గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తుంది….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

సింగరేణి, పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సిపిఐ పార్టీ ప్రలోభాలకు లొంగదు…

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి అన్ని వార్డుల్లో పోటీ చేసి 14 సీట్లు కైవసం చేసుకున్నా సరే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని, గెలిచిన కౌన్సిలర్లను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కౌన్సిలర్ల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

11వ వార్డు లో గెలిచిన కౌన్సిలర్ బొమ్మ భూమయ్య గౌడ్ ఇంటి సమీపంలోకి సింగరేణి అధికారులు వచ్చి అట్టి భూమి సింగరేణికి సంబంధించిందని, సూచిక బోర్డులు పాతి భూమయ్య గౌడ్ భార్యను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, సిపిఐ కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామకృష్ణాపూర్ లోని కౌన్సిలర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.కౌన్సిలర్ భార్యకు మనోధైర్యాన్ని అందించారు.అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తోందని దుయ్యబట్టారు. సిపిఐ పార్టీ కౌన్సిలర్లను బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న సరే ఎక్కడ కూడా కౌన్సిలర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ బెదరకుండా ముందడుగు వేస్తున్నారని అభినందించారు. క్యాతన్ పల్లి మునిసిపాలిటీ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసి అక్రమంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించారని, అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయ్యిందని అన్నారు. బిఆర్ఎస్, సీపీఐ నాయకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

దాడులకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీసులు తెలిపాలని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిగా విఫలమయిందని, అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి లకు తలొగ్గి కౌన్సిలర్ల కుటుంబాలపై ఒత్తిడి తీసుకొస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి, స్థానిక మంత్రికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సిపిఐ పార్టీ ఎలాంటి ప్రలోభాలకు లొంగదని , పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విప్ జారీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు…

విప్ జారీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు…

మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు విప్ జారీ చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయం లోకి వెళుతుండగా అకారణంగా పోలీసులు అడ్డుకున్నారని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పి రఘునాథరెడ్డి ఆరోపించారు. పోలీసుల సూచనల మేరకు మున్సిపాలిటీ కార్యాలయం నుండి బయటకు వచ్చి టెంట్ వద్ద కూర్చున్నానని ఆయన వివరించారు. గొడవలకు ఆస్కారం లేకుండా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంలో యువత….

ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంలో యువత….

పాలకుల నిర్లక్ష్యంతో రామకృష్ణాపూర్ వెలవెల…

రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఉన్నా సరే ఉపాధి కరువు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఈ ప్రాంతంలో అనేకమంది ఉన్నా సరే ఉపాధి కరువైంది.ఈ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయకపోవడం తో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.బొగ్గు బాయిలు మూతపడటంతో సరైన ఉపాధి సౌకర్యాలు లేక రామకృష్ణాపూర్ పట్టణంలోని యువత నిరుద్యోగులుగా మారిపోయారు.

మహిళలు, యువతులు , యువకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాలలో ఉపాధి నిమిత్తం వెళుతున్నారు.కనీసం కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు సైతం లేని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే ఎన్నికలు పెద్ద సవాలు గానే నిలిచాయి. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో యువతలో కొంత నిరుత్సాహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో పరిపాలించిన రాష్ట్ర స్థాయి నాయకుడైన బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పై చిన్న చూపు చూశారనే నెపంతో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నా సరే ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అంటేనే చిన్న చూపా..? అనే సందేహాలు సైతం ప్రజల్లో లేకపోలేదు. జిల్లా చుట్టూ అభివృద్ధి జరుగుతున్న సరే ఈ మున్సిపాలిటీలో

మాత్రం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందనే భావన ప్రజల్లో వినబడుతోంది. గతం నుండి ప్రస్తుతం వరకు నియోజకవర్గాన్ని పరిపాలించే నేతలు స్థానికేతరులే కావడం, ఇక్కడి ప్రజల బాగోగులు తెలవకపోవడం అందుకు కారణమనే సందేహం లేకపోలేదు. మున్సిపాలిటీలోని 22 వార్డులలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సరిగా లేకపోవడంతో అనేక సమస్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో జీవించేందుకు ఉపాధి లేక ప్రజలంతా వలస వెళుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకోవాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.ఈ ఏరియా అభివృద్ధి జరగాలన్నా సరే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా సరే ఏదైనా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించేలా మంత్రి చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఆర్కేపీ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనే సందేహము లేకపోలేదు.ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశం కలగాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు చేయించేలా స్థానిక మంత్రి చొరవ తీసుకోవాలని ప్రాంత ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….?

కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గానికే పీఠమా..?

మున్సిపల్ పీఠానికి సీపీఐ కీలకం కాబోతుందా..?

రిజర్వేషన్ అనుకూలిస్తే బడా నేతలు బరిలోకి…!

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గమే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే..క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరికి మించి ఒకరు టికెట్ల కోసం స్థానిక మంత్రి వద్ద అపాయింట్మెంటు లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్ దక్కేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్టు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండే కొత్త నేతలు అంతా కలిసి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారిన నేతలు మళ్లీ పాత పార్టీకే వెళదామా లేదా ఇదే పార్టీలో కొనసాగుదామా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పార్టీ నుండి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్లు సంకేతాలు పంపిస్తున్నప్పటికీ, బలమైన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మున్సిపాలిటీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి ఇలాఖాలో మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో అని రాష్ట్ర ప్రజానీకం,పుర ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ పీఠానికి సిపిఐ పార్టీ కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లపై చర్చ….

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల నాయకుల్లో రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా సరే రొటేషన్ లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగానే ఉంది.మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపాదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జర్నలిస్టుకు భారత రాజ్యాంగ ప్రతుల అందజేత

జర్నలిస్ట్ అనిల్ భగత్ కు భారత రాజ్యాంగ ప్రతిని అందించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ.ఎస్టీ కమిషన్ సభ్యులు రెనికుంట్ల ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగం ఇంగ్లీష్ అనువాదం పత్రం జర్నలిస్ట్ అనిల్ భగత్ కు బహుకరించారు. ఈ సందర్భంగా రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు భగత్ సింగ్ యువజన సంఘం పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జర్నలిస్ట్ గా ప్రయాణం సాగిస్తున్న అనిల్ సోదరసమనులు అని చిన్న వయసులో స్వచ్ఛంద సేవకుడిగా, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ గా, అనేక అవార్డుల అందుకోవడం తోపాటుగా కష్ట నష్టాలు చవిచూస్తున్నారు అని అన్నారు. పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల సమస్యలే తన సమస్యగా భావిస్తూ ప్రజల కోసం పరితపించే అనిల్ భగత్ వార్తలకు ప్రజల నుండి అధికారులు ప్రజాప్రతినిధుల వరకు అనేకమంది అభిమానులు ఉన్నారు అని అన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గురించి గళమెత్తె పత్రికా విలేకరులకు రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలని ఆది వారికి వారి వృత్తికి మాత్రమే కాకుండా ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version