కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు
ఎఐటియుసి జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఎఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు,సమ్మె కార్యక్రమాలు తప్పవని ఆ యూనియన్ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గుర్తింపు కార్మిక సంఘం (ఎఐటియుసి) కార్మికుల సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ఇచ్చిన డిమాండ్లను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.మెడికల్ బోర్డు కు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుని తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికి మెడికల్ బోర్డు పై స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు.మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో తెలుపాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు పూర్తి చేసుకొని డిపెండెంట్ ఉద్యోగాల కింద సుమారు 375 మంది 5,6 నెలల నుండి విటిసి ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారిని ఎందుకు అపుతున్నారో స్పష్టత లేదని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సంస్థ అభివృద్ధి కోసం పాటుపడే కార్మికుల సొంతింటి పథకంపై ఎన్నిసార్లు మాట్లాడిన ఆ అంశంపై పురోగతి లేదని ఆరోపించారు.కోలిండియాలో మాదిరి అలవెన్స్ లపై టాక్సును సింగరేణి యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ అంశంపై స్పందనలేదని అన్నారు.వెంకటేష్ ఖని( వికె) కోల్ వైన్స్,ఇల్లందు జేకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ లో పూర్తిగా బొగ్గు,ఓబి తీసే పనులను ప్రైవేటు వాళ్ళకే ఇచ్చారని ఆరోపించారు. ఒకవైపు యాజమాన్యం ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉందంటూనే కాంట్రాక్ట్ పద్ధతులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.డిస్మిస్ కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో యూనియన్ దృష్టికి తీసుకెళ్లిన సరైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.అలాగే ఎంతోమంది కార్మికులు ఆవేదన చెందుతున్న మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఒక ఫైల్ కూడా ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.సుమారు 7000 మంది అభ్యర్థులు క్లారికల్ కొరకు రెండు,మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వారికి ఎగ్జామ్స్ పెట్టడం లేదని అన్నారు.అదే కాకుండా స్పష్టత లేకుండా 150 మాస్టర్ల ను కార్మికులను సంప్రదించకుండా తెరమీదికి తీసుకువచ్చారని,ఇచ్చేకాడ ఇవ్వకుండా,కట్ చేసే కాడ మాత్రం యాజమాన్యం ముందుంటుందని విమర్శించారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొంటామని ఈ మేరకు ఈనెల 6వ తేదీన సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేపడుతూ అన్ని గనులు డిపార్ట్మెంట్లలో మెమోరాండాలు అందజేస్తామని,8వ తేదీన జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు అనంతరం నిరాహార దీక్షలను చేపడతామని,కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరిలో సమ్మె తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు,సహాయ కార్యదర్శి చంద్రమోహన్,మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజేశ్వర్ రావు, బాలకృష్ణ,రాజశేఖర్, శ్రీనివాస్, నాయకులు,మోతే లచ్చన్న, గజ్జి రమేష్,నరసయ్య,రాజ్ కుమార్,శ్రీనివాస్ పాల్గొన్నారు.
