సీఎంఆర్ఎఫ్: నిరుపేదలకు కొత్తగూడ సర్పంచ్ ఆశా కిరణం

* సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

* కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ
*
కొత్తగూడ నేటిధాత్రి :

పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక వరం అని కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ అన్నారు.గురువారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మహ్మద్ యాకుబ్ కు 18500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బోడ ఈర్య, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,ఈర్య నాయక్, అఫ్జల్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు యాదగిరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్

*గృహ జ్యోతి పథకం ద్వారా పేద ప్రజలకు తగిన ఆర్థిక భారం. గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు*

*-మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు*
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

గృహ జ్యోతి పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు అన్నారు. మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ..గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా అందజేస్తున్న కరపత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు లబ్ధిదారుల కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలపడం జరుగుతుందన్నారు.

 

 

లబ్ధిదారులు వాడిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరిగిందన్నారు. విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువు, ఆరోగ్యం మరియు కుటుంబాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 52, 82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు రూ. 3,593 కోట్ల రూపాయలను ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సంక్రాంతి పండుగను మీ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, విద్యుత్ శాఖ అధికారులు ఫోర్ మెన్ యాదగిరి, ఏఎల్ఎం రమేష్, అన్ మ్యాన్డ్ వేముల కిరణ్ గౌడ్, గృహ జ్యోతి లబ్ధిదారులు పాల్గొన్నారు.

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి..

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు ఇవ్వాలి

అసంపూర్తి ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

దూపకుంట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన ఎంసిపిఐ(యు) బృందం

నేటిధాత్రి ఖిలా వరంగల్ :-

https://youtu.be/wR0ljd3z7mE?si=XsG-p6jOssIJ31iK

 

 

వరంగల్ నగరం, దూపకుంట పరిధిలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేసి కూడా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోతే అర్హులైన పేదలను సమీకరించి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు.

శుక్రవారం ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా–నగర నాయకత్వ ప్రతినిధి బృందం దూపకుంటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించింది.

ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ…
వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరాశ్రయ పేదలకు అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్లు ఇస్తామని ప్రచార ఆర్భాటం చేసిన గత ప్రభుత్వం, కాలయాపన చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండానే అధికారాన్ని కోల్పోయింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి కొండ సురేఖ ప్రస్తుత మంత్రిగా ఉన్నా కూడా దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం విడ్డూరం” అని విమర్శించారు.వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకోగా, సగం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్లు అసంపూర్తిగా ఉండటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు మార్లు అధికార యంత్రాంగానికి విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.

అలాగే లక్ష్మీ టౌన్షిప్‌లో 210, తిమ్మాపూర్‌లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ నేటికీ పంపిణీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే పంపిణీ చేయకపోతే ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇండ్ల నిర్మాణంలో జరిగిన నాసిరకం పనులు, అసంపూర్తిగా నిలిపివేసిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించనున్నట్లు ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలోజిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్ రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధిని పేదలు సద్వినియోగం చేసుకోవాలి – భీమిడి జైపాల్ రెడ్డి

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-19T132935.986.wav?_=1

 

ముఖ్యమంత్రి సహాయనిధిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 19 :

 

పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప వరమని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్ చెందిన సుతారిగూడెం జగన్ మోహన్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.60,000/-ల చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా అయన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ పేండం లక్ష్మి నారాయణ, దేవస్థానం ధర్మకర్తలు వలందాసు మురళి గౌడ్, గుడిసేని హరికృష్ణ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పేండం సాయి, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తనకు రూ.60,000/-ల ఆర్థిక సహాయం మంజూరు చేయించడంలో సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి,జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారికి లబ్ధిదారుడు సుతారిగూడెం జగన్ మోహన్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి…

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి

రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో తల్లి దివ్యాంగులకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిం చాలని రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఫణిచంద్ర కు వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న దివ్యాంగులు నిరుపేదలైన ఫిజికల్ కోటలో వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో
అరికిల్లసాంబయ్య దివ్యాం గుడు పల్లెబోయిన సారయ్య ఎంపిటిసి మాజీ అబ్బు రఘు పతి రెడ్డి శంకర్ లింగం గడిపే ప్రభాకర్ కటికే అశోక్రాజోజు రజిత దివ్యాంగురాలు,సామల శంకర్ లింగం దివ్యాంగుడు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు నిరుపేదల పాలిట గగన పుష్పాలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T133050.854.wav?_=2

 

ప్రభుత్వ పథకాలు నిరుపేదల పాలిట గగన పుష్పాలు

◆:- సంక్షేమం నిరుపేదలది లబ్ధి సంపన్నులది అక్రమార్కులది

◆:- విచారణలోపమే పేద ప్రజల పాలిట శాపం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హాయంలో 972 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదల కోసం నిర్మించినారు ఇండ్లు పొందుటకు సొంత ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకోవాలని జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు పత్రికా ముఖంగా ప్రజలకు తెలిపినారు అందుకు సొంత ఇండ్లు లేని నిరుపేద ప్రజలు దాదాపు8000 మంది సకాలంలో దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారిని జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 2400 మందిని లబ్ధిదారులుగా గుర్తించినారు కానీ వాస్తవానికి 972 ఇండ్లు

ఉండడంతో2400 మందిని డ్రా తీయగా పూర్తి స్థాయి అర్హులుగా 972 మందిని గుర్తించి ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేసినారు కానీ వాస్తవానికి జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు లబ్ధిదారుల గుర్తింపులో విఫలం కావడంతో ఈ ఇండ్లను చాలామంది అక్రమార్కులు సంపన్నులు పొందినారు అక్రమార్కులు అనగా మన రాష్ట్రానికి చెందినవారు కారు జహీరాబాద్ పట్టణానికి చెందినవారు కారు వేరే నియోజకవర్గాల వారు వేరే జిల్లాల వారు చాలామందికి వ్యవసాయ భూములు స్థిర నివాస స్థలాలు వేరే రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నప్పటికిని అర్హులుగా గుర్తించి పేదవాడికి పేదవాడికి మధ్యన జరగాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లక్కీ డ్రా అక్రమార్కులకు సంపన్నులకు నిరుపేదలకు మధ్యన జరగడంతో చాలామంది అక్రమార్కులకు సంపన్నులకు ఇండ్లు డ్రా పద్ధతిన నెగడం జరిగింది అయితే ఇక్కడ ఒక విచిత్రం ఈ అక్రమార్కులు చాలామంది వారు పొందిన డబుల్ బెడ్ రూంలో నేటికీ మూడు

సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఇండ్లలోకి వెళ్లలేదు మరి కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా లోలోపల బంధువుల ముసుగులో అమ్మి వేస్తున్నారు వాస్తవానికి నిరుపేదలకు చెందాల్సిన ఇండ్లు అక్రమార్కులు పొందడంతో చాలామంది నిరుపేదలు నేటికీ రోడ్లపైనే జీవిస్తున్నారు ఈ జీవనంలో ఒక కుటుంబం గొల్ల మల్లన్న ఇంటి అద్దె చెల్లించలేక రోడ్డుపైన జీవిస్తూ తన తల్లి బస్టాండ్ లో జీవిస్తూ అక్కడే మరణించింది భార్యా పిల్లలు చాలీచాలని వసతులతో కూడిన ఇల్లును అద్దెకు తీసుకొని అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు వారికి ఇల్లు రాలేదని ఎలాగైనా ఇల్లు ఇప్పించాలని తెలిసిన నాయకులకు అధికారులకు కాళ్ళ వేల పడి బతిమిలాడుకుంటున్నారు చాలామంది అక్రమార్కులు జహీరాబాద్ నుండి ఆడపిల్లలు పెళ్లి చేసుకొని పోయి ఇక్కడ ఆధార్ కార్డు కలిగి ఉండడంతో ఇక్కడ నివసిస్తున్నట్లు దరఖాస్తు చేసుకొని ఇల్లు పొందినారు వాస్తవానికి వారి భర్తలకు వారి అత్తమామలకు ఇక్కడ ఎలాంటి గుర్తింపు ఉండదు ఇలాంటివారిని కూడా తాసిల్దార్ కార్యాలయం వారు విచారణ చేపట్టి లబ్ధిదారులుగా గుర్తించినారు దీని మూలంగా కూడా స్థానికులకు ఇండ్లు దక్కలేని పరిస్థితి దరఖాస్తు ఇచ్చినప్పుడు వాస్తవానికి తాసిల్దార్ కార్యాలయం వారు 90 డిగ్రీ సర్వే ఉంటుంది అని చెప్పినారు కానీ వాళ్ళు చేసిన సర్వే అంతా కూడా పటిష్టమైన 90 డిగ్రీస్ కోణం సర్వే కాదు కొంతమంది లబ్ధిదారులు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు ఇంకా కొంతమంది తహసిల్ కార్యాలయంలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు వారి బంధువుల పేర్లను కూడా గుట్టు చప్పుడు కాకుండా రాసుకున్నారు ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజలు ప్రతిరోజు నాయకులకు అధికారులకు తమ ఇష్టం వచ్చినట్లు చివట్లు పెడుతూ ఉన్నారు ఇండ్లు పొందిన కొంతమంది లబ్ధిదారులు పొందిన ఇంటిని సంపన్నుల వలె ఫాల్ సీలింగ్స్ వాల్ లపం వాసు ప్రకారంగా ఎక్కడబడితే అక్కడ దర్వాజలు పగలగొట్టడం వారి పైన ఇల్లు వచ్చిన వారికి తగులు పెట్టుకొని బాత్రూంలు బంద్ చేయించడం చేస్తూ ఉన్నారు కావున ఇకనైనా సూక్ష్మంగా సర్వే జరిపించి కొంతమంది అనారులు ఇంకా ఉన్నారు వారిని ఇండ్లలో నుండి తొలగించి నిజమైన నిరుపేదలకు గుర్తించి వారికి అందేలా చూడాలని లోలోపల అమ్ముకున్న వారిని విచారణ జరిపి వారి ఇండ్లను కూడా రద్దుచేసి నిరుపేదలకు అందేలా చూడాలని తాసిల్దార్ కార్యాలయం ప్రకటనతో అక్రమంగా ఇండ్లు పొందిన వారి అభ్యంతరాలను తెలుపాలని తెలియజేయగా నేరుగా కొంతమంది లబ్ధిదారులు సకాలంలో దరఖాస్తు చేసిన జహీరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వారు పట్టించుకోలేదు కావున సూక్ష్మ విశా విచారణ జరిపి నిజమైన పూర్తి హరత కలిగిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగా కోరుచున్నది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఫసి మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ అరవింద్ బాలు సన్నీ బి. బాలు గార్లు పాల్గొన్నారు,

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలొ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాల టేకుమట్ల మండలంలోని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పాల్గొనిపంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు అలాగే పేద ప్రజలు ఎవరైనా ఎలాంటి పైరవీలకు తావు లేకుండ స్వచ్ఛందంగా అమలు చేస్తామన్నారు ఎవరికి ఏ ఆపద ఉన్న స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకోవాలన్నారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కొనియాడారు, 18 గంటలు కష్టపడి పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజల కోసమే అహర్నిశల కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర లక్ష్మణ్ గౌడ్ , జిల్లా నాయకులు చిలుకల రాయకొమురు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల అల్లకొండ కుమార్ టేకుమట్ల చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

గూడు లేని నిరుపేదలను గుర్తించండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T175449.046.wav?_=3

 

గూడు లేని నిరుపేదలను గుర్తించండి..

*సొంతింటి కలను సాకారం చేయండి..

*ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పనిచేయండి..

*అధికారులకు దిశా నిర్దేశం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్..

*లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు..

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

 

గూడు లేని నిరుపేదను గుర్తించి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జిల్లా యంత్రాంగానికి సూచించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆశయానికనుగుణంగా పనిచేసి ,కూటమి సర్కార్ ప్రతిష్టను పెంచాలని తెలియజేశారురాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన
నేపధ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 3 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించిన విషయం విదితమే.., బుధవారం సామూహిక గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారుఈ సందర్భంగా చిత్తూరు అర్బన్, తిమ్మసముద్రంలో నిర్వహించిన నూతన గృహాలకు సంబంధించి , లబ్ధిదారులకు తాళాలు అప్పజెప్పే కార్యక్రమానికి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,నగర మేయర్ కుమారి అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత తదితరులు హాజరై.., లబ్ధిదారులకు స్వయంగా తాళాలను అందజేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో చిత్తూరు ఎం.పి. దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడారు.
నిరుపేదల కడగండ్లను తీర్చడమే కూటమి సర్కార్ లక్ష్యం అన్నారు. అధికారి యంత్రం కూడా ఆ దిశగా పనిచేయడం అభినందనీయమన్నారు. అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సహకారం చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామన్నారు. మరి ముఖ్యంగా అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని వారు సూచించారు. అప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు, కార్పోరేటర్ అశోక్, నగర టిడిపి అధ్యక్షుడు నరేష్, నాయకులు గోపాల కృష్ణ,,రాణేమ్మ, రాజశేఖర్ నాయుడు, కూటమి నాయకులు,కార్యకర్తలు, జిల్లా హౌసింగ్ శాఖ అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు..

త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నే టి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం లోని. పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలని ఉద్దేశంతో. గూడు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదని. ఉద్దేశంతో. తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలోని నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి. వారిలో నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్నారని. అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని. రాళ్లపేట. అంకిడిపల్లె. అంకుసాపూర్. కాస్బేకట్కూర్. మండేపల్లి. గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. ఈనెల ఆరవ తేదీన. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభిస్తారని నాయకులు వెల్లడించారు. తద్వారా తంగళ్ళపల్లి.మండలంలో కేంద్రంలో నమూనా ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అధికారులు నాయకులు. ఇట్టి కార్యక్రమంలో.AMC. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మునిగల రాజు. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజేశ్వరరావు. పొన్నాల లక్ష్మణ్ నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

చెక్కుల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు…

చెక్కుల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు.
చెక్కులు పంపిణీ చెయ్యాలని వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద పేదింటి పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసే తండ్రి కి కొంతమేర సహాయంగా కల్యాణ లక్ష్మి ఉపయోగపడుతుందనీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరకు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదింటి తల్లిదండ్రులు ఆడబిడ్డకు పెళ్లి చేశారు. కల్యాణ లక్ష్మికి అప్లై చేసినప్పటికీ సుమారు ఐదు, ఆరు నెలలుగా చెక్కులు పంపిణీ చేయడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా! ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా! అనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. వెయ్యి కళ్ళతో కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వాలని లబ్ధిదారు లు వేడుకుంటున్నారు.

గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్….

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో తాము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లలో కట్టిన ఇండ్లను గత వారం రోజుల నుండి కొంతమంది వ్యక్తులు బుల్డోజర్ల తో కూల్చి వేస్తున్నారని వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై వినయ్ కుమార్ ఫిర్యాదు చేసిన ఐడిఎస్ఎంటి బాధితులు..ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్…

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి:

ఓదెల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి సూచన మేరకు ఓదెల మండల కేంద్రం లో జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గిపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని అన్నారు.జీఎస్టీ తగ్గిపుతో దసరా పండగ ఘనంగా చేసుకునే అవకాశం ప్రతి పేదకుటుంబానికి దక్కిందని అలాగే అనేక ఔషధాల ధరలు తగ్గింపుతో జబ్బుతో బాధపడుతున్న ప్రజలకు మేలుజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రేణుకాదేవి పుల్లూరి పృద్విరాజ్ కుమారస్వామి చారి సత్యనారాయణ పద్మ రాచర్ల అశోక్ రామినేని రాజేంద్రప్రసాద్ సారంగం తదితరులు పాల్గొన్నారు.

దసరాకు నిరుపేదలకు చీరలు ఇవ్వాలి: జాగో తెలంగాణ డిమాండ్…

నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

◆:- జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ అందరు జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న బతుకమ్మ చీరలు బందు చేశారు నిరుపేద తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు మంచి నూనె సబ్బులు సరఫరా చేయాలి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు లక్షలాదిగా ఉన్నారు అందరూ ఉన్నవాళ్లే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వము అని గొప్పలు చెప్పుకోవడం కాదు పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం వారికి దసరా పండుగ జరుపుకోవడానికి అన్ని సదుపాయాలు చేయడం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలు నిర్ణయిస్తారు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత మొహమ్మద్ ఇమ్రాన్ ప్రధాన కార్యవర్గ సభ్యులు, మరియు, మాదినం శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది,

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డిమాండ్….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-93-1.wav?_=4

నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వం

.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి….

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్

యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ జిల్లా మలహలరావు మండలం లోని కొయ్యూరు గ్రామంలోని ఆదివాసి గిరిజన కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది 60 కుటుంబాలు ఉన్న నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నాం నిరుపేదలైన ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వాయిస్తున్నారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్హులైన నిరుపేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం . ఆ కాలనీవాసులను మందలించగా మాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఉన్నత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ కాలనీ వెనుకబడిపోతుందని తక్షణమే సర్వే నిర్వహించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా చర్యలుచేపట్టాలని ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు తక్షణమే స్పందించి నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా అధికారులకు ఆదేశించాలని లేనియెడల నిరుపేదలను సమీకరించి ఆందోళనలో పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ దళితులకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి కూడా ఇల్లు అచ్చిన దాకాలు కానరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లన్న సేద మల్లేష్ గొట్టం సమ్మక్క అరవండి లక్ష్మి సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు

విచారణ పేరుతో కాలయాపన తగదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104839.140.wav?_=5

విచారణ పేరుతో కాలయాపన తగదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో నిరుపేదలకు సీఎం సహాయనిధి పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T131500.204.wav?_=6

నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

పేదలకు గోపవరం సీఎం సహాయనిధి.

పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి:
-ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట( నేటిదాత్రి )

వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం

“పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం”

రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

రాష్ట్రంలోనీ పేదల ఇళ్లల్లో ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జెకె ప్యాలెస్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది ప్రతి పేద కుటుంబానికి భరోసా అని ప్రస్తావించారు. భవిష్యత్తుకు ఆర్థిక బలంతో పాటు, పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ ప్రక్రియ కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు,1667 పాత కార్డులకు ఆడిషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. గతంలో అర్హులు ఎన్నో ఏళ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version