మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం…

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం గౌడ్ గణేష్ చౌక్ ప్రాంత పునర్వైభవం కోసం చేస్తున్న కృషికి తొలి విజయం లభించింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, వారసంత, బస్టాండ్ పునరుద్ధరించాలని కౌన్సిలర్ గతంలోనే జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
మున్సిపల్ పాలకవర్గం, బుధవారం నాడు గణేష్ చౌక్ నుండి లక్ష్మీ నగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, సి.ఆర్. నగర్ కాలనీల వరకు ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్వయంగా ఎర్ర చెరువు ప్రాంతాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ మాట్లాడుతూ
మా వార్డులోని గణేష్ చౌక్ ప్రాంతం వెనుకబడకూడదని మొదట కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాం వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు
పాత గ్రామ పంచాయతీ స్థలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం బస్టాండ్ ఆటో నగర్ అంగన్‌వాడీ ప్రత్యేక భవనాల ఏర్పాటు చేయాలని అయినా అధికారులకు తెలిపారు

సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…

సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుట కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయాన్ని ముందుగా శుద్ధిచేసి నూతన రంగులతో అలంకరించి సీతారాముల కళ్యాణం కొరకు 10,116 రూపాయలు అందించినట్లు వారు తెలిపారు.అలాగే హనుమాన్ భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం…

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని పారిశుద్ధ్యంగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట, నేటిధాత్రి:

 

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యంగా, అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపల్ యంత్రాంగంతో కలిసి 24వ వార్డులో పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక వార్డు కౌన్సిలర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డులో ఎమ్మెల్యే సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పారిశుధ్యం, మెరుగైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను వారు సమీక్షించారు. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వించి మోటర్లు అమర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా వార్డులోని జీడయ్యపల్లె ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, పాఠశాలకు అవసరమైన నిధులు కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అయూబ్ ఖాన్, 24వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు,వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

29న భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లాల చెస్ పోటీలు…

29న భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ జిల్లాల చెస్ పోటీలు

గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేముల పల్లి సుబ్బారావు

నర్సంపేట,నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెంలోని గీతాంజలి పబ్లిక్ స్కూల్ నందు ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం మరియు వరంగల్ జిల్లాల స్థాయి చెస్ పోటీలు లో నిర్వహించినట్లు గీతాంజలి విద్యా సంస్థలు చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 30 ట్రోఫీలతో పాటు ప్రతి ఒక్క క్రీడాకార్డుకి మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయున్నట్లు తెలిపారు.ఈ చెస్ క్రీడలో పాల్గొనేందుకు 15 మంది బాలికలకు 15 మంది బాలురకు, అందులో అండర్ 15 అండర్ 12 అండర్ 9 విభాగంలో వారికి బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలు స్విస్ లీగ్ పద్ధతిలో జరుగుతాయని ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ సిహెచ్ గోపికృష్ణ తెలిపారు.క్రీడలో పాల్గొనే వారు 9440162749,9182225496 చేరవాణి నెంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ ఓన్ చెస్ బోర్డ్స్ ను తమ వెంట తీసుకురాగలరన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల లోపు భద్రాద్రి కొత్తగూడెం పట్టణం గౌతమ్ నగర్ గీతాంజలి పబ్లిక్ స్కూల్ రావాల్సిందిగా కోరారు. ఈ పోటీలలో ఓడిపోయిన గెలిచిన ప్రతి ఒక్కరు 5 రౌండ్లు ఆడవలసిందిగా చెస్ కోచ్ సీహెచ్ బిశ్వజిత్ కృష్ణ తెలిపారు.

రాజకీయ శిఖరం..పాలనా సౌధం!

`ఆకాశమంత వ్యక్తిత్వం.. ఎవరికీ అంతు చిక్కని చాణక్యం!

`దేశమంతా నలుదిశలా మారు మరోగుతున్న నమో మంత్రం.

`12 ఏళ్లుగా దేశమంతా వెలుగుతున్న ప్రజా కిరణం.

Narendra Damodardas Modi

 

`25 సంవత్సరాలుగా పాలనాపెద్దగా సుదీర్ఘ ప్రయాణం.

`మోడీ రికార్డును బ్రేక్ చేయడం భవిష్యత్తుభారతం లో ఎవరికీ సాధ్యం కాదు.

`భారతవని ఉన్నంత వరకు ఈ రికార్డ్ పదిలం.

Narendra Damodardas Modi

 

`అది ఒక్క నరేంద్రదామోదర్ దాస్ మోడీ కే సొంతం.

`మోడీ అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సంతకం.

`13 ఏళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు!

`ఓటమి ఎరగని నాయకుడుగా రికార్డులు.

`మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలుపు.

`ఆ వెంటనే ప్రధానిగా మూడు సార్లు వరుస గెలుపులు.

`ఏడు సార్లు వరుసగా గుజరాత్ లో బీజేపీ గెలుపులు.

`దేశమంతా గుజరాత్ మోడల్ తో అభివృద్ధి పునాదులు.

`ప్రధానిగా దేశమంతా కాషాయ జెండా ఎగురవేసిన ఏకైక నాయకుడు.

`“మోడీ,అమిత్ షా” ద్వయం అంటేనే అదో రాజకీయ వ్యూహం.

`ఆ ద్వయాన్ని ఎదుర్కొలేక గిలగిల లాడుతున్న కాంగ్రెస్.

`ఇంకా 25 ఏళ్ళు వుంది.. మరింత ముందుంది అని చెప్పిన ఏకైక నాయకుడు.

`ఇంకా రెండు సార్లు ప్రధానిగా పని చేయగల ఆరోగ్యం మోడీ సొంతం.

`దేశ ప్రజల ఆశీర్వాదమే మోడీ బలం.

`ఇప్పటికే విశ్వ గురువుగా ప్రపంచమే కొనియాడుతున్న నాయకత్వం.

 

హైదరాబాద్, నేటిధాత్రి:

జనం నమ్మకాన్ని నిలబెట్టే వారే నాయకుడు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేవారే పాలకులు. అలా జనం గుండెల్లో చెరగని స్ధానం సంపాదించుకొని 25 సంవత్సరాలుగా పాలకుడుగా కొనసాగుతున్న ఏకైక నాయకుడు, పాలకుడు ప్రదానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రజలంగా విశ్వగురువుగా కీర్తించుకుంటున్న ఏకైక నాయకుడు కూడ ప్రధాని నరేంద్ర మోడీ. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకులలో ఏ ఒక్కరినీ ప్రజలు అంత గొప్పగా పిలుచుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశం ప్రపంచ దేశాలకు దిక్సూచీగా మార్చిన నాయకుడిగా లోకమే గర్వపడుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. మన దేశంలోనే ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన ఒకే ఒక్కడు ప్రదాని నరేంద్ర మోడీ. తరతరాలకు ఆదర్శంగా నిలిచేలా తన పాలనా విధానాన్ని ఒక సౌధంలా నిర్మించి నాయకుడు కూడా మోడీయే కావడం విశేషం. ఇన్ని సుగుణాలు కలిగిన నాయకుడిగా దేశమంతా చూస్తున్న ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరంతరంగా అటు నాయకుడుగా, ఇటు పాలకుడిగా తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఏకైక ప్రజాపెన్నిది నరేంద్ర మోడీ. ఆయనది ఆకాశమంత వ్యక్తిత్వం. అందుకే దేశ ప్రజలకు నరేంద్ర మోడీ నాయకత్వం అంత ఆరాధనత్వం. సహజంగా నాయకులకు జేజేలు కొట్టడం వేరు. కాని జనం ఆదార్యడిగా కొలుస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఇక రాజకీయంగా ఆయన వేసే అడుగులు ఎవరికీ అంతు పట్టవు. ఆయన వ్యూహాలు చేధించే నాయకుడు దేశంలోనే లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన 13 సంవత్సరాల పాటు పాలించారు. అక్కడి నుంచి నేరుగా దేశ ప్రదానిగా పాలకుడిగా మారారు. విశ్వ విజేతను విశ్వ గురువుగా కొనియాడబడుతున్నారు. అది కేవలం బిజేపి పార్టీ నాయకులే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆయను విశ్వగురువుగా గుర్తిస్తున్నారు. కీర్తిస్తున్నారు. మోడీ తప్ప దేశాన్ని కాపాడే నాయకత్వం మరొక పార్టీకి గాని, నాయకుడికి గాని లేదని ప్రజలు పన్నెండేళ్ల క్రితం తీర్మానించుకున్నారు. నాటి నుంచి నరేంద్ర మోడీ మాత్రమ కావాలని ఎన్నుకుంటున్నారు. పాలకుడిగా చూసుకుంటున్నారు. ఆ పాలకుడే మన ప్రాణాలకు రక్ష అనుకుంటున్నారు. అందుకే గుజరాత్‌కే పరిమితమైన బిజేపిని దేశ మంతా విస్తరింపజేసిన ఏకైక నాయకుడు నరేంద్రమోడీ. ఒకప్ప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బిజేపి ఇప్ప్పుడు దేశమంతా కాషాయ మయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ. ఎవరూ ఊహించనంత ఎత్తులో బిజేపిని నిలబెట్టారు. భవిష్యత్తు తర తరాలకు చెక్కు చెదరని పునాదులు బిజేపికి వేస్తున్నారు. దేశమంతా వినిపించే ఏకైక నామం నరేంద్ర మోడీ. దేశమంతా కొలిచే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఏ రాష్ట్రంలోనా సరే బిజేపి గెలవాలంటే, గెలిచినా బిజేపి పాలించాలంటే ప్రజలు చూసి ఎన్నుకునేందుకు చూసే ఏకైక దారి నరేంద్ర మోడీ. అందుకే గుజరాత్ నుంచి ఆయన నేరుగా దేశ నాయకుడిగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయన రాష్ట్ర అభివద్దికి వేసిన దారులు దేశమంతా చూసింది. గుజరాత్ మోడల్ అన్ని రాష్ట్రాలు కావాలని కోరుకున్నాయి. చివరికి దేశానికే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలిన కోరుకున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో మొదటిసారి బిజేపి సంపూర్ణ మెజార్టీతో విజయదుందుబి మోగించింది. అక్కడ మొదలైన విజయయాత్రలు ఇక పెరుగుతూనే వున్నాయి. 2019 ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా బిజేపి మారింది. ఎదరులేని నాయకుడిగా మోడీ ఎదిగారు. మోడీకి ఎదరు నిలబడి రాజకీయాలు చేసేవారు కరువయ్యారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని చూసినా కుదలేదు. దేశ ప్రజల గుండెల్లో వున్న ఏకైక నాయకుడుగా కొలువబడుతున్న నాయకుడు ప్రధాని మోడీ. దాంతో ఏ పార్టీ ఆయనను కదలించలేపోతున్నాయి. గత ఎన్నికల ముందు ప్రతిపక్షాలు చేసిన కొంత అరాజకీయం వల్ల బిజేపికి కొంత మెజార్టీ తగ్గింది. కాని మోడీ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. పైగా మోడీలో మరింత కసి పెంచింది. అందుకే ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపి అనూహ్య విజయాలే కాదు, అపూర్వ విజయాలు అందుకుంటూ వచ్చింది. మూడు రాష్ట్రాలలో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నది. డిల్లీ రాష్ట్రాన్ని కూడా బిజేపి వశం చేసుకున్నది. ఇలా అప్రతిహాత విజయాలు చూసిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. పాలకుడిగా ఏకంగా 8వేల, 9వందల, 37 రోజులు పూర్తి చేసుకున్న నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డులకెక్కారు. అయితే ముఖ్యమంత్రిగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ 24 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకున్నారు. తర్వాత రికార్డు పశ్చిమబెంగాల్ సిఎంగా పనిచేసిన మాజీ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు సుమారు 24 సంవత్సరాలు పనిచేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సష్టించేదుకు రాజకీయ పాలనా ప్రయాణం సాగిస్తున్నారు. దేశానికి తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ సుమారు 17 సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత 15 సంవత్సరాలకు పైగా ఇందిరాగాంధీ ప్రదానిగా పనిచేశారు. మూడోసారి ప్రధాని అయిన మోడీ ఈ సారి పాలనా సమయం పూర్తయ్యే సరికి ఇందిరాగాందీ రికార్డును సమం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే నెహ్రూ రికార్డును కూడా దాటేస్తారు. అందుకే ఈ మధ్య ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. తనుకు ఇప్ప్పుడు 75 సంవత్సరాలు. ఇంకా 25 సంవత్సరాలు ముందున్నాయి అన్నారు. అంటే ఇంకా కనీసం ఆయన రెండు సార్లు ప్రధానిగా పనిచేసేందుకు కూడా సిద్దంగా వున్నట్లు చెప్పకనే చెప్పారు. మరో రెండు సార్లు మోడీ ప్రధాని అయితే ఆయన రికార్డు కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా పదిలంగానే వుంటుందని అనుకోవాలి. ఆ తర్వాత కూడా మోడీ రికార్డును తిరగరాసే నాయకుడు వస్తాడన్న నమ్మకం లేదు. ఇంత సుధీర్ఘ కాలం పాటు పాలకుడిగా అవకాశం రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడు తనని ఏదో ఒక కార్యం మీద పంపించాడని మోడీ చెప్పినట్లే నిజం కూడా కావొచ్చు. లేకుంటే ఒక నాయకుడికి ఇంత ఛరిష్మా ఏమిటి? ఆయన అంటే దేశ ప్రజలు ఇంతగా ఆదరించడమేమిటి? రికార్డులన్నీ ఆయనే తిరగ రాయడమేమిటి? ఇంత వయసులో కూడా నవయువకుడిగా వుండడం ఏమటీ? ఏదో ఒక తెలియని శక్తి ఆయనను నడిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అది సామాన్యులకు సాద్యమయ్యేది కాదు. ప్రధాని మోడీకి సన్నిహితుడు, స్నేహితుడిగా వున్న అమిత్‌షాతో కలిసి వేసే రాజకీయ పాచికలకు ఎదురుండదు. తిరుగుండదు. దేశ ప్రజల ఆశీర్వాదమే మోడీ బలం. మోడీ నాయకత్వమే దేశానికి ధైర్యం.

ఘనంగా అవియుక్తురెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా అవియుక్తురెడ్డి జన్మదిన వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తనయుడు యంగ్ డైనమిక్ లీడర్ దొంతి అవియుక్త రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం తిరుపతిరెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజల మన్ననలు పొందాలని . ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోతు చరణ్ సింగ్, మండల ప్రధాన కార్యదర్శి మాలోతు మోహన్, సర్పంచ్ సిద్ధ సంతోష్, నాయకులు వెంగళ దాసు రమేష్, బాలాజీ నాయక్, బత్తిని మల్లయ్య, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, రఫీద్, పోలు దాసరి రాము కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులకు ఉచిత వైద్య సేవలు జిల్లా ఎస్పీ…

గిరిజనులకు ఉచిత వైద్య సేవలు జిల్లా ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో బుధవారం రోజున పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అనంతరం
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవు కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ క్యాంప్ ద్వారా సుమారు 6200 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ (హైదరాబాద్), ఏకశిల హాస్పిటల్ (హనుమకొండ), సిగ్మా హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్స్, శరత్ లేజర్ ఐ కేర్ (హనుమకొండ), భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులైన వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 34 మంది వైద్యులు 9 విభాగాల్లో సేవలు అందించారు.
ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, స్త్రీరోగాలు, కంటి, చర్మ, చెవి-ముక్కు-గొంతు, ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. అదనంగా రక్త పరీక్షలు, టుడికో ఎకో, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ ఓ శ్రీదేవి, డీఎస్పీ సూర్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు

సంతల వేలం వాయిదా మున్సిపల్ కమిషనర్ అంజయ్య…

సంతల వేలం వాయిదా మున్సిపల్ కమిషనర్ అంజయ్య

పరకాల,నేటిధాత్రి

 

2026-27 సంవత్సరానికి గాను పరకాల మున్సిపాలిటీలోని తైబజార్, పశువుల సంత మరియు గొర్రెలు మేకల సంతలకు సంబంధించిన వేలాన్ని 31 మార్చి మంగళవారంనకు వాయిదా వేస్తున్నట్టు పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ వేళలో పాల్గొనాలనుకునేవారు 2లక్షల డిడి,5లక్షల ఇంటి వ్యాలివేషన్ సర్టిఫికెట్స్ మరియు 9చెక్కులు,2500 రూపాయల షెడ్యూల్ ఫామ్ రుసుము చెల్లించి 30 మార్చి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలో సమర్పించి మంగళవారం 11గంటలకు వేలంలో పాల్గొనాలని తెలిపారు.ఏదైనా వివరాలకోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.ఇందులో భాగంగా జిల్లాలోని మహిళా సమాఖ్యల కొరకు చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా క్రాంతి ఎన్నిక…

లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా క్రాంతి ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ జిల్లా కమిటీ సభ్యుడిగాబందు క్రాంతి ఎన్నిక చేశారు
ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడిగా బంధు క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్కూరీ శ్రీకాంత్, బందు సుజాత స్వాతి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం..

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం

మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలో ఏఎన్ఎంఎస్సి కమిటీ సమావేశం ప్రాజెక్ట్ సిడిపిఓ మధురిమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిడిపిఓ మధురిమ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాతా శిశు సంక్షేమం కోసం పౌష్టికాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్ర అభివృద్ధి కోసం ఏఎన్ఎంఎస్సి కమిటీ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ బత్తిని రాజేందర్ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలు గాజుల జ్యోతి, జగన్నాధ దీపికలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటి నుండి పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణ, స్థానిక అంగన్వాడీ టీచర్లు దాసరి రమాదేవి, నల్లా భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు నాడెం రాజ్యలక్ష్మి, బాలుగు రజిత, ఆర్పి అనిత, జ్యోతి, దీపిక, సంధ్య, మమత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దొంతి అవి యుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా దొంతి అవి యుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలు

దుగ్గొండి,నేటిధాత్రి:

 

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి తనయుడు భవిష్యత్ యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వారసుడు దొంతి అవి యుక్త్ రెడ్డి తన తండ్రి సిద్ధాంతాలను ఆచరిస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారన్నారు. భవిష్యత్‌లో మంచి యువ నాయకుడిగా ఎదుగుతారని తెలిపారు.దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ దొంతి అవియుక్త్ రెడ్డి ప్రజల మనిషిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హింగే రామారావు, అజ్మీరా దంజ్య నాయక్, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, క్లస్టర్ ఇంచార్జిలు ఇంగోలు రాజేశ్వర్ రావు, చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగ రావు, రొట్టె రమేష్, అంబరగొండ రాజేశ్వర్ రావు, సర్పంచులు భూర రాధిక హేమచందర్, కూరతోట స్వప్న సురేష్, కొల్గురి సుజాత సుమంత్, పార్టీ సీనియర్ నాయకులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ముత్యాల కుమార స్వామి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెండి సక్కుబాయి, దుగ్గొండి మండల మహిళా అధ్యక్షురాలు బుర్రి సునీత, నాయకురాలు మమతతో పాటు వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఎస్ ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

ఎస్ ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వీటు తో శాలువా కప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి జిట్టబోయిన సాంబయ్య తో కుక్క ముడి రమేష్ బిజెపి ఒకటవ వార్డ్ మెంబర్ బానోత్ సంగులాల్ జిల్లా ఎస్టి సెల్ నాయకులు మండల నాయకులు మామిడిపల్లి మల్లయ్య మామిడి రవి గుండ సంపత్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

#నెక్కొండ, నేటి ధాత్రి:

బంజర్‌పల్లిలో అభివృద్ధి పనులకు ప్రజల ప్రశంసలు
నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామ పరిధిలోని పొన్నాలవాడలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కి అశోక్ , నెక్కొండ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ఇటువంటి పనులు కొనసాగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం అధిక ధరల అమ్మకాలపై చర్యలెప్పుడు…

మద్యం అధిక ధరల అమ్మకాలపై చర్యలెప్పుడు

దుగ్గొండి మండలంలో మద్యం దుకాణాలపై చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

బెల్టు షాపులపై మమకారం..గుడుంబా అమ్మకాలపై దాడులు

బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులు

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దుగ్గొండి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో వందల కొద్ది అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కాని ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వాటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ‘దుగ్గొండి మండలంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు” అనే వార్త శీర్షికను నేటి ధాత్రి దినపత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. మీ కథనంపై స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని నేటిధాత్రి ప్రతినిధులతో తెలిపినప్పటికీ రోజులు గడుస్తున్న చర్యలు తీసుకోవడంలో మాట తప్పడం పట్ల ఆంతర్యం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నాటుసారా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ గ్రామాలలో బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలు ఒకే దుకాణాలలో జరుగుతున్నప్పటికీ గుడుంబా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన సంబంధిత ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల రోజువారి కూలికి వెళ్లే సాధారణ ప్రజలు గ్రామాల్లో మద్యానికి బానిసై వారి కుటుంబాలు ఇచ్చిన పరిస్థితి లేనుకుంటున్నాయని పలువురు సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో ఒక మద్యం షాపు గిన్నిబావిలో రెండు మద్యం షాపులలో బెల్ట్ షాపుల పేరుతో అధిక ధరలకు చేపడుతూ సిండికేట్ పేరుతో దందా నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శలు ఎదురవుతున్నాయి.

 

 

 

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు వివరణ కోసం సంప్రదించక గత కొన్ని రోజులు స్పందించకపోవడం గమనార్హం.

మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్…

మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్:
నేటి ధాత్రి:- శ్రీరాంపూర్:-

మూడవ వార్డు శ్రీరాంపూర్ ప్రజల సమస్యలు కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్. మేయర్ ధరణి మధును కలిసి కృష్ణ కాలనీలో ఉన్న నీటి సమస్యలను. పరిష్కరించాలని కోరుతూ బోరు మోటార్స్ కొత్తవి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అలాగే. మూడో వార్డులో ఉన్న ఇంకెన్నో సమస్యలు కూడా మాకు వీలైనంత త్వరగా చేకూర్చాలని మేయర్ పత్తి పకృతి వెంకటేష్ తెలిపారు. ఎలాంటి సమ స్యలైనా నా ప్రజలకు నేను తీర్చిదిద్దుతానని చెప్పాను. నాకు వీలైనంత త్వరగా మా యొక్క పనులు పూర్తి చేయాలని మేయర్ ను కోరడం జరిగింది.

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన సుర చెన్నమల్లు అనే వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబానికి మేమున్నామంటూ ఒకటో వార్డు యువత, వార్డ్ ప్రజలు కలిసి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చెన్నమల్లు కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వార్డు ప్రజలు ,యువత కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఇంకెవరైనా దాతలు ఉంటే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చొరవ తీసుకోవాలని ఒకటో వార్డ్ యువత కోరారు. ఈ కార్యక్రమంలో ఆశనవేని సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య పిల్లి సతీష్, ముక్తి శ్రీనివాస్, మేకల కుమారస్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పిడిసిల్ల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

పిడిసిల్ల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

మొగుళ్లపల్లి నేటి దాత్రి.

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచి శ్రీమతి నైనాకంటి మమతా రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్ శ్రీ నన్న రామస్వామి ఉపసర్పంచ్ శ్రీమతి మాదం చైతన్య ఏఏపీసీ చైర్మన్ గొర్రె సుమలత మరియు వార్డ్ మెంబర్ కొండ్ర శోభ హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ నైనకంటి మమత రెడ్డి ప్రారంభించారురిటైర్డ్ ప్రొఫెసర్ నన్న రామస్వామి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు. ఈ సైన్స్ మీద కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జెడ్పిహెచ్ఎస్ పిడిసిల్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులుఎండి సాధిక్ సార్ మాట్లాడుతూ పిల్లలను మరియు సైన్స్ ఉపాధ్యాయులు ఎస్ విజయ్ కుమార్, కొత్తూరు అంకుష్ అభినందించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పిల్లలకు బహుమతుల ప్రధానం వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నన్నే రామస్వామి మాట్లాడుతూ నేను కూడా మీలాగే ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని ఈరోజు రిటైర్డ్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పాఠశాలకు రావడం నాకు గర్వంగా ఉంది. పిల్లలు మీరు ఇష్టంతో చదువుకొని గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలని ఆకాంక్షిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. నిర్మల్ చెక్క బొమ్మల తయారీ దేశంలోనే పేరుగాంచిన ప్రాంతం. అలాంటి చెక్క బొమ్మల తయారీకి ఉపయోగించే కర్ర పోనికి చెట్లు అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు నేను కణజాల వర్ధనం ద్వారా ఆ చెట్ల జాతిని అభివృద్ధి పరచడం జరిగింది. ఈరోజు చాలా కుటుంబాలకు పోనికి చెట్లు ఆధారమవుతున్నాయి.అలాగే వేరుశనగ పంటలో టిక్కా తెగులు నుంచి సెనగ పంటను కాపాడడానికి కప్పలో ఉన్న ఆంటీ జన్యులను వేరుచేసి వేరుశనగ మొక్కలలో ప్రవేశ పెట్టడం ద్వారా వేరుశనగ టిక్కా తెగులు నివారించడం జరిగింది. ఈ విధంగా ఒక డజన్ దేశాలకు పైగా నేను సందర్శించి చాలా పరిశోధనలు చేశాను నాలాగే మీరు కూడా ఈ పాఠశాల నుంచి మంచి మేధావులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళా కార్యక్రమంలో విజయవంతులైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు వారి యొక్క ఉపాధ్యాయ బృందమైనటువంటి రాజమౌళి సార్ రవీందర్ శ్రీనివాస్ సార్ శ్రీధర్ స్వామి మరియు మధుసూదన్ అభినందిస్తున్నాను.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పును గౌరవించాలి….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పును గౌరవించాలి….

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిందని, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్యాతనపల్లిలో ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించాలని అన్నారు. ఫిబ్రవరి 17 న జరిగిన కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం బెయిల్ షరతులలో భాగంగా బుధవారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్ లో సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, కొంగల తిరుపతి రెడ్డి, మద్ది శంకర్,ఆర్నె సమ్మయ్య, యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, కుర్మ దినేష్, సీపెళ్ళి సాగర్, బెల్లం అరున్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో ని ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఓరుగంటి కృష్ణ గౌడ్…

గణపురం మండలంలో ని ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఓరుగంటి కృష్ణ గౌడ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ఉప సర్పంచుల ఫోరం రాష్ట్రఅధ్యక్షులు ఎల్ రాములునాయక్ ఉపాధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్ , ఉపాధ్యక్షులు మొగిలి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం గణపురం మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది
గణపురం ఉప ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా
ఓరుగంటి కృష్ణ గౌడ్ తెలిపారు
గౌరవ అధ్యక్షులుగా పోనగంటి మాలహల్ రావు ఉపాధ్యక్షులుగా గుర్రం లావణ్య మల్లయ్య మైలారం వర్కింగ్ ప్రెసిడెంట్ కనిపర్తి వినయ్ అప్పయ్య పల్లె ప్రధాన కార్యదర్శి, మారవేణి ఐలయ్య బుద్ధారం కోశాధికారి చౌదరి స్వప్న రాజయ్య బసవరాజు పల్లి
ప్రచార కార్యదర్శిగా. దంసాని శ్రీకాంత్ నగరం పల్లె సహాయ కార్యదర్శిగా తూర్పునూరి రమేష్ గౌడ్ కర్కపల్లి
అధికార ప్రతినిధిగా తరిగొప్పుల రాజు కొండాపూర్ కమిటీ మెంబర్లుగా ఇనుముల మమత అనిల్ సీతారాంపూర్
భోగం రమా సాయిలు బురకాయల గూడెం బరిగల శోభ బిక్షపతి గాంధీనగర్ ఎన్నికయ్యారు.

error: Content is protected !!
Exit mobile version