బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం.

బాలురను ఉత్తమ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వం

 

 

అల్గునూర్ సివోఈ నుండి బాయ్స్ హాస్టల్ పిల్లలను వేరే హాస్టల్ కు తరలించవద్దు -మచ్చ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

 

2007 సంవత్సరంలో ఉత్తర తెలంగాణ విద్యార్థుల కొరకు అత్యుత్తమ విద్యను ఐఐటి మరియు నీట్ పరీక్షల గూర్చి ఆనాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కరీంనగర్ జిల్లా అలుగునూరు గ్రామంలో స్థాపించటం జరిగిందని, గురుకుల వ్యవస్థలోనే మొదటిసారి కోఎడ్యుకేషన్ విధానంలో ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్య వరకు స్థాపించి ఎన్నో ఉత్తమ ఫలితాలను తీసుకురావడం జరిగింది.

కారణాలేవైనప్పటికీ నేడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ , కోఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్న ఈకళాశాలను కేవలము బాలికలకు మాత్రమే పరిమితం చేస్తూ బాలురకు ఉత్తమ విద్యా విధానాన్ని దూరం చేస్తున్న వైనం కుట్రతో కూడుకున్నదని భావించక తప్పడం లేదు.

ఏకారణం చేతనో ఉత్తర తెలంగాణ బాలురకు ప్రీమియర్ సివోఈ పాఠశాలను దూరం చేస్తూ ఈప్రాంతపు వారికి తీరని అన్యాయము చేస్తున్నారు.

గౌలిదొడ్డిలో మల్టీజోన్ రెండు నందు బాలురకి మరియు బాలికలకు వేరువేరుగా ఉత్తమ విద్యకొరకు సివోఈలను స్థాపించడం జరిగింది.

రాష్ట్రస్థాయి అడ్మిషన్ విధానము ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఒక మంచి ఎంపికగా ఈకరీంనగర్ ఉండేది.

కానీ మేనేజ్మెంట్ అనాలోచిత కారణంగా మల్టీ జోన్ వన్ నందు బాలురకు నేడు సివోఈ విద్యా విధానము దూరమైనది.

గౌలిదొడ్డిలో బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా కళాశాలలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా, కరీంనగర్లో వేరువేరుగా పెట్టినట్లయితే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది మీరు గమనించిన సమస్యలకు పరిష్కారం దొరికినట్లై అందరికీ న్యాయం జరుగుతుంది.

కరీంనగర్ లోని చింతకుంటను బాలికల కోసం మరియు ప్రస్తుత సివోఈ కరీంనగర్ నీ బాలుర కోసము నడిపినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుందని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అల్గునూర్ సివోఈ అలానే కోనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version