మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కృతజ్ఞతలు 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి – సదానందం గౌడ్ గణేష్ చౌక్ ప్రాంత పునర్వైభవం కోసం చేస్తున్న కృషికి తొలి విజయం లభించింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, వారసంత, బస్టాండ్ పునరుద్ధరించాలని కౌన్సిలర్ గతంలోనే జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
మున్సిపల్ పాలకవర్గం, బుధవారం నాడు గణేష్ చౌక్ నుండి లక్ష్మీ నగర్, శాంతి నగర్, హనుమాన్ నగర్, సి.ఆర్. నగర్ కాలనీల వరకు ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్వయంగా ఎర్ర చెరువు ప్రాంతాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ మాట్లాడుతూ
మా వార్డులోని గణేష్ చౌక్ ప్రాంతం వెనుకబడకూడదని మొదట కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చాం వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు
పాత గ్రామ పంచాయతీ స్థలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం బస్టాండ్ ఆటో నగర్ అంగన్‌వాడీ ప్రత్యేక భవనాల ఏర్పాటు చేయాలని అయినా అధికారులకు తెలిపారు
