పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 1 రాజీవ్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అధికారులతో కలిసి పారిశుధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, అంతర్గత రహదారులు,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిబంధనలకు లోబడి త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఇండ్ల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మురుగు కాలువ సమస్య, పట్టణ ఆరోగ్య ఉప కేంద్రంలో నెలకొన్న సమస్యలు, ఇంటి పైనుండి విద్యుత్ తీగలు వెళ్లడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రజలకు త్రాగునీరు, వీధి దీపాలు,మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

#నెక్కొండ, నేటి ధాత్రి:

బంజర్‌పల్లిలో అభివృద్ధి పనులకు ప్రజల ప్రశంసలు
నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామ పరిధిలోని పొన్నాలవాడలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కి అశోక్ , నెక్కొండ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ఇటువంటి పనులు కొనసాగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కి శుభాకాంక్షలుతెలిపిన జేఏసీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గ ము) జహీరాబాద్ మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మొహమ్మద్ యునుస్ కి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ తాలూకా బీసీ జేఏసీ ఛైర్మన్ మరియు నాయకులు.ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ విజయమే నిదర్శనం అన్నారు. మీ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, మౌలిక వసతులను మెరుగుపర్చుతూ, ఎన్నో అభివృద్ధి ,సంక్షేమ పథకాలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. విజయవంతంగా , పారదర్శకతతో, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము.మీ భవిష్యత్తు కార్యాచరణను మరింత నిబద్దతో ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో బేసి జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ. అధ్యక్షుడు కొండపురం నర్సిములు,ఉపాధ్యక్షులు శంకర్ సాగర్ ,మైనారిటీ యూత్ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, భుడగజంగం యువ నాయకులు మాదినం శివ ప్రసాద్, వడ్డెర సంఘం యువ నాయకులు శేఖర్, జయ విజ్ఞాన భారతి సొసైటీ డైరెక్టర్లు బాలక్రిష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం

జమ్మికుంట,( నేటి ధాత్రి )

బుధవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ , వైస్ చైర్మన్ జావీద్, లు 3వ మరియు 4వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి, రోడ్లు మరియు మురుగు కాలువల (మోరీ)ల సమస్యలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను బుధవారం నాడు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అజయ్, 3వ వార్డు కౌన్సిలర్ రాజు, 20వ వార్డు పరశురాంలతోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు..

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన గౌడ సంఘం నేతలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ లను మంగళవారం తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొంది, ఇటీవలె చైర్మన్ గా బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌడ సంఘం నేతలు వారికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ లు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు పదవులు దక్కడం అభినందనీయమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూనే, గౌడ సంఘం సమస్యలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. భూపాలపల్లిలో గౌడ సంఘం కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం తో పాటు, గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి నర్సింగం గౌడ్, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, జిల్లా నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, తడుక సుధాకర్ గౌడ్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, బుర్ర రమేష్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, నాగపురి సమ్మయ్య గౌడ్, గైని ఎల్లగౌడ్, సదానందం గౌడ్, జగన్ గౌడ్, రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గండి చిరంజీవి గౌడ్, కె.వి అశోక్ గౌడ్, చిర్రా అశోక్ గౌడ్, గట్టు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version