ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎన్నికల హామీలు నెరవేర్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

#నెక్కొండ, నేటి ధాత్రి:

బంజర్‌పల్లిలో అభివృద్ధి పనులకు ప్రజల ప్రశంసలు
నెక్కొండ మండలంలోని బంజర్‌పల్లి గ్రామ పరిధిలోని పొన్నాలవాడలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ రాథోడ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కి అశోక్ , నెక్కొండ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి దిశగా ఇటువంటి పనులు కొనసాగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, దూసుకుపోతున్న పదో వార్డ్ కౌన్సిలర్…

ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, దూసుకుపోతున్న పదో వార్డ్ కౌన్సిలర్

చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్

చేర్యాల నేటిదాత్రి

 

 

చేర్యాల మున్సిపల్ పరిధిలో పదో వార్డు లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చేర్యాల పదవ వార్డ్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రజల మనసును దోచుకుంటున్నారు తమ సొంత ఖర్చులతో బోరు వేయించారు పదో వార్డ్ లో తిలక్ నగర్,బత్తేపు వారి ఇండ్ల వద్ద ఎన్నో ఏండ్లుగా చాలా నీటి ఎద్దడి సమస్య ఉందని ఎన్నికలకు ముందు తెలుసుకొని గెలిచిన వెంటనే ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు వార్డు ప్రజలందరి సమక్షంలో బోరు వేశారు. నీటి కష్టాలు తీరుతున్నాయని ప్రజలు ,హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాల నర్సయ్య, వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా-శ్రీధర్, కౌన్సిలర్స్ నిమ్మ సుప్రజ-రాజీవ్,కమలాపురం గీతాంజలి-రమేష్,భూనాద్రి సురేష్ మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు కాసుల శ్రీనివాస్, ఔషర్ల కిషోర్ పచ్చిమడ్ల పరశురాం ఇప్పకాయల శ్రీకాంత్ వార్డు ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version