రామారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్…

రామారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్

69 వాహనాలు సీజ్ – సిఐ నవీన్

జైపూర్,నేటి ధాత్రి:

రామగుండం కమిషనరేట్ పరిధిలోని జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ సీఐ నవీన్,ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి,ఆస్తి సంబంధిత నేరాలు,రోడ్డు ప్రమాదాలు,సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 66 ద్విచక్ర వాహనాలు,3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.వాహనదారులు తప్పనిసరిగా చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…

సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం రామారావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుట కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయాన్ని ముందుగా శుద్ధిచేసి నూతన రంగులతో అలంకరించి సీతారాముల కళ్యాణం కొరకు 10,116 రూపాయలు అందించినట్లు వారు తెలిపారు.అలాగే హనుమాన్ భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version