విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్….

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజావిగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు. భోజనం బావుంది ప్రతి రోజు ఇలానే చేయాలని వంట సిబ్బందిని అభినందించారు..
పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని,
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా పరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు, ప్రహరీ గోడ పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని..

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయికోటి నర్సింలు అధ్వర్యంలో రాగిజావ పౌష్టికరాన్ని ఉపాధి హామీ కూలీలకు పంపిని చేయడం జరిగింది…సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు యెండ తీవ్రత పెరుగడంవల్ల తనవంతు సహకారంగా ఎనర్జిటిక్ ఆహారమైన రాగిజావా యొక్క లాబాలు తెలియచేసి ప్రతి గురువారం ఈ యొక్క రాగిజావను నా గ్రామ ప్రజలైన మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి ఈ యొక్క పౌష్టికాహారమైన రాగిజావను అందచేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని అందరు వినయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసారు…ఈ కార్యక్రమములో గ్రామ వార్డు సభ్యులు సి హెచ్ పాారమ్మ మాణయ్య, చింతలగట్టు ప్రకాష్,శారదమ్మ,,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,,గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య,బీరయ్య,మాణయ్య,రమేష్,బాలప్ప,సిద్ధప్ప,దేశరత్,పత్రిక మిత్రులు చింతలగట్టు నర్సింలు,గ్రామ యువనాయకులు సాయి గౌడ్, సి హెచ్ సంగమేష్,హరి,గ్రామ ప్రజలు హనుమంత్, దేవదాస్, నర్సింలు,కాశీనాథ్,ఉమాకాంత్, అనిల్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.

మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

మరిపెడ మండలంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మాకులచెరువు, కట్ట ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి

నేటిధాత్రి డోర్నకల్ ఆర్సి/మరిపెడ

 

మండల కేంద్రం లోని జిల్లా, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడి, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,మరిపెడ మండల మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్,ప్రాథమిక మండల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని మాకుల చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందని అందులో భాగంగానే మరిపెడ పట్టణంలోని మాకులచెరువు అభివృద్ధి పనులు నిమిత్తం సుమారు రెండు కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని ఆ యొక్క పనులను వెంటనే పూర్తి చేసి పట్టణ అభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు, అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న పిల్లలకు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని,అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యా బోధనలు ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు సూచించారు,అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వ అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని నెలవారి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి అందించాలని చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యను అందించాలని, కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సామ్, మామ్, ఆరోగ్య వివరాలను నిత్యం క్షేత్రస్థాయిలో గమనిస్తూ వారికి కావలసిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా కలెక్టర్ పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, అంగన్వాడీ కేంద్రాలలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ స్టడీ రూమ్స్ తరగతి గదులు స్టోర్ రూమ్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ క్రిష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ ఆర్. విజయాఆనంద్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version