ఘనంగా ఐకెపి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపిసిసి రమణాదేవి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా బుధవారం రోజున చల్లగరిగ గ్రామంలోని సింధు మహిళా సంఘంలోని మొదటి లీడర్ అయిన సంత పూరి భాగ్యను ఆదర్శ మహిళగా ఎంపిక చేసి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా బుధ వారం రోజున ఘనంగా సన్మానం చేయడం జరిగిందని అన్నారు ,ఈమె మహిళా సంఘం ద్వారా తీసుకున్న రుణాల ద్వారా అభివృద్ధి చెంది గ్రామంలోని మహిళలందరికీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు, ఈమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మహిళ అభివృద్ధి చెందాలని అన్నారు, అలాగే 60 సంవత్సరాలు నిండిన మహిళలను, సంఘంలో చేర్పించాలని అలాగే 15 నుండి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలను కుడా సంఘాలోకి ఆహ్వానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐకెపిసిసి రమణాదేవి , గ్రామైక్య సంఘం ప్రతినిధులు మరియు వివో ఏ తడక శ్వేత మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.