కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.

పరుగుల వరద పారిస్తున్న రాహుల్..

ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

 

 

 

 

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు. అతడి సెంచరీకి అంతా ఇంప్రెస్ అవుతున్నారు. వాటే బ్యాటింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

సెంచరీ బాదిన రాహుల్.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (118)తో కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీళ్లిద్దరూ రాణించడం వల్లే 364 పరుగులు చేయగలిగింది భారత్. దీంతో రాహుల్‌ను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనపడకుండా చేస్తున్నాడని, అతడి బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేఎల్ ప్రాక్టీస్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్‌కు వెళ్లే ముందు సన్నాహకాల్లో రాహుల్ పడిన కష్టాన్ని ఇందులో చూడొచ్చు.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్ ముప్పు రామారావు.

దమ్మాయిగూడ నూతన మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్ ముప్పు రామారావు

దమ్మాయిగూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేటి ధాత్రి:

దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీస్ లో కొత్తగా కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నటువంటి వెంకట్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసి సాధనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసిన దమ్మైగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్ ముప్పరామారావు మరియు మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి బ్లాక్ మహిళా ప్రెసిడెంట్ ఈగ శ్వేత రాజు ముదిరాజ్, 6 వార్డ్ మాజీ కౌన్సిలర్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మి రెడ్డి, మరియు దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్..

కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చిన పవన్.. వెంటనే హైదరాబాద్‌కు పయనం

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఏపీ కేబినెట్‌ సమావేశానికి వచ్చిన ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

అమరావతి, జూన్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హైదరాబాద్‌కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (సోమవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలికవసతుల కల్పనకు టెండర్ పిలవడానికి ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలుపనుంది. కొత్తగా మరో 7 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం.

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయల్ యువర్ జహీరాబాద్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వామి ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సందేహాల నివృతి కోసం 99592 26268 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ వినియోగదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభి శేఖం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు అని, ఇప్పటి వరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా పెట్టుబడి సాయం అందించారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ పథకాన్ని కూడా ఇలాగే 2024 ఆగస్టు 15 లోగా పూర్తిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఎకరానికి 5 వేలు చొప్పున ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 6 వేల చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున రైతులకు అందించడం జరిగింది. కేంద్రం కొనుగోలు చేయలేని పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర రామచంద్రయ్య బుర్ర కొమురయ్య పిప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ ముంజల రవీందర్ అంబాల శ్రీను తోట రంజిత్ పద్మ కోమల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా పూల మొక్కలు పంపిణీ.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా పూల మొక్కలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద జన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ జన్మదినం సందర్భంగా దివాస్ కార్యక్రమాలలో బాగంగా నేడు మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాల పల్లం అన్నపూర్ణ అధ్వర్యం అమ్మ పేరు తో మొక్కలు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్,మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష,జిల్లా ఉపాధ్యక్షురాలు ఆసాని లావణ్య, మరియు పండుగ మాధవి,సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు వైశాలి,కొనరావుపేట్ మండల మహిళా అధ్యక్షురాలు తీగల జయశ్రీ,బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, కొంపల్లి రాజేందర్ సిరిసిల్ల వంశీ,అభి,తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

నాగారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేటి ధాత్రి:

 

జూన్ 23 నుండి జూలై 6 వరకు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ నుండి జన్మదిన వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపుమేరకు మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆద్వర్యంలో నాగారం మున్సిపాలిటీ ఆర్ ఎల్ నగర్ శ్రీ స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అమ్మ పేరు మీద మొక్క నాటే కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రెటరీ మాధవి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యాంసుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్
సీనియర్ బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి, పోతంశెట్టి, సురేందర్ , శ్రీనివాస్,జ్యోతి పాండే శైలజ ,విజయలక్ష్మి ,శారద మరియు మండల మహిళలు, మహిళ మోర్చా నాయకురాళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.

డ్రగ్స్ పై అధికారుల ఉక్కు పాదం.

డ్రగ్స్ పై అధికారుల ఉక్కు పాదం

మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ తో కలిసి సమావేశం

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి.గీతే , సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్  సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. జిల్లాలో కొంతమంది వస్త్ర పరిశ్రమ కార్మికులు మద్యానికి బానిసై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇలా జరగకుండా స్థానిక కౌన్సిలర్ ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ను ఆదేశించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్ మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు.
మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలనీ  వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని  కలెక్టర్ సూచించారు.

అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వారం రోజుల వరకు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు , యువతకు, ప్రజలకు ,విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.

విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితాన్ని నాశనం చేస్తాయి…డ్రగ్స్ కు నో చెప్పండి అనే పోస్టర్లు రిలీజ్ చేశారు.I AM ANTI DRUG SOLDIER అనే పోస్టర్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి అందరూ I AM ANTI DRUG SOLDIER* గా నమోదు చేసుకొని మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ కోరారు.
సమావేశంలో డీ.ఎం.హెచ్ ఓ రజిత, డీ.ఏ.ఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది.

న‌వీన్‌చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ అదిరింది

 

 

 

 

వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర ) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు.

ఇటీవ‌ల‌ బ్లైండ్ స్పాట్‌, ఎలెవ‌న్ వంటి వ‌రుస థ్రిల్ల‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న న‌వీన్ చంద్ర (Naveen Chandra) మ‌రోసారి ఓ వైవిధ్య‌భ‌రిత చిత్రం ‘షో టైమ్‌’ (Show time) తో అల‌రించేందుకు రెడీ అయ్యాడు. కామాక్షీ భాస్కర్ల (Kamakshi Bhaskarla), సీనియ‌ర్ న‌రేశ్ (VK Naresh), రాజా ర‌వీంద్ర (Raja Ravindra ) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అనిల్‌ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిశోర్‌ గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మదన్‌ దక్షిణామూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టీ వినోద్‌రాజా సినిమాటోగ్రఫీ, శేఖర్‌ చంద్ర సంగీతం, శ్రీనివాస్ గ‌విరెడ్డి డైలాగ్స్‌ అందించారు.

ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై4 థియేట‌ర్‌లో విడుద‌లకు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం ఓ ఈవెంట్ నిర్వ‌హించి రిలీజ్‌ చేశారు. ఈట్రైల‌ర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో ఇంట్లో అల‌ని స్నేహితుడు అనుకోకుండా చ‌నిపోవ‌డం, దీంతో హీరో ప‌క్క‌నే ఉండ ఏ లాయ‌ర్‌ను పంప్ర‌దించ‌డం, ఆపై పోలీసుల రాక‌తో ఇంత‌కు హ‌త్య చేసింది ఎవ‌రు అనే పాయింట్‌తో సినిమాను రూపొందించిన‌ట్లు ఉండి ఇట్టే ఆక‌ట్టుకుంటుంది.

కొత్త తరహా చిత్రం.

కొత్త తరహా చిత్రం

 

 

 

 

అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్‌ డైరీస్‌ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం…

‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్‌ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్‌ డైరెక్టర్‌ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్‌ జెన్నిఫర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్‌ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్‌ యాక్షన్‌ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.

లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

Kuberaa: లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

 

 

 

 

గత‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.

నాగార్జున (nagarjuna), ధ‌నుష్ (Dhanush), ర‌ష్మిక (Rashmika mandanna) కాంబోలో జీనియ‌స్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కి గ‌త‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా (Kuberaa). పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అస‌లు ఇలాంటి సినిమాను ఎక్స్‌ప‌ర్ట్ చేయ‌లేదంటూ పలువురు ధ‌నుష్‌, నాగార్జున‌, శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఆకాశానికెత్తేశారు.

మరి కొంత‌మంది మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. సినిమాలో మిస్స‌యిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొంద‌రు ఈ చిత్రం ప్ర‌స్తుత బీజేపీ పాల‌న‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఉంద‌ని కూడా అనేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు అంటూ త‌న సందేహాలను వ్యక్తం చేయగా… ఇప్పుడ‌వి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజ‌మే క‌దా అని అంటుంటే.. మరికొంద‌రు సినిమాను సినిమాలానే చూడాలంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. మరి ఆ నెటిజ‌న్ ప్ర‌శ్న‌లు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి..

కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు

1.బంగాళాఖాతంలో ఆయిల్ ప‌డుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోడానికి నీర‌జ్ అనే వ్యాపారి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కి ల‌క్ష కోట్లు లంచం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. నీర‌జ్ ఎవ‌రు? దేశంలో ఆయ‌న్ని తెలియ‌ని వారు లేరు. ల‌క్ష మంది ఉద్యోగులున్న కంపెనీల‌కీ య‌జ‌మాని. ఆయ‌న కింద ఎంత మంది చార్టెర్డ్ అకౌంటెంట్‌లు వుంటారో , ఏ రేంజ్ ఫైనాన్స్‌ నిపుణులు వుంటారో ఊహించుకోవ‌చ్చు. ఆ రేంజ్‌కి చేరుకోవాలంటే గ‌వ‌ర్న‌మెంట్‌లో ఎంద‌రిని, ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌ని అమాయ‌కుడు కాదు. అయినా కొత్త‌గా అప్పుడే ఏదో డీల్ వ‌చ్చిన‌ట్టు, తండ్రి చెప్పిన మాట‌లు విని, జైల్లో ఉన్న సీబీఐ అధికారిని , కేసు నుంచి విడిపించి మ‌రీ ల‌క్ష కోట్ల డీల్ అప్ప‌చెబుతాడు. డ‌బ్బులిస్తే అన్ని విలువ‌ల్ని వ‌దిలేసుకునే స‌మ‌స్త యంత్రాంగం చుట్టూ వుంటే, అంద‌ర్నీ వ‌దిలి, విలువ‌ల గురించి మాట్లాడే నాగార్జున‌ను తెచ్చుకుని, కొరివితో త‌ల గోక్కుంటాడా? సినిమాటిక్ లిబ‌ర్టీ అంటారా!

2.నాగార్జున విష‌యానికి వ‌ద్దాం. సీబీఐ అధికారి కావాలంటే చాలా చ‌దివి వుండాలి. అధికారం ఉన్న‌పుడు విలువ‌ల‌కి క‌ట్టుబ‌డి వుండాలంటే చాలా నైతిక శ‌క్తి కావాలి. నీర‌జ్ ఎంత శ‌క్తిమంతుడో తెలిసి కూడా , దాడి చేసి ఫైన్ క‌ట్టించాడంటే ఎంతో నిబ‌ద్ధ‌త కావాలి. ముక్కుసూటిగా ప‌నిచేస్తే ఎన్ని శ‌క్తులు త‌న‌మీద ప‌గ ప‌డ‌తాయో తెలియ‌ని అమాయకుడు కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకెళ్లాడు. కోర్టులో న్యాయం జ‌ర‌గ‌లేదు. భార్యాబిడ్డ‌ల వైపు మొగ్గి , నీర‌జ్‌కు లొంగిపోయాడు. మ‌నీల్యాండ‌రింగ్ , షెల్ కంపెనీలు, ఫైనాన్స్‌ ఎక్స్‌ఫ‌ర్ట్‌ల ప‌ని. కానీ నీర‌జ్ గొర్రెలా సీబీఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు. సినిమా లిబ‌ర్టీ ఓకే. నాగార్జున చేసిందేమంటే న‌లుగురు బిచ్చ‌గాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డం. దీనికి న‌లుగురు ఎందుకు? ఒక‌డితోనే లాగించొచ్చు. కానీ క్లైమాక్స్‌కి ఖుష్బు , ఆమె కొడుకు అవ‌స‌రం. ఇది ద‌ర్శ‌కుడి లిబ‌ర్టీ. బిచ్చ‌గాళ్ల‌ని తెచ్చి , క‌టింగ్ చేసి, గ‌డ్డాలు తీసి, కోటు వేసి, సీఈవోని చేసి రోబో అనే వాడి చేతిలో హ‌త్య చేయించ‌డం ఇదంతా ఓవ‌ర్‌గా లేదా? శేఖ‌ర్ క‌మ్ముల‌కి తెలియ‌నిది ఏమంటే డ‌బ్బున్న వాళ్లంద‌రూ డ్రైవ‌ర్ల‌ని, తోట‌మాలీలు, వాచ్‌మెన్ల‌ని బినామీలుగా పెట్టుకుంటారు. దోవ‌లో పోయే బిచ్చ‌గాళ్ల‌ని ట్రైనింగ్ చేయించ‌రు. నీ పేరు మీద క్ష‌ణాల్లో కోట్ల‌ రూపాయిలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి, అమెరికా ప్ర‌యాణం చేయించ‌గ‌ల నిపుణులు అమీర్‌పేట‌లోనే ఉన్నారు. అబిడ్స్‌, కోఠిలో మామూలు వ్యాపారుల‌కి కూడా హ‌వాలా, మ‌నీ ల్యాండ‌రింగ్ తెలుసు. శేఖ‌ర్ సార్ ప‌ద్మారావున‌గ‌ర్‌లో వుండి, అదే ప్ర‌పంచం అనుకుంటున్నారు.

3.ధ‌నుష్ ఒక బిచ్చ‌గాడు. చ‌దువులేదు కానీ, తెలివి వుంది. జ్ఞాప‌క శ‌క్తి వుంది. మ‌నిషిగా విలువ‌లున్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసుకుంటాడు కానీ, బిచ్చ‌గాడిగా ఎందుకుంటాడు? మ‌రు జ‌న్మ‌లో బిచ్చ‌గాడిగా వుండ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని వాడు , ఇపుడు బిచ్చ‌గాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడ‌నే అనుకుంటే ఎవ‌రో ముక్కూమొహం తెలియ‌ని వాళ్లు, డ‌బ్బులిస్తామ‌ని చెబితే వెళ్తాడా? సూటు బూటు వేసి, సంత‌కం చేయ‌మంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేద‌నే అనుకుందాం. ఇంత‌కీ అత‌ని డ‌బ్బు ఎందుకు ట్రాన్స్‌ఫ‌ర్ కాలేదు?

4.ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, ఓల్డ్‌మాంక్ పేరు చెప్పి ఎవ‌డైనా ప్లాట్‌లోకి వెళ్ల‌గ‌లిగే ఇంట్లో బోలెడు డ‌బ్బు, బంగారం దాచిన అధికారి ఎంత అమాయ‌కుడు? అస‌లు అత‌ని క‌థ ఏంటి?

5.బ్యాంకింగ్ అవ‌గాహ‌నే లేని ధ‌నుష్ ఒక ట్ర‌క్కు నిండా నోట్ల క‌ట్ట‌ల‌ని విల‌న్ ఇంటి ముందు ఎలా వేసాడు?

6.నంబ‌ర్ వ‌న్ బిజినెస్ టైకూన్, ఒక బిచ్చ‌గాడిని హ్యాండిల్ చేయ‌లేక బిచ్చ‌గాడిగా మారిపోతాడా?

7.ఎవ‌రో తెలియ‌ని ఖుష్బూని ర‌క్షించిన నాగార్జున ఒక సిన్సియ‌ర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు?

8.సినిమాలో ర‌ష్మిక‌నే కొంచెం స‌హ‌జంగా వుంది. కానీ బిచ్చ‌గాడిని న‌మ్మి అన్ని రిస్క్‌లు తీసుకోవ‌డం కొంచెం అస‌హ‌జం.

9.శేఖ‌ర్ క‌మ్ముల ఒక కంగాళీ సినిమాని తీస్తే, కార‌ణాలు ఏమైతేనేం అంద‌రూ భుజాల‌కెత్తుకుంటున్నారు. నా లాంటి అజ్ఞానుల‌కే స‌మ‌స్య‌.

10.చివ‌రిగా .. శేఖ‌ర్ సార్ మీ అభిమానిగా చెబుతున్నా. మీరొక మంచి సినిమా తీయాల‌నుకుని తీయ‌లేక‌పోయారు. ఆహా, ఓహో భుజ‌కీర్తుల్ని న‌మ్మ‌కండి. అవి దేవ‌తా వ‌స్త్రాలు.

11.ధనుష్ నోట్ల క‌ట్టలు ఇచ్చి అంతిమ యాత్ర చేసినా , బండెడు నోట్ల క‌ట్ట‌లు రోడ్డు మీద కుమ్మ‌రించినా, మీడియా , సోష‌ల్ మీడియా ఏమై పోయాయి? అస‌లు ఈ సినిమా ఏ కాలం నాటిది?

12.డ‌బ్బున్న వాళ్ల‌దే న్యాయం. వాళ్లు పేద‌వాళ్ల‌తో ఆడుకుంటారు, వాడుకుంటారు. నిజ‌మే. టికెట్ రేట్ల‌ని పెంచి మీరు చేస్తున్న‌దేంటి? దోపిడీ కాకుండా వేరే ప‌దం ఏమైనా వుందా?

13.శేఖ‌ర్ క‌మ్ముల రూ.150 కోట్ల‌తో జూదం ఆడారు. మీరు మంచి అట‌గాడే కానీ ముక్క‌లు ప‌డ‌లేదు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు

 

 

 

 

 

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో ‘సైకోట్రాఫిక్‌’ రకం డ్రగ్‌ను తీసుకున్నట్టు తేలింది. ‘తీంగిరై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్‌ కావాలని నటుడు శ్రీరామ్‌ కోరగా, కెనడా దేశానికి చెందిన డ్రగ్‌ ఫెడ్లర్‌ జాన్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్‌కుమార్‌ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం ఉదయం నుంగంబాక్కంలోని శ్రీరాం నివాసానికి వెళ్ళి విచారించగా, డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి రక్తం శాంపిల్స్‌ సేకరించి వైద్య పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరాంను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కొనుగోలు కోసం శ్రీరామ్‌ రూ.72 వేల వరకు డ్రగ్‌ ఫెడ్లర్‌కు చెల్లించినట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా

 

స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

 

 

 

 

ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2).

చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

అజ‌య్ రావు (Ajay Rao) హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌న్ భ‌ట్ (Pavan Bhat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌కాశ్ బెల‌వాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్‌ అర్చ‌న జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభ‌ర‌ణ (T. S. Nagabharana) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రెండు నెల‌ల క్రితం ఏప్రిల్18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ నాట మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

సుమారు రెంఉ గంట‌ల నిడివితో గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే త‌మ్ముడు పాడు చేశాడ‌ని త‌ల్లి నివేదిత‌ కోర్టుకెళుతుంది.
అయితే అక్క‌డ నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా న్యాయం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ ఓ రోజు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే నిందితుడిని అంద‌రి ముందే గ‌న్‌తో కాల్చి చంపుతుంది.
దాంతో ఆమె జైలే పాల‌వుతుంది.
ఆమె ఒంట‌రి కావ‌డంతో కేసును వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.
అదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద‌గ్గ‌ర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు.
ఈ నేప‌థ్యంలో నివేదిత దుస్తితి చూసి చ‌లించిన భ‌ర‌త్ ఆ కేసు టేక‌ప్ చేస్తాడు.
మ‌రోవైపు త‌న త‌మ్ముడిని చంపిన నివేదిత‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన శిక్ష వేయించాల‌ని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమిన‌ల్ లాయ‌ర్ రాబ‌ర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డ‌బ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు.
దీంతో పెద్ద లాయ‌ర్ కావ‌డంతో ఓట‌మి ఖాయ‌మ‌ని భ‌ర‌త్‌కు హెల్ప్ చేయ‌డానికి చాలా మంది ముందుకు రారు.

ఈ క్ర‌మంలో భ‌ర‌త్ అంత పెద్ద లాయ‌ర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎలాంటి వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి, ఎవ‌రు పై చేయి సాధించారు చివ‌ర‌కు ఓ యువ‌కుడిని చంపి నేరం చేసిన‌ నివేదిత‌ను బ‌య‌ట‌కు ఎలా తీసుకు వ‌చ్చాడ‌నే ఈ సినిమా క‌థ‌.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుంద‌ని ముందే తెలిసిన్న‌ప్ప‌టికీ క‌థ‌ను న‌డిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.

అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిర‌ప‌రాధులను హీరో విడిపిస్తే..

ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అంద‌రి ముందే నేరం చేసిన ఓ మ‌హిళ‌ను హీరో ఏ విధంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడ‌నే పాయింట్ కొత్త‌గా ఉంటుంది.

ఎలాంటి సినిమాటిక్ లిబ‌రిటీస్ తీసుకున్నార‌నే మాట రాకుండా చ‌ట్టంలో ఉన్న పాయింట్ల‌ను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమా మొద‌ట్లో హీరో అన‌వ‌స‌ర‌ ప్రేమ వ్య‌వ‌హారం త‌ప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా సెకండాఫ్ ఫైన‌ల్ హియ‌రింగ్ స‌మ‌యంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బ‌మ్స్ తీసుకు వ‌చ్చేలా ఉంటాయి.

అందుకు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ను వాడుకున్న విధానం, ఏళ్ల‌కు ఏళ్లు కేసులు పెండింగ్, స‌రైన స‌మ‌యానికి న్యాయం ల‌భించ‌క‌పోవ‌డం అనే పాయింట్లు చ‌ర్చించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబంతో క‌లిసి మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు.!

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల నేటిదాత్రి:

 

చర్ల మండలం కలివేరు గ్రామంలో కల్లూరి సమ్మయ్య ఇళ్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3.

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3

 

దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె…

 

 

 

 

‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు, హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌. అప్పటినుంచి ఈ సినిమా గురించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మలయాళంలో తెరకెక్కనున్న పార్ట్‌ 3 కథ వేరు.. హిందీలో రూపొందే చిత్ర కథాంశం వేరు.. అని. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ గురించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. ‘‘దృశ్యం 3’ని ఒకే కథతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తాం. మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.. కానీ, మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేస్తాం. ప్రస్తుతం స్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. పూర్తయ్యాక హిందీ టీమ్‌కు అందిస్తాం.. అక్కడ పరిస్థితులకు తగినట్లుగా మేకర్స్‌ మార్పులు చేస్తారు’’ అని చెప్పారు. తెలుగులో పార్ట్‌ 3లో వెంకటేశ్‌ నటిస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్‌లో కథానాయకుడిగా మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేశ్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించారు. మలయాళంలో రెండు భాగాలకూ జీతూ జోసెఫ్‌ దర్శకుడు. తెలుగులో, హిందీలో దర్శకులు మారారు.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

సినిమా థియేటర్‌లు

 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

 

 

 

 

 

 

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గోబ్లల్ స్టార్. తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నా… ఆమె తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన యాక్షన్ సినిమాలకూ దూరం కాలేదు. అయితే అవకాశం చిక్కితే తన చిత్రాలు, వెబ్ సీరిస్ ద్వారా వినోదాన్ని పంచడానికీ రెడీ అంటోంది. అలాంటి ఓ వినోదాత్మక చిత్రమే ‘హెడ్స్ ఆఫ్‌ స్టేట్’ (Heads of State).

సినిమా థియేటర్‌లు

గతంలో ‘బేవాచ్, క్వాంటికో, సిటాడెల్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసిన ప్రియాంక ఇప్పుడు యాక్షన్ కామెడీ మూవీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’లో సీనియర్ ఎం.ఐ.6 ఏజెంట్ గా నటించింది. ఆమెతో పాటు జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అలానే జాక్ స్వాయిడ్, స్టీఫెన్ రూట్, కార్లా గుగినో, సారనైల్స్ కీలక పాత్రలు పోషించారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియాంక పాల్గొంటోంది. అమెరికన్ ప్రెసిడెంట్ (జానా సీనా), బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ (ఇంద్రిస్) ఒకసారి విమానంలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళిద్దరిపై శత్రువులు దాడి చేయడంతో వీరి విమానం ఓ ప్రదేశంలో లాండ్ అవుతుంది. అక్కడకూ చేరుకుని శత్రువులు వీరిని హతమార్చడానికి ప్రయత్నిస్తే సీనియర్ ఏజెంట్ నోయెల్ బిస్సిట్ (ప్రియాంక చోప్రా) వీరిని ఎలా కాపాడిందనేదే ఈ మూవీ మెయిన్ థీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి జూలై 2న స్ట్రీమింగ్ అయ్యే ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఏ తీరిన ఆకట్టుకుంటుందో చూడాలి.

ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ సంఘ కృషి మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకై ప్రభుత్వం నిధుల విడుదల

ఇది ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం

చర్ల నేటిధాత్రి:

 

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల కొరకు అలుపెరగని పోరాటం చేసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి పి ఆర్ టి యు టీఎస్ సంఘం పక్షాన పలుమార్లు ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గాను రాష్ట్ర ప్రభుత్వం నేడు 700 కోట్ల రూపాయలు విడుదల చేయనుందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా 270 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపుకు గాను కేటాయించగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది మిగిలిన నిధులతో పెండింగ్ జిపియఫ్ పార్ట్ ఫైనల్స్ తుది చెల్లింపులు మరియు వేతన బకాయిల చెల్లింపు కూడ జరగనుంది
పెండింగ్ బిల్లుల సాధనలో ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల విడుదలకై అవిరామ కృషితో శ్రమిస్తూ ఉన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్ పులగం దామోదర్ రెడ్డి కు పి ఆర్ టి యు టి ఎస్ చర్ల మండల శాఖ చర్ల మండలం అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి వీరభద్రం రాష్ట్ర జిల్లా కార్యదర్శులు వేణు శ్రీనివాస్ గురుమూర్తి కొల్లిపాక హరికృష్ణ రాజు వైవి రాజు పున్నం సారయ్య మీడియం రామకృష్ణ రమణయ్య హర్షం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌.

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మ‌ధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషించగా, మోహన్‌ బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు.

ఇప్ప‌టికే అమెరికా, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లోప్ర‌త్యేక ఈవెంట్లు సైతం నిర్వ‌హించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్ప‌టివ‌ర‌కు క‌థానాయిక‌గా ఉన్న‌ నుపుర్ స‌న‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)ను ఆ స్థానంలోకి వ‌చ్చి చేర‌డం సినిమా పూర్తి చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.
ఆపై ఈ ముద్దుగుమ్మ‌పై చిత్రీక‌రించిన పాట‌లు, స‌న్నివేశాల‌ను కాల‌క్ర‌మంలో మేక‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమా జ‌నాల నోళ్ల‌ల్లో నానేలా చేశారు.
అయితే ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో సినిమా టీం అంతా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో బిజీగా గ‌డుపుతుండ‌గా వాటిళ్లో ఎక్క‌డా ఈ ముద్దుగుమ్మ క‌నిపించ‌క పోవ‌డంపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
కేర‌ళ‌లో జ‌రిగిన ప్రొగ్రాంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ నాట శివ రాజ్‌కుమార్ వంటి మ‌హా న‌టులు ఈ మూవీ ఈవెంట్‌ల‌లో పాల్గొనగా హీరోయిన్ అక్క‌డా కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు.
అప్పుడెప్పుడో ఏడాది క్రితం సినిమా టీజ‌ర్ ఈవెంట్‌లో క‌నిపించిన ఈ చిన్న‌ది మ‌ళ్లీ ఈ చిత్రం విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించింది లేదు.

అఖ‌రుకు.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన మెయిన్ ఈవెంట్‌లోనూ ప్రీతి క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశం అవుతుంది.

క‌న్న‌ప్ప సినిమాలో తిన్న‌డు ప్రేయ‌సిగా, భార్య‌గా కీల‌క పాత్ర పోషించిన న‌టి ఈవెంట్ల‌లో ఎందుకు క‌నిపించ‌డం లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది.

అంతేకాదు ఇప్ప‌టికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుంద‌న్‌ల‌పై చిత్రీక‌రించిన పాట బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు అందులో హీరోయిన్‌కు వేసిన బ‌ట్ట‌లు, పాట చిత్రీక‌రించిన విధానం తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వ‌చ్చాయి.

ఇది అస‌లు భ‌క్తి చిత్ర‌మా లేక ర‌క్తి మూవీనా అనే వ‌ర‌కు వెళ్లింది.

కాగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్ర‌ధానంగా హీరోయిన్ ప్రీతి న‌టించిన యుద్దం, ఎమోష‌న‌ల్, రొమాంటిక్ స‌న్నివేశాలే అధికంగా చూపించ‌డం విశేషం.

అలాంటిది పాన్ ఇండియాగా విడుద‌ల‌వుతున్న ఇంత‌ పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన న‌టి ఇ్ప‌పుడు ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈవెంట్‌కు చిన్న క్యారెక్ట‌ర్ చేసిన సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్క‌లోకి తీసుకోలేదా, ఈవెంట్ల‌కు పిల‌వ‌డం మ‌రిచారా, కావాల‌నే దూరం పెట్టారా లేక త‌నే రానందా అనే ప్ర‌శ్న‌లు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.

ఈవెంట్‌లో సైతం ప్రీతి గ‌రించి, ఆమె పాత్ర‌, న‌ట‌న‌ గురించి మాట్లాడిన‌ట్లుగా కూడా లేదు.

అఖ‌ర‌కు బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్ కుమార్ సైతం క‌న్న‌ప్ప టీంతో క‌లిసి ఇంట‌ర్వ్యులు ఇచ్చి సినిమా ప్ర‌చారంలో పాల్గొంటు త‌న వంతు సాయం అందించారు.

అలాంటిది క‌న్న‌ప్ప సినిమాలో మెయిన్ పిల్ల‌ర్ల‌లో ఒక‌రైన‌ హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంట‌ర్వ్యూల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

సినిమా విడుద‌ల‌కు మ‌రొ నాలుగు రోజులే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ప్రీతి ముకుంద‌న్ మీడియా ముందుకు వ‌స్తుందేమోన‌ని బావిస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version