్మానించారు.

CI Raghupathi Reddy.

 

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మోకుదెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్,బీసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం, పట్టణ అధ్యక్షులు గండు రవి గౌడ్, ఉపాధ్యక్షులు చీర వెంకట్ నారాయణ, యువజన నాయకులు బైరి నాగరాజు,రామగోని శ్రీనివాస్ గౌడ్,జామళాపురం అశోక్,పుల్లూరి కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం. 

దమ్మాయిగూడ నేటి ధాత్రి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే చేర్యా తీసుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగారం మాజీ చైర్మెన్ కౌకుట్ల చెంద్రారెడ్డి,( బి ఎం ఎస్ ) నాయకులు రాము, మోర నాగమల్లా రెడ్డి, సామల భరత్ రెడ్డి , డొంకెన రవీందర్ గౌడ్, రామిడి బాపి రెడ్డి, మహిళా మోర్చా మునిసిపల్ అధ్యక్షురాలు రోత్తమ్ ప్రశాంతి, దాసరి సరెండర్ రెడ్డి, దసారం సతీష్ కుమార్, కే కుమార్, జరిపిటి ఆంజనేయులు, తడుక కృష్ణ, సాయికృష్ణ చారీ, చక్రపాణి, ర్ సురేష్, మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి.

అభివృద్ధి – సంక్షేమం బిజెపితోనే సాధ్యం నినాదంతో బస్తి చలో కార్యక్రమం

మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

 

నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బస్తి చలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు ఎం. సత్యనారాయణ గారి నివాసంలో ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగింది.
అనంతరం ఆర్‌ఎల్ నగర్ వార్డ్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడంతో పాటు, వారి కోసం అల్పాహారం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ

BJP Former

 

46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తల త్యాగం సేవా భావంతో బీజేపీ ప్రజలలో విశ్వాసాన్ని సంపాదించింది. పార్టీ పెద్దలను సన్మానించడం దైవ కార్యంతో సమానం. ఎం. సత్యనారాయణ గారు జాతీయ స్థాయిలో పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు.
అలాగే, పారిశుద్ధ్య కార్మికులు కరోనా మహమ్మారి సమయంలో చేసిన సేవలు అపూర్వమైనవని కొనియాడారు.
సమాజంలో పరిశుద్ధ కార్మికులను చిన్నచూపు చూడకూడదు. వారు లేకపోతే మన దైనందిన జీవితం సక్రమంగా సాగదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు మునిగంటి సురేష్, బొమ్మిడి బుచ్చిరెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి గణపురం శ్యామ్ సుందర్ శర్మ, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్లు బుద్ధవరం లక్ష్మీ, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, బుద్ధవరం వేణుగోపాల్, మామిడి జంగారెడ్డి, కౌకుట్ల రాహుల్ రెడ్డి, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, కర్ర వెంకటేశ్వరరావు, భువనేశ్వరి, మాధవరావు, ఎలసాని నాగరాజు యాదవ్, ఏనుగు మహేందర్ రెడ్డి, మధు గౌడ్, చారి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె.

మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుకు సమ్మె

మున్సిపల్ కమిషనర్ హామీతో విరమించిన కార్మికులు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వం 2021 జూన్ నెలలో 11వ పి.ఆర్.సి కింద మున్సిపల్ మున్సిపల్ కార్మికుల వేతనాలను 12,000 నుండి 15600 కు నెలకు 3600 పెంచడం జరిగినది. కానీ 2022 ఫిబ్రవరి నెల నుండి కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వడం జరిగినది. ఎనిమిది నెలల పి.ఆర్.సి బకాయిలు రావాల్సి ఉంటే మధ్యలో చాలాసార్లు అడిగితే ఒక్కొక్క నెల చొప్పున కేవలo మూడు నెలల పి.ఆర్.సి పెండింగ్ వేతనాలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ ఐదు నెలల పెండింగ్ పి.ఆర్.సి వేతనాలు రావాలి మొత్తం 250 మంది కార్మికులకు ఒక్కో నెలకు 3600 చొప్పున ఒకరికి 18,000 చొప్పున మొత్తం 45 లక్షల రూపాయలు కార్మికులకు రావాలి. మున్సిపల్ కార్మికులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదు అని తెలిపారు.అంతేకాకుండా గత నెలలో ఫిబ్రవరి, మార్చి నెలల రావాల్సిన వేతనాలు కూడా ఇంకా కార్మికులకు ఇవ్వలేదు అని తెలిపారు.కార్మికులకు సంబంధించి పి.ఎఫ్ , ఈ.ఎస్.ఐ మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం పాలకవర్గ గడువు ముగిసింది జిల్లా కలెక్టర్ ఇన్చార్జిగా ఉన్నారు పై సమస్యలు పరిష్కరించాలని మార్చి 4వ తేదీన కమిషనర్ గారికి , 15 రోజుల క్రితం కలెక్టర్ కి కూడా లెటర్లు ఇవ్వడం జరిగినది. ఏప్రిల్ 10 లోపు సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పనులుస్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం 5 గంటలకు పనులకు వెళ్లకుండా మున్సిపల్ ముందు బెటాయించిన కార్మికులు ఉదయం 6 గంటల వరకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి అన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ హామీలు మేరకు ఉదయం 8 గంటలకు విధులలో చేరిన సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 21న కురిసిన అకాల వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై, మురికి కాలువలలో విరిగిపడ్డాయి. వారం రోజులు కావస్తున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారిని సంప్రదించగా తీయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు మురికి కాలువలో నుంచి చెట్లను, చెత్తను ఇంకా తీయలేదు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లను, మురికిని తీయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version