ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌..

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, సస్పెన్షన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అమరావతి, మార్చి 01: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీవీ.సునీల్‌ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వేడి రాజుకుంది. సామాజిక, ప్రసార మాధ్యమాల వేదికగా ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎమ్మెల్యేల క్రీడాపోటీల్లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఇటీవల రఘురామ కిందపడి గాయపడ్డారు. ఆయన చేతికి మణికట్టుకు గాయవ్వగా.. చేతికి కట్టుతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. రఘురామ గాయంపై సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘రఘురామ.. కస్టోడియల్‌ టార్చర్‌ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగాయి. అలాంటిది నిజంగా కొట్టి ఉంటే.. ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా?’ అని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
దీనికి డిప్యూటీ స్పీకర్ రఘురామ దీటుగా బదులిచ్చారు. ‘సర్వీస్‌ కాల సస్పెన్షన్‌లో ఉన్న సునీల్‌ కుమార్‌ అనుమతిస్తే నాకు కేవలం అరగంట చాలు.. కస్టడీలో నన్ను హింసించినట్టుగా.. కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర, రబ్బర్ బెల్ట్‌తో రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను. సునీల్‌ కుమార్‌ వచ్చి కొట్టించుకుని, నిరూపించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెట్టేందుకు సిద్ధం’ అని రఘురామ సవాల్‌ విసిరారు.

న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందని ఈ సందర్భంగా రఘురామ అన్నారు. ‘న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నాపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన సునీల్‌ కుమార్‌ అరెస్ట్‌ తథ్యం’ అని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..

 తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version